న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దుమ్ము రేపిన బ్రేవో: 10 బంతుల్లో 6 సిక్సర్లు.. మెకల్లమ్‌తో కలిసి విధ్వంసం

కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో బౌండరీల వరద పారింది.
 ఇరు జట్లు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడటంతో మ్యాచ్ ఆసాంతం ప్రేక్షకులను కట్టిపడేసింది. 
 పాట్రియాట్స్ నిర్దేశించిన 162పరుగుల లక్ష్యాన్ని డక్ వర్త

సెయింట్‌కిట్స్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో బౌండరీల వరద పారింది. ఇరు జట్లు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడటంతో మ్యాచ్ ఆసాంతం ప్రేక్షకులను కట్టిపడేసింది. పాట్రియాట్స్ నిర్దేశించిన 162పరుగుల లక్ష్యాన్ని డక్ వర్త్ లూయిస్ పద్దతిలో ట్రింబాగో నైట్ రైడర్స్ చేధించింది.

బుధవారం జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాట్రియాట్స్ 13ఓవర్లలో మూడు వికెట్లకు 162పరుగులు చేసింది. ఓపెనర్ క్రిస్ గేల్(93) పరుగులతో వీర విహారం చేశాడు. 47బంతులు ఆడిన గేల్ 5ఫోర్లు, 8సిక్సర్లు నమోదు చేయడం విశేషం. పాట్రియాట్స్ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ట్రింబాగో అదే స్థాయిలో ధీటుగా బదులిచ్చింది.

Darren Bravo and Brendon McCullum run riot on St Kitts bowlers, chase down 86 runs in 32 balls

మెకల్లమ్, బ్రేవోల ధాటికి స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. డారెన్ బ్రేవో 10బంతుల్లో 6సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరోవైపు మెకల్లమ్ కూడా 14బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లతో ధాటిగా ఆడాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శనతో 5.2ఓవర్లలో డక్ వర్త్ లూయిస్ పద్దతిలో ట్రింబాగో నైట్ రైడర్స్ 88 పరుగులు చేసి విజయం సాధించింది.

ఇన్నింగ్స్ చివరి 13బంతుల్లో మెకల్లమ్, బ్రేవోలు ఇద్దరూ కలిసి 8సిక్సర్లు సాధించడం మ్యాచ్ మొత్తానికే హైలైట్ గా నిలిచింది. ఈ దెబ్బతో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ట్రింబాగో నైట్ రైడర్స్ విజయం సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X