న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DeeptiSharma Mankading : దీప్తి సరైన పనే చేసింది.. ఎందుకంటే 72సార్లు బంతి పడకముందే ఛార్లీ క్రీజు దాటింది

Deepti Sharma did A Right Decision as Charlie Dean Out from Creeze 72 Times, Journalist Reveals

శనివారం లార్డ్స్‌లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ ఛేదనలో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 44వ ఓవర్‌లో నాన్‌స్ట్రైకర్స్ ఎండ్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన షార్లెట్ డీన్‌ను భారత స్టార్ క్రికెటర్ దీప్తి శర్మ మన్కడింగ్ విధానంలో రనౌట్ చేయడం పెనుదుమారమైన సంగతి తెలిసిందే. ఇకపోతే ఇంగ్లాండ్‌పై భారత్ 3-0తేడాతో సిరీస్ గెలుపొందింది. చాలా మంది ఇంగ్లాండ్ క్రికెటర్లు, మద్దతుదారులు దీన్ని చీటింగ్ అని, స్పిరిట్ ఆఫ్ క్రికెట్ పాటించలేదంటూ కామెంట్లు, పోస్టులు చేశారు. సోషల్ మీడియాలో మాత్రం భారత అభిమానులు దీప్తి శర్మను సమర్థిస్తూ కామెంట్లు, పోస్టులు చేశారు. ఆమె చర్య బానే ఉందంటూ ఎంసీసీ కమిటీ కూడా పేర్కొంది.

జర్నలిస్టు పరిశీలన ప్రకారం..

ఇకపోతే ఈ విషయంలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. ప్రఖ్యాత క్రికెట్ జర్నలిస్ట్ పీటర్ డెల్లా ఈ మ్యాచ్ విషయమై ప్రత్యేక పరిశీలన జరిపాడు. తన పరిశీలనతో మరో వివాదాస్పద అంశానికి తెరదీశాడు. అతను ట్విట్టర్‌లో తన పరిశీలనకు సంబంధించిన విషయాన్ని పంచుకున్నాడు. అతని పరిశీలన ప్రకారం.. క్రీజులో షార్లెట్ డీన్ 72సార్లు నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్నప్పుడు బంతి వేయకన్న ముందే క్రీజు దాటి ముందుకెళ్లింది. 73వ సారి క్రీజు దాటినప్పుడు దీప్తి శర్మ ఆమెను మన్కడింగ్ ద్వారా ఔట్ చేసింది. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో అప్రమత్తంగా ఉంటున్న డీన్‌ను పసిగట్టిన దీప్తి తెలివిగా ఔట్ చేసిందంటూ అతను పేర్కొన్నాడు.

అవుట్ చేస్తే చేశారు కానీ అబద్ధాలు ఎందుకో?

అవుట్ చేస్తే చేశారు కానీ అబద్ధాలు ఎందుకో?

ఈ విషయమై దీప్తి శర్మ రనౌట్ ప్లాన్ చేసినట్లు విలేకరులతో తెలిపింది. అంతకుముందు డీన్‌కు వార్నింగ్ ఇచ్చామని, అయినా ఆమె వినలేదని, అందువల్లే నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం ఆమెను మన్కడింగ్ పద్ధతిలో రనౌట్ చేశామని చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయమై ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్ సైతం స్పందించింది. దీప్తి శర్మ చెప్పేవన్నీ అబద్ధాలు అంటూ ఆరోపించింది. షార్లెట్ డీన్‌కు ఆమె ఎలాంటి ముందస్తు హెచ్చరికలు ఇవ్వలేదని తెలిపింది. ఈ మేరకు ట్విట్టరులో ఆమె పోస్ట్ చేసింది. 'ఆట ముగిసింది, చార్లీ రూల్స్ ప్రకారం ఔటయింది. సిరీస్‌లో భారత్‌ విజేతగా నిలిచింది. కానీ ఛార్లీ డీన్‌కు దీప్తి ఎలాంటి హెచ్చరికలు చేయలేదు. రనౌట్ చేయడం ఓకే కానీ.. అబద్ధాలు చెబుతూ సమర్థించుకోవడం దేనికి' అని నైట్ సోమవారం తన ట్వీట్‌లో పేర్కొంది.

అప్పటి నుంచి మన్కడింగ్ అని పేరు

అప్పటి నుంచి మన్కడింగ్ అని పేరు

వన్డే సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలవడానికి 17పరుగులు అవసరం. చేతిలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే ఉంది. షార్లెట్ డీన్ కీలక ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ గెలిపించేలా ఉంది. అయితే ఆమె ఆత్రుతను దీప్తి శర్మ గమనించి.. డీన్‌ను మన్కడింగ్ పద్ధతిలో రనౌట్ చేసింది. నిబంధనల ప్రకారం.. నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ బంతి రిలీజ్ చేయడానికి ముందే క్రీజ్‌ను వదిలివేస్తే.. బౌలర్ చట్టబద్ధంగా ఆ బ్యాటర్‌ను రనౌట్ చేయడానికి ప్రయత్నించవచ్చు. భారత క్రికెట్ దిగ్గజం వినూ మన్కడ్ మొదటిసారిగా 1947-48లో ఆసీస్ బ్యాటర్ బిల్ బ్రౌన్‌ను రనౌట్ చేయడంతో మన్కడింగ్‌గా దీనికి పేరుపడింది. చాలా మంది క్రికెటర్లు ఇది ఆట స్ఫూర్తికి విరుద్ధమని వాదించినప్పటికీ, చట్టం ప్రకారం ఇది పూర్తిగా చట్టబద్ధం.

Story first published: Tuesday, September 27, 2022, 13:17 [IST]
Other articles published on Sep 27, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X