న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC Playing 11 For IPL 2022: ఓపెన‌ర్లుగా వాళ్లు ఫిక్స్‌.. మిడిలార్డ‌ర్ స్ట్రాంగ్‌.. ఆల్‌రౌండ‌ర్లుగా ఎవ‌రంటే..

DC Playing 11 For IPL 2022: David Warner and Prithviraj Shah Fix as openers. Shardul Thakur and Axar Patel as all-rounders.

ఢిల్లీ: చూస్తుండ‌గానే ఐపీఎల్ 2022 ద‌గ్గ‌రికి వ‌చ్చేసింది. ఈ మెగా లీగ్ ఆరంభానికి మ‌రో 10 రోజులు కూడా స‌మ‌యం లేదు. దీంతో టీంల‌న్నీ త‌మ క‌స‌ర‌త్తుల‌ను మొద‌లుపెట్టేశాయి. ఆట‌గాళ్లంతా ఇప్ప‌టికే ఆయా జ‌ట్ల‌లో చేరుతున్నారు. ప్ర‌త్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసిన టీంలు క‌ఠోర సాధ‌న చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క సారి కూడా ట్రోఫీ గెలుచుకోలేక‌పోయినా ఢిల్లీ క్యాపిట‌ల్స్ కూడా త‌మ క‌స‌ర‌త్తులను ముమ్మ‌రం చేసింది. ఇప్ప‌టికే ఆ జ‌ట్టు కెప్టెన్ రిష‌బ్ పంత్ సైతం టీంలో చేరాడు. దీంతో త‌మ తుది జ‌ట్టుపై ఢిల్లీ క్యాపిట‌ల్స్ మేనేజ్‌మెంట్ ఇప్ప‌టి నుంచే ఒక అంచ‌నా వేస్తోంది.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ పూర్తి జ‌ట్టు 2022

రిషభ్‌ పంత్ (16 కోట్లు), ఆన్రిచ్ నోర్జే(6.50 కోట్లు), అక్షర్‌ పటేల్‌(9 కోట్లు), పృథ్వీషా(7.50 కోట్లు), మిచెల్ మార్ష్ (6.50 కోట్లు), సయ్యద్ ఖలీల్ అహ్మద్(5.25 కోట్లు), చేతన్‌ సకారియా(4.20 కోట్లు), రోవ్‌మన్‌ పావెల్ ( 2.80 కోట్లు), ముస్తాఫిజర్‌ రెహ్మాన్‌(2 కోట్లు), కుల్‌దీప్‌ యాదవ్(2 కోట్లు), కేఎస్ భరత్ (2 కోట్లు), కమ్‌లేష్ నగర్‌కోటి(1.10 కోట్లు), మన్‌దీప్‌ సింగ్(1.10 కోట్లు), లలిత్‌ యాదవ్( 65 లక్షలు), టిమ్‌ సీఫెర్ట్(రూ. 50 లక్షలు), యాష్ ధుల్(50 లక్షలు), ప్రదీప్‌ దూబే(50 లక్షలు), ఎంగిడి(50 లక్షలు), అశ్విన్‌ హెబ్బర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, రిపల్‌ పటేల్‌, విక్కీ ఓత్సవాల్‌( వీరంద‌రికీ 20 లక్షలు).

