న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆరు వారాల తర్వాత ప్రాక్టీస్‌ మొదలుపెడతా

By Nageshwara Rao
Dale Steyn expects himself to be ‘up and running in six weeks’

హైదరాబాద్: ఆరు వారాల్లో గాయం నుంచి కోలుకుని తిరిగి బంతి పడతాని దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గాయం కారణంగా సుమారు ఏడాది తర్వాత జట్టులో చోటు సంపాదించిన డేల్ స్టెయిన్ కేప్ టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో ఆడాడు.

అయితే తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే మళ్లీ గాయపడ్డాడు. స్టెయిన్‌ను పరీక్షించిన వైద్యులు విశ్రాంతి తప్పనిసరి అని సూచించడంతో కేప్‌టౌన్ టెస్టుకు దూరమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో మిగతా రెండు టెస్టు మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే.

సోనీ ఈఎస్పీఎన్‌‌కి ఇచ్చిన ఇంటర్యూలో స్టెయిన్ మాట్లాడుతూ 'కనీసం రెండు వారాల పాటు గాయమైన కాలిపై బరువు పడకూడదని వైద్యులు సూచించారు. దీంతో నేను ప్రస్తుతం చేతి కర్రల సాయంతో నడుస్తున్నాను. ఆరు వారాలు విశ్రాంతి అవసరమని చెప్పారు. రెండు వారాల తర్వాత స్వతహాగా నడుస్తా' అని అన్నాడు.

'నాలుగు వారాల తర్వాత పరిగెడతా. ఆరు వారాల తర్వాత ప్రాక్టీస్‌ సెషన్‌ మొదలుపెడతా. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు సిద్ధమవుతా. గాయం కారణంగా సుమారు ఏడాది పాటు ఆటకు దూరమయ్యా. దాంతో పోల్చుకుంటే ఆరు వారాలు గడవడం పెద్ద కష్టమేమీ కాదు' అని స్టెయిన్‌ చెప్పుకొచ్చాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 9, 2018, 17:46 [IST]
Other articles published on Jan 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X