న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇది చాలా అన్యాయం.. సంజూ శాంసన్ చేసిన తప్పేంటీ? సెలెక్షన్ కమిటీకి డానిష్ కనేరియా సూటి ప్రశ్న

Danish Kaneria Says It Is Unfair for Sanju Samson As He was not Selected for T20 World cup squad

రిషబ్ పంత్ కంటే టీ20 వరల్డ్ కప్ భారత జట్టులో సంజూ శాంసన్‌ని ఎంపిక చేసి ఉండాల్సిందని పాకిస్థాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు. అక్టోబరు 22నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. బీసీసీఐ నిన్న 15మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం డానిష్ కనేరియా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. సంజూ శాంసన్ టీమిండియా జట్టు తరఫున ఆడుతున్నా అతనికి సరైన అవకాశాలు రావట్లేదని జగమెరిగిన సత్యం. రాబోయే టీ20ప్రపంచ‌కప్ జట్టుకు సెలెక్టర్లు మరోసారి అతనికి మొండిచేయి చూపించారు. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌ 2022టోర్నీకి కూడా శాంసన్‌ను ఎంపిక చేయలేదు.

అతనిపై ఎందుకింత విస్మరణ

అతనిపై ఎందుకింత విస్మరణ

'సంజూ శాంసన్‌ లాంటి క్రికెటర్ పట్ల ఇలా వ్యవహరించడం చాలా అన్యాయం. టీ20 ప్రపంచకప్‌ జట్టులోకి అతడిని పరిగణనలోకి తీసుకోవాల్సింది. అతన్ని సెలెక్ట్ చేయకపోవడానికి అతను చేసిన తప్పేంటి? ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో భారత్‌ స్వదేశంలో జరగబోయే సిరీస్‌లకు కూడా అతన్ని ఎంపిక చేయలేదు. ఎందుకింత విస్మరణ. నా ప్రకారం.. రిషబ్ పంత్‌కు బదులు సంజూ శాంసన్‌‌ను తీసుకుంటే మంచిదయ్యేది' అని కనేరియా తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.

ఉమ్రాన్ మాలిక్ రిజర్వ్ ప్లేయర్‌గా ఉండాలి

ఉమ్రాన్ మాలిక్ రిజర్వ్ ప్లేయర్‌గా ఉండాలి

అలాగే స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ గురించి డానిష్ కనేరియా తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో అదరగొట్టిన ఉమ్రాన్.. ఐర్లాండ్‌తో ఆ మధ్య జరిగిన టీ20 సిరీస్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే అతని ఎకానమీ ఎక్కువగా ఉండడంతో తర్వాత అవకాశాలు రాలేదు. ఇకపోతే మరోసారి అతని పేరు ఇటీవల తెరమీదకు వచ్చింది. టీ20 ప్రపంచకప్‌లో ఉమ్రాన్‌ను స్టాండ్‌బై ప్లేయర్‌లలో ఒకరిగా భారత్ ఎంపిక చేసి ఉండాలని కనేరియా సూచించాడు. 'వేగంగా బౌలింగ్ చేయగల బౌలర్‌పై భారత బ్యాటర్లు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరముంటుంది. కాబట్టి ఉమ్రాన్ మాలిక్‌ను స్టాండ్‌బై ప్లేయర్‌లలో ఒకరిగా భారత్ ఉంచితే కాస్త బెటర్ ఉండేది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ల ఫామ్ భారత జట్టుకు చాలా ముఖ్యమైనది నా భావన. విరాట్ ఫాంలోకి రావడం ఒకింత మంచి న్యూస్. ఇక టీం విషయానికొస్తే ఆసియా కప్‌కు ఎంపికైన టీం మేట్స్ దాదాపు జట్టులో ఉన్నారు' అని కనేరియా చెప్పాడు.

భారత టీ20 ప్రపంచకప్ జట్టు:

భారత టీ20 ప్రపంచకప్ జట్టు:

రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్(కీపర్), దినేశ్ కార్తీక్ (కీపర్), హార్దిక్ పాండ్యా, అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్

స్టాండ్ బై ప్లేయర్స్: మహమ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్

Story first published: Tuesday, September 13, 2022, 8:22 [IST]
Other articles published on Sep 13, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X