ఆస్ట్రేలియా కోచ్ డారెన్ లీమన్ పదవికి రాజీనామా..?

Posted By:
Darren Lehmann steps down as Australian cricket team coach

హైదరాబాద్: ఇప్పటికే ముగ్గురు ఆటగాళ్లను దూరం చేసుకున్న ఆస్ట్రేలియా క్రికెట్‌కు మరో మింగుడుపడని విషయమిది. గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్న స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్ లు తమ ప్రసంగంలో భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో తాజాగా కోచ్ డారెన్ లీమన్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలిపాడు.

కోచ్ పదవి నుంచి తప్పుకోవడం పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని లీమన్ చెప్పాడు. ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆటగాళ్ల తప్పు చేశారు.. కానీ వారిని క్షమిస్తారని భావిస్తున్నానని లీమన్ చెప్పాడు. వారు తిరిగి జట్టులో చేరతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

దక్షిణాఫ్రికాతో జరగనున్న నాలుగో టెస్టు తర్వాత కోచ్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. తీవ్ర ఉద్వేగానికి లోనై మీడియాతో మాట్లాడాడు. బాధ్యతల కారణంగా ప్రేమించే వారికి దూరంగా ఉండటం ఎంతటి బాధను కలిగిస్తుందో.. తమతో ఉన్నవారికే తెలుస్తుందన్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత కోచ్ బాధ్యతల నుంచి వైదొలగడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు తెలిపాడు.

టాంపరింగ్ విషయంలో డారెన్ లీమన్ పాత్ర:
స్మిత్, వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. డారెన్ లీమన్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడుతూ బాన్‌క్రాఫ్ట్ కెమెరాలకు చిక్కడంతో.. లీమన్ వాకీటాకీ సాయంతో సబ్‌స్టిట్యూట్ ఆటగాడితో మాట్లాడి బాన్‌క్రాఫ్ట్ దగ్గరకు పంపాడు.

ఈ తతంగం కూడా కెమెరాలు పసిగట్టడంతో.. లీమన్‌కు ఈ ఉదంతం గురించి ముందే తెలుసనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ ఆయన ఇచ్చిన వివరణతో క్రికెట్ ఆస్ట్రేలియా సంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు కోచ్‌గా కొనసాగించడానికి సుముఖత వ్యక్తం చేసింది.

లీమన్ అనుభవం:
లీమన్ 2009-12 మధ్య డెక్కన్ ఛార్జర్స్ కోచ్‌గా వ్యవహరించాడు. మరుసటి ఏడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. క్వీన్స్‌లాండ్ కోచ్‌గానూ వ్యవహరించిన ఆయన.. మిక్కీ ఆర్థర్ రాజీనామాతో 2013 జూన్లో ఆసీస్ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Thursday, March 29, 2018, 19:20 [IST]
Other articles published on Mar 29, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి