న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs RR Dream11 Prediction: డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్! ఫాంటసీ క్రికెట్ చిట్కాలు!!

DC vs RR Dream11 Prediction:Captain, Vice-Captain, Fantasy Tips For Match 36

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా శనివారం మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు టాస్ పడనుండగా.. 3.30కి మ్యాచ్ ఆరంభం కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్స్‌లోనూ అభిమానులు ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. పాయింట్ల పట్టికలో ఢిల్లీ రెండో స్థానంలో ఉండగా.. రాజస్థాన్ ఐదవ స్థానంలో ఉంది. ఢిల్లీ ఇప్పటి వరకు 9 మ్యాచులు ఆడి ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించగా.. రాజస్థాన్ 8 మ్యాచులు ఆడి కేవలం 4 విజయాలు మాత్రమే అందుకుని 8 పాయింట్లను ఖాతాలో వేసుకుంది.

IPL 2021: విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ ముచ్చట్లు.. ఇదే ఆఖరిసారి కానుందా? (వీడియో)IPL 2021: విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ ముచ్చట్లు.. ఇదే ఆఖరిసారి కానుందా? (వీడియో)

హెడ్ టు హెడ్ రికార్డ్స్

హెడ్ టు హెడ్ రికార్డ్స్

ఐపీఎల్ టోర్నీలో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు ఇప్పటి వరకు 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో రాజస్థాన్ 12 విజయాలతో ఢిల్లీపై ఆధిక్యంలో నిలిచింది. ఢిల్లీ 11 విజయాలను నమోదు చేసంది. ఇక యూఏఈలో తలపడిన రెండు సార్లు ఢిల్లీనే విజయం వరించింది. షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం యూఏఈలోనే పెద్ద క్రికెట్ మైదానం. కాబట్టి సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే జరిగిన 24 మ్యాచులను పరిశీలిస్తే.. 159 తొలి ఇన్నింగ్స్‌లో యావరేజ్‌ స్కోర్‌. అయితే ఈ సీజన్ ఐపీఎల్‌లో అబుదాబిలో ఛేజింగ్‌కే అన్ని జట్లు ఇష్టపడుతున్నాయి. టాస్ గెలిచిన జట్లు 15 సార్లు విజయం సాధించగా.. ఓడిన జట్లు 9 సార్లు మాత్రమే గెలిచాయి.

ఇంజురీ వివరాలు:

ఇంజురీ వివరాలు:

మార్కస్ స్టోయినిస్ సీబీకేఎస్‌పై తన రెండో ఓవర్ వేసేటప్పుడు గాయపడ్డాడు. దీంతో నేటి మ్యాచులో ఆడతాడా లేదా అని తెలియదు. ఒకవేళ ఆడకుంటే స్టోయినిస్ స్థానంలో స్టీవ్ స్మిత్ ఆడుతాడు. ఆర్‌ఆర్ టీం నుంచి ఇంతవరకైతే ఎలాంటి గాయాల వార్తలు వెలువడలేదు. ఈ మ్యాచులో ఆక్షర్ పటేల్‌పై సంజు శాంసన్ పోటీ ఆసక్తికరంగా ఉండనుంది. అక్షర్ బౌలింగ్‌లో శాంసన్ 48 బంతుల్లో 51 పరుగులు మాత్రమే చేశాడు. రెండుసార్లు ఔట్ అయ్యాడు. మరోసారి వీరిద్దరి మధ్య పోరాటాన్ని చూడొచ్చు. రాజస్థాన్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ ఢిల్లీపై 13.42 సగటుతో 19 వికెట్లు సాధించాడు. ఢిల్లీపై మంచి రికార్డే ఉన్నా.. అతడు ఈరోజు ఆడడం అనుమానమే.

తుది జట్లు (అంచనా):

తుది జట్లు (అంచనా):

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కీపర్, కెప్టెన్), మార్కస్ స్టోయినిస్/స్టీవ్ స్మిత్, షిమ్రాన్ హెట్మైర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అన్రిచ్ నోర్జ్, అవేష్ ఖాన్.

రాజస్థాన్ రాయల్స్: ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మహిపాల్ లొమ్రర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, చేతన్ సకారియా, కార్తీక్ త్యాగి, ముస్తాఫిజుర్ రహమాన్.

డ్రీమ్ 11 టిప్స్:

డ్రీమ్ 11 టిప్స్:

కెప్టెన్- శిఖర్ ధావన్, క్రిస్ మోరిస్

వైస్ కెప్టెన్- కగిసో రబాడా, రిషబ్ పంత్

కీపర్లు - సంజు శాంసన్, రిషబ్ పంత్

బ్యాటర్లు - శిఖర్ ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్, ఎవిన్ లూయిస్

ఆల్ రౌండర్లు-క్రిస్ మోరిస్, అక్సర్ పటేల్

బౌలర్లు - అన్రిచ్ నోర్జ్, కగిసో రబాడా, కార్తీక్ త్యాగి

 డ్రీమ్ 11 టీమ్:

డ్రీమ్ 11 టీమ్:

శిఖర్ ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్, ఎవిన్ లూయిస్, సంజు శాంసన్, రిషబ్ పంత్, క్రిస్ మోరిస్, అక్షర్ టేల్, అన్రిచ్ నోర్జ్, కగిసో రబాడా (వైస్ కెప్టెన్), కార్తీక్ త్యాగి.

Story first published: Saturday, September 25, 2021, 13:26 [IST]
Other articles published on Sep 25, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X