న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెప్పినా వినలేదు, అందుకే ఔట్ చేశా.. పూర్తి క్లారిటీ ఇచ్చిన దీప్తి శర్మ..! తప్పు లేదంటూ ఎంసీసీ ప్రకటన

Deepti Sharma Gave A Clarity About The Charlie Dean Controversy Runout

భారత్ వుమెన్, ఇంగ్లాండ్ వుమెన్ జట్ల మధ్య లార్డ్స్‌లో జరిగిన మూడో వన్డేలో నాన్ స్ట్రైకర్స్ ఎండ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ ఛార్లీ డీన్‌ను దీప్తి శర్మ మన్కడింగ్ విధానంలో రనౌట్ చేసిన విషయం పెనుదుమారమైన సంగతి తెలిసిందే. అయితే ఈ రనౌట్ కావడానికి ముందే చార్లీ డీన్‌కు తాను వార్నింగ్ ఇచ్చానని, అంపైర్లకు కూడా ఈ విషయమై సమాచారం అందించానని భారత క్రికెటర్ దీప్తి శర్మ స్పష్టం చేసింది. 40పరుగులు చేసిన ఛార్లీ డీన్ చివరి వికెట్‌గా ఔటవ్వడంతో భారత్ 16పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక ఇదే మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుండి ఝులన్ గోస్వామి రిటైర్మెంట్ తీసుకుంది.

ఎంత చెప్పినా వినకుండా ముందుకెళ్తూనే ఉంది

ఎంత చెప్పినా వినకుండా ముందుకెళ్తూనే ఉంది

'ఇది మా ప్రణాళికలో ఒక భాగం. ఎందుకంటే ఆమె క్రమం తప్పకుండా క్రీజు నుంచి బయటికొస్తుంది. బాల్ వేయకముందే అలా ఎలా ముందుకెళ్తావ్ అని మేము అప్పటికే ఆమెను హెచ్చరించాం. మేము నిబంధనలనే పాటించే ఔట్ చేశాం.'అని దీప్తి పేర్కొంది. 'ప్రతి జట్టు ఫీల్డ్‌లో గెలవాలని కోరుకుంటుంది. ఈ మ్యాచ్ మేం గెలవడం ద్వారా ఝులన్ గోస్వామికి ఘన వీడ్కోలు ఇచ్చినట్లయింది.

జట్టుగా మేం చేయగలిగినదంతా చేశాం. ఇక రనౌట్ విషయంలో మేము అంపైర్లకు ముందే సమాచారం అందించాం, కానీ ఆమె అవేమీ పట్టించుకోకుండా క్రీజులో ముందుకు వెళ్తూనే ఉంది. ఇక మేం ఏం చేస్తాం చెప్పండి. అందుకే ఔట్ చేశా' అని దీప్తి భారత్‌కు తిరిగి వచ్చాక విలేకరులతో తెలిపింది. దీప్తి మన్కడింగ్ పద్ధతిలో బ్యాటర్‌ను ఔట్ చేయడం ట్విట్టర్‌లో పెను విమర్శలకు కారణమైంది. ప్రధానంగా ఇంగ్లాండ్ క్రికెటర్లు ఈ విషయమై తమ అసంతృప్తి వెలిబుచ్చారు.

ఆ హక్కు బౌలర్లకు ఉంటుంది

ఇకపోతే ఈ వివాదం తర్వాత.. క్రికెట్ చట్టాల సంరక్షకులైన మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) సోమవారం ఒక కీలక ప్రకటన చేసింది. ఈ ఔట్‌లో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేసింది. ఈ సంవత్సరం క్రికెట్ చట్టాలకు కూడా సవరణలు ప్రకటించింది. ఈ రకమైన ఔట్ నాన్-స్ట్రైకర్స్ ముగింపులో రనౌట్ అవుతుంది. ఒక బౌలర్ బంతిని విడుదల చేయడానికి ముందు.. నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో బ్యాటర్లు క్రీజును వదలకుండా ఉండాలి. లేకపోతే అతన్ని రనౌట్ చేసే హక్కు తప్పకుండా బౌలర్లకు ఉంటుంది.' అని ఎంసీసీ పేర్కొంది.

దీన్ని తప్పుగా చూడొద్దు

దీన్ని తప్పుగా చూడొద్దు

ఇక ఎంసీసీ దీన్ని ఏదో తప్పు చర్యగా చూడకూడదని కూడా చెప్పింది. ఇది ఓ గౌరవప్రదమైన ఆటగానే భావించాలని పేర్కొంది. చాలా మంది బౌలర్ క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించిందని అంటున్నారు. అది సరైనది కాదు.. నాన్-స్ట్రైకర్ బౌలర్ బంతి వేయడానికి ముందే మైదానాన్ని వీడితే అతనికి అదనపు ప్రయోజనం దక్కినట్లే. అది బౌలింగ్ సైడ్ విషయంలో అన్యాయమే. అందువల్ల బౌలర్ చేతి నుండి బంతి రిలీజ్ అయ్యే వరకు నాన్ స్ట్రైకర్లు.. క్రీజు వీడకూడదు. ఇకపోతే నాన్ స్ట్రైకర్లు బౌలర్‌ను తప్పకుండా గమనించి.. తమ రనప్ మొదలెడితే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. అని ఎంసీసీ తెలిపింది.

Story first published: Monday, September 26, 2022, 14:36 [IST]
Other articles published on Sep 26, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X