న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జీవితాతం సోదరులమే.. సామికి క్షమాపణలు చెప్పిన ఇషాంత్‌!!

Darren Sammy Decides to Move on After Ishant Sharma Apologises for Racial Slur



ఢిల్లీ:
వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్ డారెన్‌ సామికి టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్‌ శర్మ క్షమాపణలు తెలిపాడు. ఈ విషయాన్ని స్వయంగా సామి చెప్పాడు. ఇషాంత్ దురుద్దేశంతో అలా (కాలూ) సంబోధించి ఉండడని విండీస్ క్రికెటర్‌ పేర్కొన్నాడు. ఈ విషయం ఇక్కడితో వదిలేసి ముందుకు వెళ్తామని వెల్లడించాడు. అయితే క్రికెట్లో మాత్రం జాతి వివక్షకు తావు ఉండకూడదన్నాడు.
 ఇషాంత్‌ తెలియక అనుండొచ్చు:

ఇషాంత్‌ తెలియక అనుండొచ్చు:

తాజాగా డారెన్‌ సామి మాట్లాడుతూ... 'వర్ణ వివక్షవ్యవస్థను ఏయే సంస్కృతులు ఎలా చూస్తాయో, గౌరవిస్తాయో తెలుసుకోవడం అవసరం. ఇషాంత్‌ శర్మ నన్ను తెలియక అలా (కాలూ) అనుండొచ్చు. ఏదేమైనప్పటికీ తక్కువ చేసే పదాలను ఉపయోగించకూడదు. నేనతడితో ఫోన్‌లో మాట్లాడాను. దీన్ని దాటేసి ముందుకు వెళ్తున్నాను' అని సామి అన్నాడు. ఇషాంత్‌పై తనకు ఎలాంటి ఆగ్రహం లేదని, మళ్లీ కలిసినప్పుడు మనసారా కౌగిలించుకుంటానని విండీస్ మాజీ కెప్టెన్ పేర్కొన్నాడు.

బ్రదర్స్ ఫర్ లైఫ్:

బ్రదర్స్ ఫర్ లైఫ్:

'ఆటగాడు, మెంటార్‌, కోచ్‌ మరేదైనా పాత్రలో భారత్‌కు తిరిగి రావడం నాకు ఎప్పుడూ ఇష్టమే. అక్కడ నాకు ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి. ఇషాంత్‌ శర్మ ఇంట్లో మేమందరం చేతులు కలిపిన ఓ పెద్ద చిత్రం ఉంటుంది. జీవితాతం సోదరులే అని రాసున్న ఆ చిత్రంపై నేనూ సంతకం చేశాను. ఈ విషయాన్ని నేనింక లాగదలుచుకోలేదు. ఎందుకంటే దృష్టి సారించాల్సిన పెద్ద అంశాలు మరెన్నో ఉన్నాయి' అని సామి చెప్పాడు.

'కాలూ... కాలూ' అని పిలిచేవారు:

'కాలూ... కాలూ' అని పిలిచేవారు:

అమెరికాలోని ఓ పోలీసు అధికారి జార్జి ఫ్లాయిడ్‌ అనే నల్లజాతీయుడి మెడపై కాలు పెట్టి చంపేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా 'నల్ల జాతీయుల ప్రాణాలూ విలువైనవే' (#BlackLivesMatter) అనే హ్యాష్‌ట్యాగ్‌తో నిరసనలు మొదలైయ్యాయి. ఈ నేపథ్యంలో క్రికెట్లోనూ జాతి వివక్ష ఉందని డారెస్‌ సామి అన్నాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడుతున్నప్పుడు కొందరు తనను 'కాలూ' (నల్లనివాడు) అని పిలిచారని తెలిపాడు. ఇషాంత్‌ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో సామిని కాలూ అని సంబోధించిన పోస్ట్‌ను చూపాడు.

ఐసీసీకి విజ్ఞప్తి:

ఐసీసీకి విజ్ఞప్తి:

ఆపై జెంటిల్‌మెన్‌ క్రీడ క్రికెట్‌లో ఉన్న జాత్యాంహకారం పట్ల తీవ్రంగా పరిగణించాలని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)కి సామి విజ్ఞప్తి చేశాడు. వివక్షతో కూడిన వ్యాఖ్యతో తనను సంబోధించిన వారు తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. దీంతో ఇషాంత్ క్షమాపణలు చెప్పాడు. ఇప్పటివరకు 38 టెస్టులు, 126 వన్డేలు, 68 టి20లు ఆడిన స్యామీ.. విండీస్‌కు కెప్టెన్‌గా రెండు టీ20 ప్రపంచకప్‌లను అందించాడు.

పంత్‌ బయ్యా ఇది నా ట్రైనింగ్.. ఎందుకలా అలసిపోతున్నావ్‌ (వీడియో)!!

https://telugu.mykhel.com/cricket/yuzvendra-chahal-teases-rishabh-pant-with-hilarious-throwback-workout-video/articlecontent-pf47222-028936.html

Story first published: Thursday, July 2, 2020, 13:20 [IST]
Other articles published on Jul 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X