న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 
Deepak Chahar : చాలా కాలంగా జట్టుకు దూరమైతే ఇలాగే ఉంటది.. ఎవరో ఒకరు ప్లేస్ ఆపిచ్చుకుంటరు

Deepak Chahar Says That The Selection in T20 World Cup is Not In My Hand

హరారేలో గురువారం జింబాబ్వే వర్సెస్ భారత్ మధ్య జరిగిన మొదటి వన్డేలో భారత స్టార్ పేసర్ దీపక్ చాహర్ తనదైన స్టైల్లో అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అతను ఏడు ఓవర్లలో 3/27తో ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్.. చాహర్‌కి ఆరు నెలల తర్వాత తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్. ఈ ఏడాది ఫిబ్రవరిలో చివరిసారి అతను ఆడాడు. ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లో స్నాయువు గాయానికి గురైన దీపక్ చాహర్ ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన సిరీస్‌కు దూరమయ్యాడు.

నేను సెలెక్ట్ కాను

నేను సెలెక్ట్ కాను

నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో చికిత్స, ఫిట్ నెస్ పొందుతున్న టైంలో చాహర్ వెన్ను గాయానికి కూడా గురయ్యాడు. అతను చివరికి ఐపీఎల్ 2022 సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అతను లేని లోటు స్పష్టంగా కన్పించింది. తదనంతరం వరుసగా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ సిరీస్లకు చాహర్ మిస్సయ్యాడు. అతను రాబోయే ఆసియా కప్ జట్టులో రిజర్వ్‌ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ఇక ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ‌కప్‌లో అతను ఎలాగైన చోటు సంపాదించాలని చూస్తున్నప్పటికీ.. తాను ఎంపికవ్వడం అంతా ఈజీ ఏం కాదని, దాదాపుగా తాను సెలెక్ట్ కాలేనని పేర్కొన్నాడు.

ఎక్కడ ఆగిపోయానో అక్కడి నుంచే మళ్లీ

ఎక్కడ ఆగిపోయానో అక్కడి నుంచే మళ్లీ

జింబాబ్వేతో తొలి వన్డేలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న చాహర్ అనంతరం మాట్లాడుతూ.. 'టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించే విషయం నా చేతుల్లో లేదు. స్కిల్ విషయంలో నేను చాలా కష్టపడి పనిచేశాను. నేను ఎక్కడైతే ఆగిపోయానో.. మళ్లీ అక్కడి నుంచే తిరిగి ఎంట్రీ ఇచ్చానని చెప్పగలను. నేడు నా ప్రదర్శన పరంగా పూర్తి సంతోషంగా ఉన్నా' అని కూడా చాహర్ తెలిపాడు. 'మొదటి రెండు మూడు ఓవర్ల తర్వాత నేను చక్కగా బౌలింగ్ చేయగలిగాను. నేను ఆ విషయమై సంతోషంగా ఉన్నాను. ఏడు ఓవర్ల స్పెల్‌లో ఏమాత్రం ఇబ్బంది పడలేదు. కాబట్టి నా ఫిట్‌నెస్ బాగుంది' అని చాహర్ చెప్పాడు.

Story first published: Friday, August 19, 2022, 16:42 [IST]
Other articles published on Aug 19, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X