న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అసలేం జరిగింది?: కొట్టుకునేంత, డర్బన్ టెస్టులో వార్నర్ Vs డీకాక్ (వీడియో)

By Nageshwara Rao
David Warner, De Kock in ugly off-field confrontation

హైదరాబాద్: డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ వేదికగా జరుగుతోన్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, సఫారీ వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్‌లు ఒకరిపై మరొకరు చేయి చేసుకునేంత వరకు వెళ్లారు. నాలుగో రోజైన ఆదివారం టీ బ్రేక్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

Australia vs South Africa 2018 1st Test Score Card

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా తొలి టెస్టు డర్బన్‌లో జరుగుతోంది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా ఏబీ డివిలియర్స్‌ను డేవిడ్ వార్నర్ రనౌట్ చేశాడు. రనౌట్ అనంతరం అంఫైర్లు టీ బ్రేక్ ఇచ్చారు. ఈ టీ బ్రేక్ సమయంలో డేవిడ్‌ వార్నర్‌.. ఆతిథ్య జట్టు వికెట్‌ కీపర్‌ డీకాక్‌పై మాటల యుద్ధానికి దిగాడు.

David Warner, De Kock in ugly off-field confrontation

టీ బ్రేక్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల తమ తమ డ్రస్సింగ్‌ రూమ్‌లకు వెళ్లే క్రమంలో ముందుగా ఆసీస్‌ ఆటగాళ్లు మెట్లు ఎక్కుతున్నారు. వారి వెనుకనే దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డీకాక్‌ వస్తున్నాడు. ఈ సమయంలో మెట్లు ఎక్కుతూ డీకాక్‌పై వార్నర్ తన మాటలతో విరుచుకుపడ్డాడు. సహచర ఆటగాళ్లు వద్దు అని వారిస్తున్నా వార్నర్ దూకుడు ప్రదర్శించాడు.

ఈ సమయంలో వార్నర్‌ వెంట ఉస్మాన్ ఖవాజా, టిమ్ పైనీలు ఉన్నారు. ఆ తర్వాత కాసేపటికి కెప్టెన్‌ స్మిత్‌ వచ్చి వార్నర్‌ను డ్రస్సింగ్ రూమ్‌లోకి తీసుకువెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మొత్తం కింగ్స్ మీడ్ స్టేడియంలో మెట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ అయింది.


ఈ వీడియోను స్థానిక మీడియా బయటపెట్టడంతో ఇప్పుడు చర్చనియాంశమైంది. దీంతో ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా విచారణకు ఆదేశించింది. కాగా, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 9 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. డీకాక్‌ (81), మోర్కెల్‌ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.

విజయానికి దక్షిణాఫ్రికా ఇంకా 124 పరుగులు చేయాల్సి ఉండడం.... చేతిలో ఒక్క వికెట్‌ మాత్రమే ఉంటంతో, చివరి రోజు ఆస్ట్రేలియా విజయం లాంఛనమే కావచ్చు. అంతకముందు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 351 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా 162 పరుగులకే ఆలౌటైంది. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 227 పరుగులకు ఆలౌటైంది.

Story first published: Monday, March 5, 2018, 13:09 [IST]
Other articles published on Mar 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X