న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఛ.. ఎంతపనాయే! టీమిండియాతో ఆడి పెద్ద తప్పు చేశా: డేవిడ్‌ వార్నర్‌

David Warner feels playing two Test matches against Team India was a mistake

సిడ్నీ: భారత్‌తో చివరి రెండు టెస్టులు ఆడి పెద్ద తప్పు చేశానేమోనని ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అభిప్రాయపడ్డాడు. రెండు టెస్టులు ఆడడం వలనే గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతోందన్నాడు. జట్టు మేలు కోసమే ఆడానని వార్నర్ స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాలో భారత పర్యటన సందర్భంగా వన్డే సిరీస్‌ మధ్యలో గాయపడ్డ వార్నర్.. దాని నుంచి పూర్తిగా కోలుకోకముందే చివరి రెండు టెస్టుల్లో ఆడాడు. అయితే ఆ మ్యాచ్‌ల్లో మాత్రం తన ప్రభావం చూపలేకపోయాడు. రెండు టెస్టుల్లో వరుసగా 5, 13, 1, 48 పరుగులు చేశాడు.

తప్పు చేశానేమో:

తప్పు చేశానేమో:

మార్ష్ కప్ టోర్నీ సందర్భంగా డేవిడ్‌ వార్నర్‌ మాట్లాడాడు. 'ఆస్ట్రేలియా జట్టుకు సాయం చేయాలనే ఉద్దేశంతో టీమిండియాతో జరిగిన చివరి రెండు టెస్టులు ఆడాలనుకున్నా. ఇప్పుడు ఆలోచిస్తే.. తప్పు చేశానేమో అనిపిస్తోంది. గాయంతో ఆడడంతో దాని తీవ్రత మరింత పెరిగి కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతోంది. నా గురించి ఆలోచించి ఉంటే.. కచ్చితంగా ఆడేవాడిని కాదు. జట్టుకు మేలు జరుగుతుందని అలా చేశా. కుర్రాళ్లకు సహాయం చేయాల్సిన అవసరం ఉందని భావించా. ఉదరం, గజ్జల్లో ఇలాంటి నొప్పి ఇంతకుముందెప్పుడూ అనుభవించలేదు' అని వార్నర్‌ అన్నాడు.

టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఇష్టం:

టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఇష్టం:

'దక్షిణాఫ్రికా సిరీస్‌ను రద్దు చేసుకోవడంతో కోలుకునేందుకు ఎక్కువ సమయం దొరికింది. రిటైర్మెంట్ గురించి ఇప్పుడు అప్పుడే ఆలోచించడం లేదు. 2023 ప్రపంచకప్ గురించి ఆలోచిస్తున్నా. పరిమిత ఓవర్ల ఆటలో మా జట్టు సమతుల్యంగా ఉంది. భారతదేశంలో గెలవడానికి మాకు మంచి అవకాశం. టెస్ట్ క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఆటలో కొనసాగినంతకాలం ఆ ఫార్మాట్ ఆడుతా. ఇక నుంచి మేము చాలా క్రికెట్ ఆడాల్సి ఉంది. ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నిస్తా. క్రికెట్ ఆడుతూనే కుటుంబంకు సమయం కేటాయిస్తా' అని డేవిడ్‌ వార్నర్‌ తెలిపాడు.

క్రికెట్‌తో బిజీబిజీగా:

క్రికెట్‌తో బిజీబిజీగా:

34 ఏళ్ల డేవిడ్ వార్నర్.. తన దేశీయ క్రికెట్ టోర్నీ అనంతరం ఐపీఎల్ 2021 ఆడనున్నాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వార్నర్ సారథిగా ఉన్న విషయం తెలిసిందే. జూలైలో 'ది హండ్రెడ్‌'లో పాల్గొంటాడు. ఇక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఆస్ట్రేలియా వెళితే.. అక్కడ ఆడతాడు. మొత్తానికి వార్నర్ క్రికెట్‌తో బిజీబిజీగా గడపనున్నాడు. వార్నర్ ఆస్ట్రేలియా జట్టుకు ప్రధాన ఆటగాడు అన్న విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లలో ఆసీస్ జట్టుకు ఆడుతున్నాడు. ఆసీస్ ప్రస్తుతం న్యూజీలాండ్‌తో, ఇంగ్లండ్‌తో భారత్ మ్యాచులు ఆడుతున్నాయి.

భారత్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ:

భారత్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ:

ఐపీఎల్ పుణ్యమాని డేవిడ్ వార్నర్ లక్షలాది మంది భారతీయుల అభిమానం చూరగొన్నాడు. ముఖ్యంగా ఆరెంజ్‌ ఆర్మీ ఫాన్స్ వార్నర్‌ను హైదరాబాదీ అని, మా అన్న అని, కాండిస్‌ వార్నర్‌ను వదిన అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటారు. నిజం చెప్పాలంటే.. వార్నర్‌కు ఆస్ట్రేలియా కంటే ఎక్కువగా భారత్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న వార్నర్.. అద్భుత ఆటతీరుతో భారత అభిమానుల మనసు దోచుకున్నాడు. అంతేకాదు మన తెలుగు జట్టుకు కప్ కూడా అందించాడు.

Story first published: Thursday, March 4, 2021, 12:17 [IST]
Other articles published on Mar 4, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X