న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీలంకతో తొలి టెస్టు: కపిల్ రికార్డుని అధిగమించిన డేల్ స్టెయిన్

Dale Steyn breaks legendary Kapil Devs record with 4-wicket haul against Sri Lanka in 1st Test

హైదరాబాద్: దక్షిణాఫ్రికా వెటరన్ పేసర్ డేల్‌ స్టెయిన్‌ అరుదైన ఘనత సాధించాడు. గత పదేళ్లుగా టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్‌గా కొనసాగుతున్న డేల్ స్టెయిన్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ రికార్డుని అధిగమించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసి శ్రీలంక పతనాన్ని శాసించాడు.

<strong>India vs Australia: విశాఖలో తొలి టీ20, ఆఫ్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు</strong>India vs Australia: విశాఖలో తొలి టీ20, ఆఫ్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు

4 వికెట్లు తీసిన డేల్ స్టెయిన్

4 వికెట్లు తీసిన డేల్ స్టెయిన్

డర్బన్ వేదికగా బుధవారం ప్రారంభమైన ఈ టెస్టులో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లు పాటు బౌలింగ్ వేసిన డేల్ స్టెయిన్ 4 వికెట్లు తీసి 48 పరుగులు సమర్పించుకున్నాడు. ఫలితంగా టెస్టు క్రికెట్‌లో 437వ వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు డేల్ స్టెయిన్ టీమిండియా క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్‌(434 వికెట్లు)కు రెండు వికెట్లు దూరంలో ఉన్నాడు.

స్టువర్ట్‌ బ్రాడ్‌తో కలిసి ఏడో స్థానంలో

స్టువర్ట్‌ బ్రాడ్‌తో కలిసి ఏడో స్థానంలో

అయితే ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌(437 వికెట్లు)తో కలిసి సంయుక్తంగా ఏడో స్థానాన్ని ఆక‍్రమించాడు. తన కెరీర్‌లో 92వ టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న డేల్ స్టెయిన్‌ 26సార్లు ఐదు వికెట్లను సాధించాడు. కాగా, టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన వారిలో ముత్తయ్య మురళీ ధరన్‌(800వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా, షేన్‌ వార్న్‌(708) రెండో స్థానంలో.... అనిల్‌ కుంబ్లే(619), జేమ్స్‌ అండర్సన్‌(575), మెక్‌గ్రాత్‌(563), వాల్ష్‌(516)లు ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

191 పరుగులకే శ్రీలంక ఆలౌట్

191 పరుగులకే శ్రీలంక ఆలౌట్

ఈ టెస్టులో టాస్ గెలిచిన శ్రీలంక ఆతిథ్య జట్టుని బ్యాటింగ్‌కు ఆహ్వానించగా దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంక 191 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్లలో డేల్ స్టెయిన్ నాలుగు వికెట్లు తీయగా ఫిలాండర్, రబడ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఓలివర్‌కు ఒక వికెట్ లభించింది.

Story first published: Friday, February 15, 2019, 13:23 [IST]
Other articles published on Feb 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X