న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్కన్‌ ఛార్జర్స్‌కు రూ.4,800 కోట్లు చెల్లించండి.. బీసీసీఐకి భారీ ఎదురుదెబ్బ!!

Deccan Chargers case: Arbitration setback for BCCI could cost it Rs 4800 crore

ముంబై: ఒకప్పటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ జట్టు డెక్కన్‌ ఛార్జర్స్‌ (డీసీ) యాజమాన్యం వేసిన కేసులో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ (డీసీహెచ్‌ఎల్‌) జయమాన్యంకు రూ.4,800 కోట్లు చెల్లించాలని బాంబే హైకోర్టు నియమించిన సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సీకే టక్కర్‌ బీసీసీఐని ఆదేశిస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించారు. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఈ సెప్టెంబరు దాకా బోర్డుకు గడువిస్తున్నట్టు తీర్పులో పేర్కొన్నారు.

ఐదేళ్ల పాటు:

ఐదేళ్ల పాటు:

ఐపీఎల్‌లో 2008 నుంచి 2012 వరకు ఐదేళ్ల పాటు దక్కన్‌ చార్జర్స్‌ జట్టు కొనసాగింది. 2009లో చాంపియన్‌గా కూడా నిలిచింది. డీసీహెచ్‌ఎల్‌ కంపెనీ ఈ టీమ్‌ను ప్రమోట్‌ చేసింది. అయితే 2012లో రూ.100 కోట్ల బ్యాంకు గ్యారంటీని చూపించడంలో విఫలమైందంటూ బీసీసీఐ షోకాజ్‌ నోటీసు ఇవ్వడంతో వివాదం తలెత్తింది. వివరణ కోసం చార్జర్స్‌కు 30 రోజుల గడువు ఇచ్చినా.. అది పూర్తి కాకముందే టీమ్‌ను రద్దు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. 2012 సెప్టెంబరులో ఆ జట్టును ఐపీఎల్‌ నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

 చార్జర్స్‌ స్థానంలో సన్‌రైజర్స్

చార్జర్స్‌ స్థానంలో సన్‌రైజర్స్

దక్కన్‌ చార్జర్స్‌ స్థానంలో మరో జట్టు కోసం బిడ్లను ఆహ్వానించగా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం ఆ అవకాశాన్ని దక్కించుకుంది. అయితే లీగ్‌ నుంచి తమ జట్టును చట్ట విరుద్ధంగా తొలగించారని డీసీహెచ్‌ఎల్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన జట్లను జరిమానా వంటి స్వల్ప శిక్షలతో సరిపెట్టిన బోర్డు.. చిన్న తప్పుకే తమ జట్టును తొలగించడం అన్యాయమని డీసీహెచ్‌ఎల్‌ వాదించింది. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఒప్పందం ప్రకారం బాంబే హైకోర్టు ఆదేశాలతో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సీకే ఠక్కర్‌ మధ్యవర్తిగా వాదనలు మొదలయ్యాయి.

జట్టును రద్దు చేయడం సరైంది కాదంటూ:

జట్టును రద్దు చేయడం సరైంది కాదంటూ:

నష్టపరిహారం, వడ్డీ, ఇతర ఖర్చుల కింద తమకు రూ. 8 వేల కోట్లు బీసీసీఐ చెల్లించాలని దక్కన్‌ చార్జర్స్‌ బాంబే హైకోర్టును కోరింది. అయితే ఫ్రాంచైజీ ఫీజు కింద మిగిలిన ఐదేళ్లకు కలిపి రూ. 214 కోట్లు డీసీ తమకు చెల్లించాలని బోర్డు తెలిపింది. అన్ని వాదనలు విని చివరకు శుక్రవారం ఆర్బిట్రేటర్‌ తుది తీర్పు వినిపించారు. జట్టును రద్దు చేయడం సరైంది కాదంటూ నష్టపరిహారంగా రూ. 4,814.67 కోట్లతో పాటు ఆర్బిట్రేషన్‌ మొదలైన 2012నుంచి ఏడాదికి 10 శాతం వడ్డీ, ఖర్చులకు మరో రూ. 50 లక్షలు చెల్లించాలని ఆదేశించారు.

 బీసీసీఐ సవాలు చేసే అవకాశం:

బీసీసీఐ సవాలు చేసే అవకాశం:

8 ఏళ్లుగా సాగిన విచారణ తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా డీసీహెచ్‌ఎల్‌కు బీసీసీఐ రూ.4,800 కోట్లు పరిహారంగా చెల్లించాలని తీర్పు వచ్చింది. బీసీసీఐకి భారీ మొత్తం కాబట్టి ఈ తీర్పును హైకోర్టులో బీసీసీఐ సవాలు చేసే అవకాశం ఉంది. 'తీర్పు పూర్తి కాపీ కోసం ఎదురుచూస్తున్నాం. దాన్ని అందుకున్నాక, మా తదుపరి చర్యలేంటన్నది ప్రకటిస్తాం' అని బీసీసీఐ సీఈఓ హేమంగ్‌ అమీన్‌ స్పష్టం చేశారు.

నెంబర్‌ వన్‌కు షాకిచ్చిన హంపి.. స్పీడ్‌ చెస్‌ ఫైనల్లోకి ప్రవేశం!!

https://telugu.mykhel.com/more-sports/koneru-humpy-enters-women-s-speed-chess-championships-final-029220.html

Story first published: Saturday, July 18, 2020, 10:02 [IST]
Other articles published on Jul 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X