న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Australia vs Pakistan: ట్రిపుల్ సెంచరీ సెంచరీతో డేవిడ్ వార్నర్ సాధించిన రికార్డులివే!

David Warner breaks Bradman, Azhar Ali records in unbeaten 335

హైదరాబాద్: అడిలైడ్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న డే నైట్ టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ పరుగుల వరద పారించాడు. 302/1 ఓవర్‌ నైట్‌ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (335 నాటౌట్‌; 418 బంతుల్లో 39 ఫోర్లు, సిక్స్‌) ట్రిపుల్‌ సెంచరీ సాధించాడు.

టెస్టుల్లో వార్న‌ర్‌కు ఇది తొలి ట్రిపుల్ సెంచ‌రీ. అడిలైడ్ పిచ్‌పై ఓ క్రికెటర్ ట్రిపుల్ సెంచ‌రీ చేయ‌డం ఇదే మొద‌టిసారి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా లెజెండరీ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మన్(299) పరుగుల రికార్డుని బద్దలు కొట్టాడు. 1931-32లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బ్రాడ్‌మన్ ఈ స్టేడియంలో 299 పరుగులు చేశాడు.

నాలుగో బ్యాట్స్‌మన్: టెస్టుల్లో తొలి ట్రిపుల్ సెంచరీ బాదిన డేవిడ్ వార్నర్నాలుగో బ్యాట్స్‌మన్: టెస్టుల్లో తొలి ట్రిపుల్ సెంచరీ బాదిన డేవిడ్ వార్నర్

ఇదే ఇప్పటివరకు ఈ స్టేడియంలో అత్యధిక పరుగుల రికార్డుగా కొనసాగుతుంది. అయితే, తాజాగా వార్నర్ ట్రిపుల్ సెంచరీతో ఆ రికార్డు కనుమరుగైంది. ఈ ట్రిపుల్ సెంచరీతో డేవిడ్ వార్నర్ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్థాన్‌పై ట్రిపుల్‌ సెంచరీ సాధించిన రెండో ఆసీస్‌ ఆటగాడిగా నిలిచాడు.

ఓపెనర్‌గా ట్రిపుల్ సెంచరీ

ఓపెనర్‌గా ట్రిపుల్ సెంచరీ సాధించిన నాలుగో ఆస్ట్రేలియా ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా చూస్తే టెస్టుల్లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన 16వ ఆటగాడు వార్నర్‌. ఆస్ట్రేలియా తరుపున టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన డాన్ బ్రాడ్‌మన్(334) రికార్డుని సైతం డేవిడ్ వార్నర్(335) అధిగమించాడు.

టెస్టుల్లో పదో అత్యధిక స్కోరు

వార్నర్ సాధించిన 334 పరుగులు టెస్టు క్రికెట్‌లో పదో అత్యధిక స్కోరు కావడం విశేషం. మ్యాథ్యూ హెడెన్(380) తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో ఆసీస్ ఆటగాడిగా నిలిచాడు. 2003లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో మ్యాథ్యూ హెడెన్ ఈ రికార్డు నెలకొల్పాడు.

డే నైట్‌ టెస్టులో అత్యధిక వ్యక్తిగత పరుగులు

దీంతో పాటు డే నైట్‌ టెస్టులో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రికార్డుని కూడా వార్నర్ తన ఖాతాలో వేసుకున్నాడు. పాక్ కెప్టెన్‌ అజహర్‌ అలీ(302 నాటౌట్‌) పేరిట ఈ రికార్డుని ఈ మ్యాచ్‌లో వార్నర్‌ బద్దలు కొట్టాడు. వార్నర్‌ 303 పరుగుల మైలురాయిని అందుకోగానే అజహర్‌ అలీ రికార్డు బద్దలైంది.

యాషెస్‌లో నిరాశ పరిచిన వార్నర్

ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన యాషెస్ సిరిస్‌లో మొత్తం 10 ఇన్నింగ్స్‌లాడిన డేవిడ్ వార్నర్ 95 పరుగులు మాత్రమే చేసిన నిరాశపరిచాడు. ఆ తర్వాత సొంతగడ్డపై వార్నర్ ఒక్కసారిగా చెలరేగి ఆడుతుండటంతో ఆసీస్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

తొలి టెస్టులో ఇన్నింగ్స్ ఐదు పరుగుల తేడాతో విజయం

పాక్‌తో టెస్టు సిరిస్‌కు ముందు ఆడిన ఆరు టీ20ల్లో డేవిడ్ వార్నర్ వరుసగా 100 not out, 60 not out, 57 not out, 20 and 48 not out పరుగులతో ఫామ్‌లోకి వచ్చాడు. డే నైట్ టెస్టుకు ముందు బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సైతం వార్నర్(154) చెలరేగడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది.

Story first published: Saturday, November 30, 2019, 15:22 [IST]
Other articles published on Nov 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X