న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆర్చర్‌ సిద్ధంగా ఉండు.. నువ్వోనేనో తేల్చుకుందాం: వార్నర్

David Warner lands for IPL 2020, ready for Jofra Archer threat

దుబాయ్: విధ్వంసానికి పెట్టింది పేరు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఫార్మాట్ ఏదైనా దూకుడుగా ఆడడమే అతనికి తెలుసు. ఇక టీ20 ఫార్మాట్ అంటే.. ఆకాశమే హద్దుగా చెలరేగుతాడు. అయితే కరోనా కారణంగా ఐదు నెలలు ఇంట్లోనే గడిపిన వార్నర్.. తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్ ఆడాడు. టీ20, వన్డే సిరీస్‌లో జోఫ్రా ఆర్చర్‌ దెబ్బకు వార్నర్ పరుగులు చేయకుండా పోయాడు. ఏకంగా ఐదు సార్లు అతనికే చిక్కాడు. దీంతో ఇప్పుడు వార్నర్ మంచి కసి మీదున్నాడు. ఐపీఎల్ కోసం దుబాయ్ చేరుకున్న వార్నర్.. ఇక సిద్ధంగా ఉండు అని ఆర్చర్‌కు వార్నింగ్ పంపాడు.

మాట్లాడేందుకు ఏం లేదు

మాట్లాడేందుకు ఏం లేదు

ఇంగ్లండ్‌తో సిరీస్‌ ముగిసిన తర్వాత నేరుగా దుబాయ్‌లో అడుగుపెట్టిన డేవిడ్ వార్నర్.. క్వారంటైన్ ముగించుకుని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కలిశాడు. ఈ నేపథ్యంలో తాజాగా వార్నర్ మాట్లాడుతూ‌... 'రెండేళ్ల తర్వాత సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌గా పనిచేయబోతున్నా. గత ఐదేళ్లుగా జట్టుతో పాటే కొనసాగుతున్నా.. కాబట్టి జట్టులోని ఆటగాళ్ల గురించి మాట్లాడేందుకు ఏం లేదు. కెప్టెన్‌గా నా విధులను సక్రమంగా నిర్వహించాలి. మరోవైపు బ్యాట్స్‌మన్‌గా రాణించాలి. ఇంగ్లండ్‌తో సిరీస్‌ ముగిసిన తర్వాత నేరుగా ఇక్కడికే చేరుకున్నా. మంచి ప్రాక్టీస్‌ కూడా ఉంది' అని తెలిపాడు.

ఆర్చర్‌ రెడీగా ఉండు

ఆర్చర్‌ రెడీగా ఉండు

'మేము సెప్టెంబర్‌ 21న మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో ఆడనున్నాం. మొదటి మ్యాచ్ ‌కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో జోఫ్రా ఆర్చర్‌ నన్ను చాలానే ఇబ్బంది పెట్టాడు. అతని బౌలింగ్‌లో ఐదు సార్లు ఔటయ్యాను. పరుగులు చేయలేదు. ఇప్పుడు ఐపీఎల్ కోసం దుబాయ్ వచ్చా. ఇక్కడ ఆర్చర్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. ఆర్చర్‌ రెడీగా ఉండు.. ఇక తేల్చుకుందాం' అని సన్‌రైజర్స్ కెప్టెన్‌ డేవిడ్ వార్నర్ హెచ్చరించాడు. ఆర్చర్‌ రాజస్థాన్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.

2016లో టైటిల్

2016లో టైటిల్

2014లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన డేవిడ్ వార్నర్‌కు ఆ జట్టు తరపున అద్భుతమైన రికార్డు ఉంది. ఇక 2015లో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన వార్నర్‌.. మరుసటి ఏడాది 2016లో జట్టుకు టైటిల్‌ అందించాడు. టాంపరింగ్ ఉదంతంతో 2018 సీజన్‌కు దూరమైన వార్నర్.. గత సీజన్ ఆడినా ఆటగాడిగానే కొనసాగాడు. గత రెండు సీజన్లలో కేన్ విలియమ్సన్ జట్టును అద్భుతంగా నడిపించినా ఫ్రాంచైజీ పెద్దలు మరోసారి వార్నర్‌పై నమ్మకం ఉంచారు. ఇప్పటి వరకు ఈ క్యాష్‌రిచ్ లీగ్ 126 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌.. 4,706 రన్స్ చేశాడు. 2015 (562), 2017 (641), 2019 (692) సీజన్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచి ఆరేంజ్ క్యాప్ అందుకున్నాడు. తద్వారా ఎక్కువ సార్లు ఆరేంజ్ క్యాప్ అందుకున్న ఏకైక విదేశీ ఆటగాడిగా గుర్తింపు పొందాడు.

విజయవంతమైన జట్లలో సన్‌రైజర్స్‌ ఒకటి

విజయవంతమైన జట్లలో సన్‌రైజర్స్‌ ఒకటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఏడేళ్లుగా ఆడుతోంది. ఇది ఎనిమిదవ సీజన్. డెక్కన్ ఛార్జర్స్ ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన తర్వాత 2012లో సన్‌రైజర్స్‌ ఎంట్రీ ఇచ్చింది. 2012 నుంచి ఒకసారి టైటిల్‌.. మరోసారి రన్నరప్‌.. మూడు మార్లు నాలుగో స్థానంలో నిలిచి అద్భుత ప్రదర్శన చేస్తోంది. రెండు సార్లు మాత్రం ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. లీగ్‌లో విజయవంతమైన జట్లలో సన్‌రైజర్స్‌ ఒకటి. భారీ అంచనాలు లేకపోయినా.. పెద్ద స్టార్లు లేకపోయినా సత్తాచాటడం సన్‌రైజర్స్‌ ప్రత్యేకత. పటిష్ట బౌలింగ్ విభాగంతో నెట్టుకొస్తోంది. ఎప్పటిలానే ఈసారి కప్ పట్టాలని సన్‌రైజర్స్‌ చూస్తోంది.

ఎంఎస్ ధోనీ న్యూలుక్‌పై సాక్షి ఏమన్నారంటే?

Story first published: Sunday, September 20, 2020, 15:56 [IST]
Other articles published on Sep 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X