న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్: తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక

Deepti Sharma gets Sri Lanka opener Umesha Thimashini

మెల్‌బోర్న్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఆ జట్టకు దీప్తీ శర్మ ఆదిలోనే దెబ్బతీసింది. ఓపెనర్ ఉమేశా తిమాసిని(2)ని క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి భారత్‌కు శుభారంభాన్నిచ్చింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హర్షిత మాద్వి(10 బ్యాటింగ్)తో కెప్టెన్ చమరి పట్టు(23 బ్యాటింగ్) ధాటిగా ఆడుతోంది. దీంతో శ్రీలంక మహిళలు పవర్‌ప్లే ముగిసే సరికి వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. ఇక ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న భారత మహిళలు.. ఈ మ్యాచ్‌తో తమ లోపాలను సరిదిద్దుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యానికి పరిష్కారం కనుగొనాలని, విజయంతో నాకౌట్‌కు ముందు మరింత ఆత్మవిశ్వాసాని రెట్టింపు చేసుకోవాలని పట్టుదలతో ఉన్నారు మరోవైపు వరుస రెండు మ్యాచ్‌ల్లో ఓడి నాకౌట్ రేస్‌ నుంచి తప్పుకున్న శ్రీలంక హర్మన్‌ప్రీత్ సేనకు షాక్ ఇచ్చి బోణీ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది.

తుది జట్లు :
భారత్: స్మృతి మంధాన, షెఫాలి వర్మ, తానియా భాటియా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తీ శర్మ, వేద కృష్ణమూర్తి, శిఖా పాండే, రాధా యాదవ్, రాజేశ్వర్ గైక్వాడ్, పూనమ్ యాదవ్

శ్రీలంక: హాసిని పెరెరా, చమరి ఆటపట్టు, ఉమేశా, అనుష్క సంజీవని, నీలాక్షి డి సిల్వా, అమ కంచన, శశికళ సిరి వర్ధనే, హర్షిత మాద్వి, కవిష డిల్‌హరి, సుగందిక కుమారి, ఉదేశిక ప్రబోధని

Story first published: Saturday, February 29, 2020, 10:10 [IST]
Other articles published on Feb 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X