న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాలుగో బ్యాట్స్‌మన్: టెస్టుల్లో తొలి ట్రిపుల్ సెంచరీ బాదిన డేవిడ్ వార్నర్

David Warner Hits 4th Fastest Test Triple-Hundred vs Pak In Adelaide || Oneindia Telugu
David Warner hits 4th fastest Test triple-hundred vs Pakistan in Adelaide

హైదరాబాద్: అడిలైడ్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న డే నైట్ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. 302/1 ఓవర్‌ నైట్‌ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్ 389 బంతుల్లో 37 బౌండరీల సాయంతో ట్రిపుల్ సెంచరీ సాధించాడు.

టెస్టుల్లో వార్నర్‌కి ఇదే తొలి ట్రిపుల్ సెంచరీ. ఆసీస్ తరుపున ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏడో బ్యాట్స్‌మన్‌గా వార్నర్ నిలిచాడు. అడిలైడ్ ఓవల్ పిచ్‌పై ఓ ప్లేయ‌ర్ ట్రిపుల్ సెంచ‌రీ చేయ‌డం ఇదే మొద‌టిసారి. 2012 తర్వాత ఆస్ట్రేలియా తరుపున ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ నిలిచాడు.

2012, జనవరిలో టీమిండియాతో జరిగిన ఓ టెస్టులో మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్(329 నాటౌట్) ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు డేవిడ్ వార్నర్ ఆసీస్ తరుపున ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ప్ర‌స్తుతం ఆసీస్ త‌న తొలి ఇన్నింగ్స్‌లో 127 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 560 పరుగులు చేసింది. వార్న‌ర్ 315, వేడ్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు.

<strong>Australia vs Pakistan: డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీ, భారీ స్కోరు దిశగా ఆసీస్</strong>Australia vs Pakistan: డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీ, భారీ స్కోరు దిశగా ఆసీస్

2016లో కరుణ్ నాయర్ సెంచరీ తర్వాత

2016లో కరుణ్ నాయర్ సెంచరీ తర్వాత

మొత్తంగా చూస్తే, డిసెంబర్ 2016న ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో కరుణ్ నాయర్(303 నాటౌట్) సెంచరీ తర్వాత డేవిడ్ వార్నర్‌ది టెస్టుల్లో మొదటిది కావడం విశేషం. అంతేకాదు ఫిబ్రవరి 2014లో కుమార సంగక్కర(319) బంగ్లాదేశ్‌తో సాధించిన ట్రిపుల్ సెంచరీ తర్వాత ఓ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ చేసిన మొదటి ట్రిపుల్ సెంచరీ ఇది.

అనేక రికార్డులు బద్దలు

అనేక రికార్డులు బద్దలు

ఈ ట్రిపుల్ సెంచరీతో డేవిడ్ వార్నర్ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వార్నర్ ట్రిపుల్ సెంచరీతో అడిలైడ్ ఓవర్ స్టేడియంలో ఇప్పటివరకు మాజీ లెజెండరీ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మన్(299) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డు కనుమరుగైంది. అంతేకాదు టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా చేసిన నాలుగో ట్రిపుల్ సెంచరీ ఇది.

అగ్రస్థానంలో వీరేంద్ర సెహ్వాగ్

అగ్రస్థానంలో వీరేంద్ర సెహ్వాగ్

ఈ జాబితాలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(278 balls vs South Africa, 2007-08) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత మ్యాథ్యూ హెడెన్(362 balls vs Zimbabwe, 2003-04) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మళ్లీ సెహ్వాగే(364 balls vs Pakistan, 2003-04) మూడో స్థానంలో ఉన్నాడు.

టెస్టుల్లో అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆటగాళ్లు

టెస్టుల్లో అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆటగాళ్లు

Virender Sehwag - 278 balls vs South Africa. 2007-08

Matthew Hayden - 362 balls vs Zimbabwe, 2003-04

Virender Sehwag - 364 balls vs Pakistan, 2003-04

73 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్

73 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ చరిత్ర సృష్టించాడు. శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్టులో రెండో రోజైన శనివారం స్టీవ్ స్మిత్ టెస్టుల్లో 7000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. పాక్ బౌలర్ మహ్మద్‌ ముసా బౌలింగ్‌లో సింగిల్‌ తీయడం ద్వారా స్మిత్ ఈ ఘనత సాధించాడు. అయితే, టెస్టుల్లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న రికార్డుని ఆటగాడిగా స్టీవ్ స్మిత్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో 73 ఏళ్ల రికార్డును స్టీవ్ స్మిత్‌ బద్దలు కొట్టాడు. 1946లో ఇంగ్లాండ్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్ వాలీ హమ్మాండ్‌ 131 ఇన్నింగ్స్‌ల్లో ఏడు వేల పరుగుల్ని సాధించాడు.

Story first published: Saturday, November 30, 2019, 13:36 [IST]
Other articles published on Nov 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X