సన్‌రైజర్స్ అనూహ్య నిర్ణయం.. కెప్టెన్‌గా మళ్లీ వార్నరే

IPL 2020 : David Warner Reappointed Sunrisers Hyderabad Captain Ahead Of IPL 2020 | Oneindia Telugu

హైదరాబాద్: మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ ముంగిట సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. జట్టు సారథ్య బాధ్యతలను మరోసారి డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు అప్పగిస్తున్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించింది. దీంతో గత రెండు సీజన్లలో కెప్టెన్సీ వహించిన కేన్ విలియమ్సన్ స్థానంలో వార్నర్ కెప్టెన్సీ పగ్గాలు అందుకోనున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.

ఇంతకీ వీడియో ఏంటంటే..

ఇంతకీ వీడియో ఏంటంటే..

ఈ వీడియోలో డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచిన ఫ్రాంచైజీకి ధన్యవాదాలు తెలిపాడు. ' నా మీద నమ్మకంతో జట్టు యాజమాన్యం మరోసారి కెప్టెన్సీ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐపీఎల్‌ 2020 సీజన్‌లో జట్టు సారథ్య బాధ్యతలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నా. 2018 సీజన్‌కు నేను అందుబాటులో లేనప్పుడు కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించిన కేన్‌ విలియమ్సన్‌, భువనేశ్వర్‌ కుమార్‌కు కృతజ్ఞతలు.

మరోసారి కెప్టెన్‌గా జట్టుకు సారథ్యం వహించే అవకాశం అందుకున్నా. మీ(అభిమానుల) సహకారం ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నా. నాపై నమ్మకంతో టీమ్‌మేనేజ్‌మెంట్‌ మరోసారి నన్ను కెప్టెన్‌ను చేసింది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జట్టును ముందుకు నడుపుతా. గడ్డు పరిస్థితుల్లో కూడా నాకు మద్దతుగా నిలిచిన సన్‌రైజర్స్‌ అభిమానులకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నా' అంటూ వార్నర్ చెప్పుకొచ్చాడు.

ఇండియన్ గర్ల్‌తో మ్యాక్స్‌వెల్ ఎంగేజ్‌మెంట్!!

టాంపారింగ్‌తో నిషేధం..

టాంపారింగ్‌తో నిషేధం..

బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది నిషేధం ఎదుర్కొన్న వార్నర్‌, స్టీవ్ స్మిత్‌లను.. బీసీసీఐ కూడా ఒక సీజన్ ఆడనివ్వకుండా నిషేధం విధించింది. దీంతో వార్నర్, స్మిత్ ఐపీఎల్ 2018 సీజన్‌కు దూరమయ్యారు. అప్పట్లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న డేవిడ్ వార్నర్‌కి.. తాజాగా మళ్లీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ పగ్గాలు అప్పగించింది.

వార్నర్ సారథ్యంలోనే టైటిల్..

వార్నర్ సారథ్యంలోనే టైటిల్..

ఐపీఎల్ 2016 సీజన్‌లో కెప్టెన్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌కు టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్.. ఓపెనర్‌గా ఇప్పటికీ తిరుగులేని రికార్డ్‌లతో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటి వరకూ 126 మ్యాచ్‌లాడిన ఈ ఆస్ట్రేలియా ఓపెనర్.. 142.39 స్టైక్‌రేట్‌తో 4,706 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 44 హాఫ్ సెంచరీలు ఉండటం అతని నిలకడకి నిదర్శనం.

టెన్నిస్ స్టార్ మరియా షరపోవా సంచలన నిర్ణయం!

గత ఏడాది ఆడినప్పటికీ..

గత ఏడాది ఆడినప్పటికీ..

ఐపీఎల్ 2018, 2019 సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ హాట్ ఫేవరేట్‌గానే బరిలోకి దిగింది. కానీ.. టైటిల్ గెలవలేకపోయింది. గత ఏడాది ఐపీఎల్‌లో వార్నర్ ఆడినప్పటికీ.. అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ నిరాకరించింది. బాల్ టాంపరింగ్‌తో నిషేధానికి గురై ఉండటంతో.. బ్రాండ్ వాల్యూ దెబ్బ తింటుందనే ఉద్దేశంతో ఫ్రాంఛైజీ వెనకడుగు వేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ.. తాజాగా ఆస్ట్రేలియా ఓపెనర్‌పై నమ్మకం ఉంచుతూ మరోసారి సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఈ నిర్ణయంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి కప్ హైదరాబాద్‌దేనని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, February 27, 2020, 13:32 [IST]
Other articles published on Feb 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X