న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్ జెర్సీ చూస్తే పండ్ల షాప్ ముందున్నట్లుంది.. ఇండియా జెర్సీ ఏమో ఇలా..! జెర్సీలపై కనేరియా కామెంట్లు

Danish Kaneria Controversy Comments On India and Pak Jersies, and Suggest Both Teams Should Gear Up

పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లాండ్‌ మధ్య ప్రస్తుతం 7మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇక ఈ ఓటమి పట్ల పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు.

కరాచీలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నిఖార్సైన విజయాన్ని సాధించింది. అదే రోజు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా తొలి టీ20 జరిగింది. భారత్ విధించిన 209 పరుగుల రికార్డు లక్ష్యాన్ని సైతం ఆసీస్ నాలుగు వికెట్లు, మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి విజయాన్ని అందుకుంది.

ఇలాంటి ప్రదర్శన కోరుకోవట్లే

ఇటీవల ముగిసిన 2022 ఆసియా కప్‌లో టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన భారత్, పాకిస్థాన్‌‌లు ఓటమి పాలయి శ్రీలంక టైటిల్ గెలుపొందింది. ఆసియా కప్‌లో పేలవమైన ప్రదర్శన కనబరిచిన భారత్, పాకిస్తాన్‌ జట్ల నుండి అభిమానులు పాజిటివ్ ఇంటెంట్ గేమ్ ఆశిస్తున్నారని కనేరియా పేర్కొన్నాడు. కానీ తొలి టీ20ల్లో ఇరు జట్లు ఓడిపోయాక ఫ్యాన్స్ బాగా నిరుత్సాహానికి గురయ్యారని, రెండు ఆసియా దిగ్గజ టీంల నుంచి ఇలాంటి ప్రదర్శన ఆశించలేమని, రాబోయే 2022 T20 ప్రపంచ కప్‌కు ముందుగా త్వరత్వరగా సన్నద్ధం కావాలని కనేరియా అన్నాడు.

ఆసియా పవర్‌హౌస్ టీంలు ఇలాగా?

'మనం టీ20 ప్రపంచకప్‌కు చాలా దగ్గర్లో ఉన్నాం. ఆసియా కప్ తర్వాత రెండు జట్లు.. భారత్,పాకిస్తాన్ నుంచి మనం ఆశించిన ప్రదర్శన కనిపించట్లేదు. పాక్ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. రెండు ఆసియా పవర్‌హౌస్‌లు అయిన టీంలు ఇలా అవుతున్నాయేంటీ.? సమయం లేదు ఇరు జట్లు మళ్లీ తమ గెలుపు లయ అందుకోవాలి' అని డానిష్ కనేరియా తన యూట్యూబ్ ఛానెల్‌లో తెలిపాడు.

అభిమానులను ఆకట్టుకోలేని జెర్సీలు

ఇకపోతే టీ20ప్రపంచకప్‌కు ముందు భారత్, పాకిస్తాన్ జట్లు రెండూ కొత్త జెర్సీలను ఆవిష్కరించాయి. కొత్త 'హర్ ఫ్యాన్ కి జెర్సీ' లేత నీలం రంగుతో ఉండి పెద్దగా భారత అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. పాకిస్తాన్ జెర్సీ కూడా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. భారత జెర్సీ రంగును ఆస్ట్రేలియాపై భారత బౌలింగ్ ప్రదర్శనతో పోల్చాడు. అలాగే పాకిస్తాన్ కిట్‌ను 'ఫ్రూట్ నింజా' గేమ్‌తో పోల్చాడు.

పండ్ల షాప్ ముందు ఉన్నట్లు

పండ్ల షాప్ ముందు ఉన్నట్లు

'మొదట నేను పాకిస్తాన్ జెర్సీ గురించి మాట్లాడాలి. అది పుచ్చకాయ లాగా ఉంది. ఆన్ లైన్లో 'ఫ్రూట్ నింజా' అనే గేమ్ ఉంటుంది. సేమ్ దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నట్లు ఉన్నారు. ఈ జెర్సీలను చూస్తుంటే పండ్ల దుకాణం ముందు నిలబడి ఉన్నట్లు అనిపిస్తుంది. భారత జట్టు జెర్సీ కూడా లేత రంగులో ఉంది. కాస్త తిక్ కలర్లో ఉంటే అది ఓ పాజిటివ్ వైబ్ తీసుకువస్తుంది. లైట్ రంగులలో ఉంటే ప్లేయర్లు కూడా డల్‌గా కనిపిస్తారు. ఆసీస్‌తో మ్యాచ్‌లో భారత జట్టు వారి బౌలింగ్‌లో ఎంత డల్‌గా కనిపించిందో సేమ్ దాన్ని రిప్రజెంట్ చేసేలా జెర్సీ ఉంది' అని కనేరియా తెలిపాడు.

Story first published: Thursday, September 22, 2022, 9:42 [IST]
Other articles published on Sep 22, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X