న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఖచ్చితంగా.. ఏదో ఒక రోజు టీమిండియా కోచ్‌ని అవుతా: గంగూలీ

Sourav Ganguly Says 'Definitely One Day I Want To Become India Coach' || Oneindia Telugu
Definitely one day I want to become India coach: Sourav Ganguly

హైదరాబాద్: ఖచ్చితంగా ఏదో ఒకరోజు టీమిండియా కోచ్‌ని అవుతానని టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ తెలిపాడు. టీమిండియా హెడ్ కోచ్‌తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ సహా పలు ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది నియామకానికి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

కోచ్‌ల దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి తేదీని జులై 30గా బీసీసీఐ నిర్ణయించింది. బీసీసీఐ నిర్ణయించిన గడువు ముగియడంతో హెడ్ కోచ్ పదవికి మొత్తం రెండు వేల దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం కోచ్‌ పదవి కోసం అవకాశం లేకపోవడంతో మరొక సందర్భంలో తాను కూడా పోటీలో ఉంటానని గంగూలీ అన్నాడు.

రిటైర్మెంట్‌కు రెడీ: పాకిస్థాన్ జట్టులో మరో వికెట్ పడేందుకు సిద్ధంరిటైర్మెంట్‌కు రెడీ: పాకిస్థాన్ జట్టులో మరో వికెట్ పడేందుకు సిద్ధం

కోచ్ పదవిపై ఆసక్తి

కోచ్ పదవిపై ఆసక్తి

47 ఏళ్ల గంగూలీ ప్రస్తుతం క్రికెట్ ఆసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) ప్రెసిడెంట్‌గా.. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సలహాదారుగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు క్రికెట్ కామెంటేటర్‌గా... పాపులర్ బెంగాలీ క్విజ్ షోకు హోస్ట్‌గా కూడా వ్వవహారిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్యూలో కోచ్ పదవిపై తనకున్న ఆసక్తిని కనబర్చాడు.

టెస్టు జెర్సీలపై పేర్లు, నంబర్లు చెత్తగా ఉన్నాయి: ట్విట్టర్‌లో గిల్లీ

కోచ్‌గా చేయాలని చాలా ఆసక్తిగా ఉంది

కోచ్‌గా చేయాలని చాలా ఆసక్తిగా ఉంది

"నాకు టీమిండియా కోచ్‌గా చేయాలని చాలా ఆసక్తిగా ఉంది. ఇప్పుడు తగిన సమయం కాదు. ప్రస్తుతం నేను బిజీగా ఉన్నా. భవిష్యత్తులో నేను కూడా కోచ్‌ పదవికి దరఖాస్తు చేస్తా. గత కొంతకాలంగా అనేక క్రికెట్‌ సంబంధిత వ్యవహారాలతో ఖాళీ లేకుండా ఉన్నా. ఐపీఎల్‌, క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌(క్యాబ్‌) ప్రెసిడెంట్, టీవీ కామెంటరీ ఇలా పలు వ్యవహారాలు నా ముందు ఉన్నాయి"" అని గంగూలీ పేర్కొన్నాడు.

నేను కూడా రేసులోకి వస్తా

నేను కూడా రేసులోకి వస్తా

"ఒక స్టేజిలో నేను కూడా రేసులోకి వస్తా. ఏదొక సమయంలో భారత క్రికెట్‌ కోచ్‌ పదవికి సెలక్ట్ అవుతా" అని సెన్కో గోల్డ్ & డైమండ్స్ మెన్స్ కలెక్షన్ అవిష్కరణలో గంగూలీ పేర్కొన్నాడు. కాగా, టీమిండియా హెడ్ కోచ్ రేసులో ప్రస్తుత కోచ్ రవిశాస్త్రితోపాటు మాజీ క్రికెట‌ర్లు మ‌హేళా జ‌య‌వ‌ర్ద‌నేతో పాటు గ్యారీ కిర్‌స్టన్‌, టామ్‌ మూడీ, మైక్ హెస్సన్‌లతో పాటు న్యూజిలాండ్ మాజీ, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ప్రస్తుత కోచ్ మైక్ హెస్సన్ కూడా దరఖాస్తు చేసుకున్నాడని తెలుస్తోంది.

విభేదాల మధ్య విండిస్ పర్యటన: ఫ్లోరిడాలో రోహిత్‌పై కోహ్లీ పైచేయి సాధించేనా?

కొత్త కోచ్‌ను ఎంపిక బాధ్యత క్రికెట్ సలహా కమిటీదే

కొత్త కోచ్‌ను ఎంపిక బాధ్యత క్రికెట్ సలహా కమిటీదే

ఇక, భారత్ నుంచి మాజీ క్రికెటర్లు రాబిన్‌సింగ్, లాల్‌చంద్ రాజ్‌పుత్‌లు కూడా ఇటీవలే ఈ పదవికి దరఖాస్తు చేశారు. టీమిండియా ఫీల్డింగ్ కోచ్ పదవి కోసం దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ జాంటీ రోడ్స్ దరఖాస్తు చేశాడు. ఇక మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన క్రికెట్ సలహా కమిటి(సీఏసీ) కొత్త కోచ్‌ను ఎంపిక చేయనుంది. ఈ కమిటీలో మాజీ క్రికెట‌ర్లు క‌పిల్ దేవ్‌, మాజీ మెన్స్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్, మహిళా జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామిల‌ు సభ్యులుగా ఉన్నారు.

Story first published: Friday, August 2, 2019, 20:04 [IST]
Other articles published on Aug 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X