న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో చరిత్ర సృష్టించిన డేవిడ్‌ మలన్‌.. ఏ బ్యాట్స్‌మన్‌కు సాధ్యం కాని ఘనత!!

Dawid Malan attains the highest ever rating points in T20I history

దుబాయ్: పొట్టి క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ఇంగ్లండ్‌ స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్‌ మలన్ అరుదైన ఘనత అందుకున్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 900 కంటే ఎక్కువ రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో మలన్‌ 915 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో మలన్‌ (47 బంతుల్లో 99 నాటౌట్‌; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగిన విషయం తెలిసిందే.

మలన్ రికార్డ్

మలన్ రికార్డ్

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో డేవిడ్‌ మలన్ రెచ్చిపోయి 173 రన్స్ చేశాడు. రెండో టీ20లో 55 పరుగులు చేసిన మలన్.. మూడో టీ20లో 99 పరుగులతో నాటౌట్‌‌గా నిలిచాడు. 2018 జులైలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ 900 పాయింట్లను సాధించాడు. ఆ తర్వాత 900 పాయింట్లు సాధించిన ఆటగాడిగా మలన్ రికార్డ్ సాధించాడు. ఫించ్ తర్వాత టీ20ల్లో 900 కంటే ఎక్కువ పాయింట్లు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.

915 పాయింట్లతో

915 పాయింట్లతో

టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో డేవిడ్ మలన్‌ 915 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో ఉన్న పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్ (871) ఉన్నాడు. బాబర్ కంటే మలాన్ 44 పాయింట్లు ముందంజలో ఉన్నాడు. ఆరోన్ ఫించ్ (835), కేఎల్ రాహుల్ (824), తర్వాతి స్థానాల్లో ఉన్నారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ రస్సీ వాన్ డెర్ డసెన్‌.. ఏకంగా 17 స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకున్నాడు. మూడో టీ20లో డసెన్‌ (74, 32 బంతుల్లో, 5×4, 5×6) హాఫ్ సెంచరీ చేశాడు.

ఇంగ్లండ్‌ టాప్‌

ఇంగ్లండ్‌ టాప్‌

దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్‌ టీ20 ర్యాంకింగ్స్‌‌లో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి అగ్ర స్థానానికి చేరుకుంది. 271 పాయింట్లతో సిరీస్ ప్రారంభించిన ఇంగ్లండ్‌.. దక్షిణాఫ్రికాపై 3-0 తేడాతో గెలుపొందడం ద్వారా 275 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఆస్ట్రేలియా ఖాతాలోనూ 271 పాయింట్లే ఉన్నప్పటికీ.. దశాంశ స్థానాల్లో తేడా కారణంగా ఇంగ్లండ్‌ తొలి స్థానానికి చేరుకుంది. టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉండగా.. పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

భారత్@2

భారత్@2

ఇక వన్డే ర్యాంకింగ్స్‌లో కూడా ఇంగ్లండ్‌ అగ్ర స్థానంలో ఉంది. 123 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లీష్ జట్టు టాప్‌లో కొనసాగుతోంది. 2019 ప్రపంచకప్‌ నుంచి ఇంగ్లండ్ మంచి ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇక 117 రేటింగ్ పాయింట్లతో భారత్ రెండో స్థానంలో ఉంది. 116 రేటింగ్ పాయింట్లతో న్యూజీలాండ్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా (111), దక్షిణాఫ్రికా (108) టాప్-5లో ఉన్నాయి.

ప్లీజ్ గంభీర్ సర్.. ఫించ్, మాక్స్‌వెల్‌లను కూడా పొగడవా!! టీ20 సిరీస్ మనదే అవుతుంది!

Story first published: Thursday, December 3, 2020, 13:10 [IST]
Other articles published on Dec 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X