న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆసీస్‌కు దొరికిన అద్భుతమైన ఆటగాడు

By Nageshwara Rao
David Warner to make grade cricket return after ball-tampering ban from Cricket Australia

హైదరాబాద్: ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అభిమానులకు శుభవార్త. బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఏడాది పాటు నిషేధానికి గురైన డేవిడ్ వార్నర్ తిరిగి బ్యాట్ పట్టనున్నాడు. సిడ్నీ ప్రీమియర్ క్రికెట్ అసోసియేషన్‌లో భాగంగా రాండ్‌విక్ పీటర్‌షామ్‌ క్రికెట్ క్లబ్ తరఫున వార్నర్ క్రికెట్ ఆడనున్నాడు.

దీనిపై ఆస్ట్రేలియా మాజీ పేసర్, రాండ్‌విక్ పీటర్‌షామ్‌ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు మైక్ వైట్నీ అధికారిక ప్రకటన చేశారు. సిడ్నీ గ్రేడ్ సీజన్ ప్రారంభం కాగానే క్లబ్ ఆడనున్న తొలి మూడు లేదా నాలుగు మ్యాచ్‌లకు డేవిడ్ వార్నర్ అందుబాటులో ఉంటాడని ఆయన తెలిపాడు.

 ఎంతో సంతోషంగా ఉంది

ఎంతో సంతోషంగా ఉంది

'డేవిడ్ వార్నర్ మా జట్టులో చేరడం ఎంతో సంతోషంగా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆస్ట్రేలియా జట్టుకు దొరికిన అద్భుతమైన ఆటగాడు. అతను మా క్లబ్‌ అధికారులతో చర్చించి మొదటి మూడు లేదా నాలుగు మ్యాచ్‌లు ఆడేందుకు కమిట్ అయ్యాడు' అని తెలిపాడు.

వార్నర్‌పై ఏడాది పాటు నిషేధం

వార్నర్‌పై ఏడాది పాటు నిషేధం

సఫారీ గడ్డపై కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్ బాన్‌క్రాఫ్ట్‌లతో పాటు వార్నర్‌‌లపై ఆ దేశ క్రికెట్ బోర్డు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బాల్ టాంపరింగ్ వివాదంలో వార్నర్‌, స్మిత్‌లపై ఏడాది పాటు నిషేధం విధించగా.. దాన్ని అమలు చేసిన బాన్‌క్రాఫ్ట్‌ని 9 నెలల పాటు నిషేధించింది.

 దేశవాళీ క్రికెట్‌కి నిషేధం వర్తింపు

దేశవాళీ క్రికెట్‌కి నిషేధం వర్తింపు

ఈ నిషేధం దేశవాళీ క్రికెట్‌కి కూడా వర్తిస్తుంది. అయితే వీరి అభ్యర్థన మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రీమియర్ క్లబ్‌లు, ఛారిటీల కోసం క్రికెట్ ఆడేందుకు అనుమతించింది. ఈ నేపథ్యంలో బాన్‌క్రాఫ్ట్ పశ్చిమ ఆస్ట్రేలియా ప్రీమియర్ క్రికెట్‌లో ఆడుతుండగా తాజాగా వార్నర్‌ కూడా ప్రీమియర్ క్లబ్ క్రికెట్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు.

 యువ ఆటగాళ్లకు ఎంతో ఉపయోగం

యువ ఆటగాళ్లకు ఎంతో ఉపయోగం

తమకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆటగాళ్లు భావిస్తున్నారు. అయితే వార్నర్ తమ జట్టులో ఉండటం యువ ఆటగాళ్లకు ఎంతో ఉపయోకరమని వైట్నీ పేర్కొన్నాడు. 'అతను మా జట్టులో ఆడుతున్నాడని తెలిసి ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. డ్రెస్సింగ్ రూంలో యువ ఆటగాళ్లకి అతని సూచనలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి' అని తెలిపాడు.

Story first published: Thursday, May 17, 2018, 15:14 [IST]
Other articles published on May 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X