Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విభేదాల మధ్య విండిస్ పర్యటన: ఫ్లోరిడాలో రోహిత్‌పై కోహ్లీ పైచేయి సాధించేనా?

India vs West Indies T20Is : Virat Kohli Upstage Rohit Sharma In Florida ? || Oneindia Telugu
India vs West Indies T20Is: Can Virat Kohli upstage Rohit Sharma in Florida?

హైదరాబాద్: ప్రపంచకప్ ముగిసింది. ఇక, జట్లన్నీ ద్వైపాక్షిక సిరిస్‌ల్లో నిమగ్నమయ్యాయి. వెస్టిండిస్ పర్యటనలో భాగంగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇప్పటికే అమెరికాలోని ఫ్లోరిడాకు చేరుకుంది. వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.

ఈ పర్యటనలో మొదటి రెండు టీ20లు అమెరికాలోని ప్లోరిడా వేదికగా జరగనున్నాయి. అనంతరం మిగతా సిరిస్ అంతా కరేబియన్ దీవులకు మారనుంది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా తొలి టీ20 శనివారం జరగనుంది. ఈ పర్యటన నుంచి ధోని తనంతట తానుగా తప్పుకోవడంతో పలువురు యువ క్రికెటర్లకు సెలక్టర్లు అవకాశమిచ్చారు.

ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విభేదాలు తలెత్తాయంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వార్తలపై వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరడానికి ముందు విరాట్ కోహ్లీ స్పందించాడు. ఒక వ్య‌క్తి నాకు న‌చ్చ‌క‌పోతే.. దానిని మీరు నా ముఖంలోనో, నా ప్ర‌వ‌ర్త‌న‌లోనూ చూస్తార‌ని కోహ్లీ అన్నాడు.

రోహిత్‌ను ప్రతిసారీ మెచ్చుకున్నా

రోహిత్‌ను ప్రతిసారీ మెచ్చుకున్నా

రోహిత్‌ను తాను ప్ర‌తిసారి మెచ్చుకున్నాన‌ని, అత‌నో గొప్ప ప్లేయ‌ర్ అని, మా ఇద్ద‌రి మ‌ధ్య ఎటువంటి స‌మ్య‌లు లేవ‌ని, ఎందుకు ఇలా జ‌రుగుతుందో అర్థంకావ‌డం లేద‌ని విరాట్ కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా మా ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ సృష్టించ‌డం వ‌ల్ల ఎవ‌రు లాభ‌ప‌డుతారో తెలియ‌ద‌ని విరాట్ కోహ్లీ వివరించాడు.

అగ్రస్థానంలో రోహిత్ శర్మ

అగ్రస్థానంలో రోహిత్ శర్మ

ఇక, టీ20ల్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 94 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 32.37 యావరేజితో 2331 పరుగులు చేశాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో మార్టిన్ గుప్టిల్ ఉండగా... మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ 67 మ్యాచ్‌ల్లో 50.28 యావరేజితో 2263 పరుగులు చేశాడు.

ఏడో స్థానంలో ధోనీని పంపడంపై ఎట్టకేలకు నోరువిప్పిన సంజయ్ బంగర్

పనిభారం కారణంగా కోహ్లీకి విశ్రాంతి

పనిభారం కారణంగా కోహ్లీకి విశ్రాంతి

గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని పనిభారం కారణంగా సెలక్టర్లు అనేక టీ20 సిరిస్‌ల్లో విరాట్ కోహ్లీ విశ్రాంతినిచ్చారు. గతేడాది విరాట్ కోహ్లీ మొత్తం 9 టీ20లాడగా... అదే రోహిత్ శర్మ 19 టీ20లు ఆడాడు. ఇక, 2019లో ఇప్పటివరకు రోహిత్ శర్మ 4టీ20లు ఆడగా... విరాట్ కోహ్లీ కేవలం రెండింట మాత్రం కనిపించాడు.

68 పరుగుల దూరంలో కోహ్లీ

68 పరుగుల దూరంలో కోహ్లీ

రోహిత్ శర్మ రికార్డుని అందుకునేందుకు విరాట్ కోహ్లీ కేవలం 68 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే, వెస్టిండిస్ పర్యటనలో రోహిత్ శర్మ మరో రికార్డుకి చేరువయ్యాడు. రోహిత్ శర్మ మరో 5 సిక్సులు బాదితే టీ20ల్లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్ రికార్డుని అధిగమిస్తాడు.

రోహిత్ ఖాతాలో సిక్సర్ల రికార్డు

రోహిత్ ఖాతాలో సిక్సర్ల రికార్డు

ప్రస్తుతం ఈ జాబితాలో వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్(105 సిక్సులు), మార్టిన్ గుప్టిల్(103) సిక్సులతో మొదటి రెండు స్థానాల్లో ఉండగా... రోహిత్ శర్మ 94 టీ20ల్లో 101 సిక్సులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే కోహ్లీ-రోహిత్ మధ్య విభేదాల వార్తలు వచ్చిన నేపథ్యంలో టీమిండియా విండిస్ పర్యటనకు బయల్దేరింది. దీంతో ఈ సిరిస్ మరింత ఆసక్తికరంగా మారింది.

అత్యధిక పరుగులు చేసేది అతడే: యాషెస్ విజేత ఎవరో చెప్పేసిన లారా!

Story first published: Friday, August 2, 2019, 15:52 [IST]
Other articles published on Aug 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+