న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కోహ్లీ, జడేజాలు ఎటువంటి బ్యాట్స్‌మన్‌ను అయినా బయపెట్టగలరు'

ICC Cricket World Cup 2019: Kohli,Jadeja Can Intimidate Any Batsmen With Agility On Field: R Sridhar
CWC19: Virat Kohli, Ravindra Jadeja Can Intimidate Any Batsmen With Agility On Field Says Fielding Coach R Sridhar

కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాలు ఫీల్డింగ్ చురుకుగా చేస్తారు. ఇద్దరు తమ ఫీల్డింగ్ మెరుపులతో ఎటువంటి బ్యాట్స్‌మన్‌ను అయినా బయపెట్టగలరు అని భారత ఫీల్డింగ్ కోచ్ రామకృష్ణన్ శ్రీధర్ తెలిపారు. భారత్, న్యూజిలాండ్ మధ్య గురువారం జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. ఉదయం నుంచి ట్రెంట్ బ్రిడ్జ్ మైదానాన్ని వరుణుడు వదలకపోవడంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

బ్యాట్స్‌మన్‌ను బయపెట్టగలరు:

బ్యాట్స్‌మన్‌ను బయపెట్టగలరు:

అనంతరం భారత ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ మీడియాతో మాట్లాడాడు. 'మాకు ఇద్దరు మంచి ఫీల్డర్లు ఉన్నారు. కోహ్లీ, జడేజాలు 30 యార్డ్ సర్కిల్లో ఫీల్డింగ్ చురుకుగా చేస్తారు. ఇద్దరు తమ ఫీల్డింగ్ మెరుపులతో ఎటువంటి బ్యాట్స్‌మన్‌ను అయినా బయపెట్టగలరు. ఇద్దరు ఫీల్డింగ్‌లో ఉంటే బ్యాట్స్‌మన్‌ పరుగు తీయడానికి ఆలోచిస్తారు' అని శ్రీధర్ తెలిపారు. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో జడేజా అద్భుత క్యాచ్ పట్టిన విషయం తెలిసిందే. ఈ క్యాచ్ మ్యాచ్‌పై ప్రభావం చూపింది.

చాలా మెరుగయ్యాడు:

'పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫీల్డింగ్‌లో చాలా మెరుగయ్యాడు. 2016తో పోల్చితే అతను బాగా ఫీల్డింగ్ చేస్తున్నాడు. బుమ్రా ఫీల్డింగ్ మెరుగులు ఇంకా నేర్చుకుంటున్నాడు. చహల్, జాదవ్ కూడా బాగా కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా ఫిట్ నెస్ పై దృష్టి పెట్టారు. బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు' అని శ్రీధర్ పేర్కొన్నారు.

ఫీల్డింగ్‌, క్యాచ్‌లపై ప్రభావం:

ఫీల్డింగ్‌, క్యాచ్‌లపై ప్రభావం:

ధావన్‌ గాయంపై మాట్లాడుతూ.. 'ధావన్‌కు అయిన గాయంతో అతని బ్యాటింగ్‌కు ఇబ్బంది లేదు. లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పటికి అతను సహజసిద్దంగా కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌. అయితే గాయం అతని ఫీల్డింగ్‌, క్యాచ్‌లు పట్టుకోవడంపై ప్రభావం చూపుతోంది' అని చెప్పారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ సందర్భంగా ధావన్‌ ఎడమ బొటన వేలికి గాయమైంది. గాయం అయినా నొప్పిని భరిస్తూ.. సెంచరీ చేసాడు.

Story first published: Friday, June 14, 2019, 13:40 [IST]
Other articles published on Jun 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X