ఓపెన‌ర్లుగా షా, వార్న‌ర్

ఓపెన‌ర్లుగా షా, వార్న‌ర్

ఢీల్లీ క్యాపిట‌ల్స్ ఇన్నింగ్స్‌ను ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్, యువ ఓపెన‌ర్ పృథ్వీ షా ప్రారంభించ‌డం ఖాయ‌మ‌నే చెప్పుకోవాలి. వీరిద్ద‌రికి ఓపెన‌ర్‌గా ఐపీఎల్‌లో మంచి రికార్డు కూడా ఉంది. పీఎల్‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన ఆట‌గాళ్ల‌లో డేవిడ్ వార్న‌ర్ టాప్‌లో ఉన్నాడు. గ‌తంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ఎన్నో విజ‌యాలు అందించాడు. అయితే యువ ఓపెన‌ర్ పృథ్వీ షా ఇటీవ‌ల ఎన్సీఏలో నిర్వ‌హించిన యోయో టెస్టులో విఫ‌ల‌మ‌వ‌డం ఢిల్లీని కంగారు పెడుతోంది. ఒక వేళ పృథ్వీ షా ఫిట్‌నెస్ సాధించ‌క‌పోతే అత‌ని ప్లేసులో టీమిండియా అండ‌ర్ 19 హిరో య‌ష్ ధూల్‌ను ఆడించే అవ‌కాశాలున్నాయి. అయితే డేవిడ్ వార్న‌ర్ కూడా ఆస్ట్రేలియా జ‌ట్టుకు ఆడే క్ర‌మంలో ప‌లు ఆరంభ మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యే అవ‌కాశం ఉంది. ఒక వేళ ఆరంభ మ్యాచ్‌ల‌కు వార్న‌ర్ దూర‌మైతే అత‌ని స్థానంలో టిమ్‌ సీఫెర్ట్ ఓపెనింగ్ చేయ‌నున్నాడు.

మిడిలార్డ‌ర్ వారితో భ‌ర్తీ

మిడిలార్డ‌ర్ వారితో భ‌ర్తీ

మూడో స్థానంలో ఆస్ట్రేలియా క్రికెట‌ర్ మిచెల్ మార్ష్ ఆడ‌నున్నాడు. నాల్గో స్థానంలో కెప్టెన్ రిష‌బ్ పంత్ బ్యాటింగ్ చేయ‌నుండ‌గా.. ఐదో స్థానంలో స‌ర్ప‌రాజ్ ఖాన్ రానున్నాడు. ఇక ఆరో స్థానంలో వెస్టిండీస్ బ్యాట‌ర్ రోవ్‌మన్‌ పావెల్ ఆడ‌నున్నాడు. పావెల్ బౌలింగ్ కూడా చేయ‌గ‌లడు. ఏడు, ఎనిమిది స్థానాల్లో

ఆల్ రౌండ‌ర్లు అక్ష‌ర్ ప‌టేల్, శార్దూల్ ఠాకూర్ ఆడ‌నున్నారు.

బౌల‌ర్లు వీళ్లే

బౌల‌ర్లు వీళ్లే

స్పిన్ బౌలర్‌గా కుల్దీప్ యాద‌వ్ ఆడ‌నున్నాడు. పేస్ బౌలింగ్ క్యాట‌గిరీలో ఖ‌లీల్ అహ్మ‌ద్, ఆన్రిచ్ నోర్జే ఆడ‌నున్నారు. వీళ్లే కాకుండా ఢిల్లీ క్యాపిట‌ల్స్ బెంచ్ కూడా స్ట్రాంగ్‌గానే క‌నిపిస్తోంది. ఢిల్లీ బెంచ్‌లో చేతన్‌ సకారియా, ముస్తాఫిజర్‌ రెహ్మాన్‌, కేఎస్ భరత్, యాష్ ధుల్, విక్కీ ఓత్సవాల్ వంటి స్టార్ ప్లేయ‌ర్లు ఉన్నారు.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ తుది జ‌ట్టు (అంచ‌నా)

ఢిల్లీ క్యాపిట‌ల్స్ తుది జ‌ట్టు (అంచ‌నా)

పృధ్వీ షా, డేవిడ్ వార్నర్/ టిమ్‌ సీఫెర్ట్, మిచెల్ మార్ష్, రిష‌బ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీప‌ర్), స‌ర్ఫ‌రాజ్ ఖాన్, రోవ్‌మన్‌ పావెల్, అక్ష‌ర్ పటేల్, శార్డూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మ‌ద్‌, కుల్దీప్ యాద‌వ్, ఆన్రిచ్ నోర్జే.

Story first published: Thursday, March 17, 2022, 10:41 [IST]
Other articles published on Mar 17, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X