న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ నిర్ణయం మా క్రికెట్‌ను వెనక్కి నెట్టింది: వివ్ కోపం

ముక్కోణపు వన్డే సిరిస్‌ నుంచి డారెన్ బ్రావోను తప్పిస్తూ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్యూఐసీబీ) తీసుకున్న నిర్ణయాన్ని లెజెండరీ కెప్టెన్, బ్యాట్స్‌మెన్ వివియన్ రిచర్డ్స్ తీవ్రంగా తప్పుబట్టాడు.

By Nageshwara Rao

ఆంటిగ్వా: ముక్కోణపు వన్డే సిరిస్‌ నుంచి డారెన్ బ్రావోను తప్పిస్తూ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్యూఐసీబీ) తీసుకున్న నిర్ణయాన్ని లెజెండరీ కెప్టెన్, బ్యాట్స్‌మెన్ వివియన్ రిచర్డ్స్ తీవ్రంగా తప్పుబట్టాడు. వెస్టిండిస్ క్రికెట్ వెనక్కిపోవడానికి ఈ తరహా చర్యలే కారణమంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు.

ప్రతి విషయాన్ని వివాదాస్పదంగా చూడటం విండిస్ బోర్డుకు అలవాటుగా మారిపోయిందని ధ్వజమెత్తాడు. 'ఇది మంచి పద్ధతి కాదు. ప్రతీసారి పలు అంశాలు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్నింటిని విడిచిపెట్టాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అనవరసర రాద్దాంతాలు అనవసరం అని అనుకుంటున్నా. బ్రావో వివాదం వెస్టిండీస్ క్రికెట్ సంస్కృతిని మరింత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది. పరిస్థితి బాగుందీ అనుకునే లోపే, మళ్లీ మొదటికొస్తుంది. ఇలా అయితే క్రికెట్‌లో మనం పురోగతి ఎలా సాధిస్తాం' అని రిచర్డ్స్ ధ్వజమెత్తాడు.

కాంట్రాక్టు విషయంలో వెస్టిండిస్ క్రికెట్ బోర్డుపై ట్విట్టర్‌లో 'బిగ్‌ ఇడియట్‌' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను అతడిపై వేటు వేసిన సంగతి తెలిసిందే. వెస్టిండిస్ క్రికెట్ బోర్డు డారెన్ బ్రావోకు సీ-కేటగిరి కాంట్రాక్టును ఆఫర్ చేసింది. ఈ కాంట్రాక్టును తీసుకోవడం ఇష్టం లేని అతడు బోర్డుపై బహిరంగంగా విమర్శలు గుప్పించాడు.

Darren Bravo controversy: Viv Richards lashes out at West Indies Cricket Board

స్టార్‌ ఆటగాళ్లకు తక్కువ స్థాయి కాంట్రాక్టులు కట్టబెడతారా? అని ట్విట్టర్‌‌లో బోర్డుని సూటిగా ప్రశ్నించాడు. అంతేకాదు డబ్ల్యూఐసీబీ అధ్యక్షుడు డేవ్‌ కెమరాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాడు. నాలుగేళ్లలో డేవ్ చేసింది ఏమీ లేదంటూ విమర్శించాడు. డేవ్‌ బిగ్‌ ఇడియట్‌ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు.

ఈ వ్యాఖ్యల ఫలితంగా డారెన్ బ్రావోకు జట్టులో చోటు కల్పించలేదు. అతడి స్థానంలో ఆల్‌ రౌండర్‌ జాసన్‌ మహమ్మద్‌ను జట్టులోకి తీసుకున్నారు. అంతేకాదు అనుచిత ప్రవర్తన కారణంగా బ్రావోను ఎంపిక చేయలేదని వెస్టిండిస్ క్రికెట్ బోర్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. వెస్టిండిస్ జాతీయ జట్టు తరుపున 95 వన్డేలు ఆడిన బ్రావో 2,955 పరుగులు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X