న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఢిల్లీ పగ్గాలు శ్రేయాస్ అయ్యర్‌కే: ట్విట్టర్‌లో వీడియో పోస్టు చేసిన యాజమాన్యం

IPL 2020 : Delhi Capitals Confirms That Shreyas Iyer Will Lead The Team IPL 2020 || Oneindia Telugu
Delhi Capitals confirms that Shreyas Iyer will lead the team in IPL 2020

హైదరాబాద్: వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్‌గా యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ వ్వవహారించనున్నాడు. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం సోమవారం ట్విట్టర్‌లో ఓ వీడియోని పోస్టు చేసింది. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం డిసెంబర్ 19వ తేదీన కోల్‌కతాలో ఆటగాళ్ల వేలం జరగనుంది.

దీంతో ఆటగాళ్ల బదిలీలకు సంబంధించి శుక్రవారం తుది గడువు కావడంతో... రాబోయే సీజన్‌కు ముందు తమ జట్లను మరింత బలంగా మార్చుకోవడానికి పలు ఫ్రాంచైజీలు కొంతమంది ఆటగాళ్లను ట్రేడింగ్ ద్వారా సొంతం చేసుకున్నాయి. ట్రేడింగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ ఆటగాళ్లు అజ్యింకె రహానే, రవిచంద్రన్ అశ్విన్‌లను సొంతం చేసుకుంది.

ఐపీఎల్ 2020: 'టైటిల్ గెలవడానికి కోహ్లీ, ఏబీపై అతిగాఆధారపడొద్దు'ఐపీఎల్ 2020: 'టైటిల్ గెలవడానికి కోహ్లీ, ఏబీపై అతిగాఆధారపడొద్దు'

గత సీజన్‌లో కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్ జట్టుకు అశ్విన్ కెప్టెన్‌గా పనిచేయగా, రహానే సైతం కొన్ని మ్యాచ్‌లకు రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్‌గా వ్వవహారించాడు. తాజాగా, ట్రేడింగ్‌లో వీరిద్దరిని ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకోవడంతో వీరిద్దరలో ఒకరికి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ పగ్గాలు దక్కే సూచనలు ఉన్నాయని వార్తలు వచ్చాయి.

ట్విట్టర్‌లో ఓ వీడియో

సోమవారం ఆ వార్తలకు చెక్ పెడుతూ ఢిల్లీ క్యాపిటల్స్ తన ట్విట్టర్‌లో ఓ వీడియోని పోస్టు చేస్తూ " మా కెప్టెన్ ఫెంటాస్టిక్, వచ్చే సీజన్‌ కోసం ఎంతో ఆతృతగా ఉన్నాడు. అనుభవజ్ఞులైన సూపర్ స్టార్లను జట్టులో చేర్చడంతో పాటు త్వరలో వేలం జరగబోతుంది కాబట్టి... మన కెప్టెన్ అద్భుతమైన జట్టును అన్ని విధాలా నడిపించగలడా?" అంటూ శ్రేయస్ అయ్యర్ ఉన్న పోస్టు చేసింది.

సంతోషం వ్యక్తం చేసి శ్రేయాస్ అయ్యర్

సంతోషం వ్యక్తం చేసి శ్రేయాస్ అయ్యర్

ఆ వీడియోలో అశ్విన్, రహానే లాంటి సీనియర్ ఆటగాళ్లు జట్టుతో చేరడాన్ని సంతోషం వ్యక్తం చేసి శ్రేయాస్ అయ్యర్, వేలం కోసం తాను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని... వచ్చే సీజన్‌లో తన కెప్టెన్సీలో ఢిల్లీ టైటిల్‌ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ టైటిల్‌ ముంగిట బోల్తా పడింది.

ట్రెంట్ బౌల్ట్‌ను ముంబైకి

ట్రెంట్ బౌల్ట్‌ను ముంబైకి

కాగా, గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను ఆ జట్టు యాజమాన్యం ముంబై ఇండియన్స్‌కు బదిలీ చేసింది. ఐపీఎల్ 2018 వేలంలో ట్రెంట్ బౌల్ట్‌ను రూ. 2.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అయితే, ట్రేడింగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు బౌల్ట్ కోసం రూ. 3.2 కోట్లు చెల్లించడం విశేషం.

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు

శ్రేయస్‌ అయ్యర్‌, పృథ్వీషా, శిఖర్ ధావన్‌, రిషభ్‌ పంత్‌, ఇషాంత్‌ శర్మ, అమిత్‌ మిశ్రా, అవేశ్‌ ఖాన్‌, సందీప్‌ లమిచానె, రబాడ, కీమో పాల్‌, అక్షర్‌ పటేల్‌, హర్షల్‌ పటేల్‌, రవిచ్రందన్‌ అశ్విన్‌ (బదిలీ), అజింక్య రహానె (బదిలీ)

వేలానికి విడుదల చేసిన ఆటగాళ్లు

వేలానికి విడుదల చేసిన ఆటగాళ్లు

క్రిస్‌ మోరిస్‌, కొలిన్‌ ఇంగ్రామ్‌, బి అయ్యప్ప, హనుమ విహారి, జలజ్‌ సక్సేన, మన్‌జ్యోత్‌ కల్రా, నాథుసింగ్‌, అంకుష్‌ బేయాన్స్‌, కొలిన్‌ మన్రో

మిగిలిన నగదు

మిగిలిన నగదు

ఐపీఎల్ 2019 వేలానికి ముందు ఢిల్లీ పర్సులో మిగిలి ఉన్న నగదు రూ. 5.3 కోట్లు. తొమ్మిది మంది ఆటగాళ్లను విడుదల చేయడం ద్వారా ఢిల్లీ అత్యధికంగా రూ .19 కోట్లు మిగిలాయి. మరోవైపుబిసిసిఐ వైపు నుండి అదనంగా 3 కోట్ల రూపాయలు వచ్చాయి. దీంతో ఐపీఎల్ 2020 వేలంలో రూ. 27.85 కోట్లు ఖర్చు చేయవచ్చు.

Story first published: Tuesday, November 19, 2019, 11:24 [IST]
Other articles published on Nov 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X