21వ పడిలోకి రషీద్ ఖాన్: ట్విట్టర్‌లో శుభాకాంక్షల వెల్లువ

హైదరాబాద్: ఆప్ఘనిస్థాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ శుక్రవారం 21వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో రషీద్ ఖాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రషీద్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా అతడికి ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ శుభాకాంక్షలు తెలిపాడు.

అయితే, రషీద్ ఖాన్‌కు డేవిడ్ వార్నర్ 25వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం విశేషం. రషీద్ ఖాన్ చూసేందుకు కాస్త పెద్ద వయసు ఉన్నవాడిలా కనిపించడమే ఇందుకు కారణం. కాగా, ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఆప్ఘనిస్థాన్ జట్టుకు రషీద్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహారించాడు.

<strong>Pic Viral: 16 ఏళ్ల వయసులో విరాట్ కోహ్లీ ఎలా ఉన్నాడో తెలుసా?</strong>Pic Viral: 16 ఏళ్ల వయసులో విరాట్ కోహ్లీ ఎలా ఉన్నాడో తెలుసా?

పిన్న వయసులో కెప్టెన్‌గా

ఫలితంగా టెస్టు క్రికెట్‌లో పిన్న వయసులో కెప్టెన్‌గా వ్యవహారించిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే జింబాబ్వే మాజీ కెప్టెన్‌ తైబు పేరిట ఉన్న రికార్డును రషీద్‌ ఖాన్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 11 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ముక్కోణపు టీ20 సిరిస్‌లో

ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్ జట్టు బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లతో ముక్కోణపు టీ20 సిరిస్ ఆడుతోంది. ఇదిలా ఉంటే, 2017లోకి వెళితే... ఆప్ఘనిస్థాన్ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆడిన మొదటి క్రికెటర్‌గా రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ 2017 సీజన్ కోసం నిర్వహించిన ఐపీఎల్ వేలంలో రషీద్ ఖాన్‌తో పాటు ఆప్ఘన్ వెటరన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీని సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరుపున

డేవిడ్ వార్నర్ నాయకత్వంలో రషీద్ ఖాన్ ఓ అద్భుతమైన బౌలర్‌గా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాతి సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రధాన బౌలర్‌గా కొనసాగాడు. తన స్పిన్ మ్యాజిక్‌తో పాటు బౌలింగ్‌లోనూ రషీద్ ఖాన్ ఎన్నో అద్భుతాలు చేశాడు. ఐపీఎల్ 2018 సీజన్‌లో సన్‌రైజర్స్ ఫైనల్‌కు చేరడంలో రషీద్‌దే కీలకపాత్ర. ఆ సీజన్‌లో రషీద్ ఖాన్ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, September 20, 2019, 16:31 [IST]
Other articles published on Sep 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X