న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Danish Aziz: ఒకే ఓవర్‌లో 33 పరుగులు..ప్లేఆఫ్‌ బెర్త్‌ ఖరారు!!

Danish Azizs 45 runs helps Karachi Kings secure playoff berth PSL 2021

అబుదాబి: క్రికెట్ ఆటలో ఎప్పుడు ఏం జరుగుతుందో కచ్చితంగా చెప్పలేం. కచ్చితంగా గెలుస్తుందనుకున్న జట్టు ఓడిపోవచ్చు.. ఓడిపోతుందనుకున్న టీమ్ గెలవచ్చు. ఈ సమీకరణాలు టీ20 క్రికెట్ వెలుగులోకి వచ్చినప్పటినుంచి కాస్త ఎక్కువయ్యాయి. ఏ బౌలర్ ఎప్పుడు చెలరేగుతాడో.. ఏ బ్యాట్స్‌మన్‌ ఎప్పుడు విరుచుకుపడతాడో ఊహించలేం. అలాంటి ఘటనే పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) 2021లో చోటుచేసుకుంది. దానిష్‌ ఆజిజ్‌ దెబ్బకు కరాచీ కింగ్స్‌ ఏకంగా ప్లేఆఫ్‌ బెర్త్‌ దక్కించుకుంది. ఆజిజ్‌ ఒకే ఓవర్‌లో 33 పరుగులు పిండుకుని జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.

ఒకే ఓవర్‌లో 33 పరుగులు

పీఎస్‌ఎల్‌ 2021లో శనివారం కరాచీ కింగ్స్‌, క్వెటా గ్లాడియేటర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ వరకు కరాచీ జట్టు స్కోరు 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు. ఆ తర్వాతి ఓవర్‌ ముగిసేసరికి ఆ జట్టు స్కోరు 169. దీనికి కారణం కరాచీ కింగ్స్‌ ఆటగాడు దానిష్‌ ఆజిజ్‌ పవర్‌ హిట్టింగ్‌. ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో ఆజిజ్‌ 4,6,6,6,6(నో బాల్‌),2,2 తో విధ్వంసం సృష్టించాడు. అతని ధాటికి కరాచీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. దానిష్‌ ఆజిజ్‌ 13 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఆజిజ్‌ ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. షార్జీల్‌ ఖాన్‌ 45, వాల్టన్‌ 34 (నాటౌట్) పరుగులు చేశారు. అరిష్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టాడు.

సర్ఫరాజ్ హాఫ్ సెంచరీ

సర్ఫరాజ్ హాఫ్ సెంచరీ

177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెటా గ్లాడియేటర్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులకే పరిమితమైంది. దీంతో 14 పరుగుల తేడాతో గ్లాడియేటర్స్‌ పరాజయం పాలైంది. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (51) హాఫ్ సెంచరీ చేసినా.. జట్టును గెలిపించలేకపోయాడు. జేక్ వీథరాల్డ్ (25), హసన్ ఖాన్ (24) పోరాడారు. ముహమ్మద్ ఎలియాస్ 3, అర్షద్ ఇక్బాల్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో కరాచీ కింగ్స్‌ ప్లేఆఫ్‌ బెర్త్‌ ఖరారు చేసుకోగా.. గ్లాడియేటర్స్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగా

నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగా

పాయింట్ల పట్టికలో కరాచీ కింగ్స్‌, లాహోర్‌ ఖలందర్స్‌ 10 పాయింట్లతో సమానంగా ఉన్నా.. కరాచీతో పోలిస్తే నెట్‌ రన్‌రేట్‌ మెరుగ్గా లేకపోవడంతో లాహోర్‌ భారంగా టోర్నీని వీడాల్సి వచ్చింది. దానిష్‌ ఆజిజ్‌ చెలరేగడంతోనే కరాచీ కింగ్స్‌ ప్లేఆఫ్‌ బెర్త్‌ దక్కించుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచులో విజయం అందించడంతో పాటు నెట్‌ రన్‌రేట్‌ను కూడా కరాచీకి జట్టుకు ఆజిజ్‌ అందించాడు. ఎలిమినేటర్-1లో భాగంగా సోమవారం పెషావర్ జల్మితో కరాచీ తలపడనుంది.

WTC Final 2021:న్యూజిలాండ్‌కు ఫీల్డ్ అంపైర్ సాయం.. కొద్దిలో విరాట్ కోహ్లీ వికెట్ మిస్ అయింది! లేదంటే?

సర్ఫరాజ్‌ గొడవ

సర్ఫరాజ్‌ గొడవ

అంతకుముందు జరిగిన మ్యాచులో క్వెటా గ్లాడియేటర్స్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, లాహోర్‌ ఖలండర్స్‌ బౌలర్ షాహిన్‌ షా అఫ్రిది పరస్పరం ఒకరినొకరు దూషించుకున్నారు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన అఫ్రిది ఆఖరి బంతిని 147కిమీ వేగంతో వేశాడు. బౌన్సర్ రూపంలో వచ్చిన బంతిని ఫుల్ చేసేందుకు సర్ఫరాజ్ ప్రయత్నించాడు. కానీ బ్యాట్‌కి దొరకని బంతి వేగంగా వెళ్లి అతడి హెల్మెట్‌కి బలంగా తాకింది.

దాంతో సర్ఫరాజ్ సింగిల్ కోసం పరుగెత్తుతూ.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోకి వెళ్లాడు. అక్కడే నిల్చొని బాల్‌ని చూస్తున్న అఫ్రిదితో గొడవకి దిగాడు. ఆపై నాకే బౌన్సర్‌ వేస్తావా? అన్నట్లుగా కోపంతో చూశాడు. సర్ఫరాజ్ మాటలకి ఘాటుగా బదులిచ్చిన అఫ్రిది అతనికి చేరువగా వెళ్లే ప్రయత్నం చేశాడు. ఇంతలో సోహైల్‌ అక్తర్‌, మహ్మద్‌ హపీజ్‌ వచ్చి వారిద్దరిని విడదీశారు.

Story first published: Sunday, June 20, 2021, 16:27 [IST]
Other articles published on Jun 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X