న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'జులై 14న ప్రపంచకప్‌ నా చేతుల్లో ఉండాలనుకుంటున్నా'

ICC Cricket World Cup 2019 : On 14th July, I Want The World Cup In My Hand : Hardik Pandya
CWC19, India vs New Zealand Match: On 14th July, I want the World Cup in my hand says Hardik Pandya

లార్డ్స్ వేదికగా జులై 14న ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్. ఆ రోజున కప్ నా చేతుల్లో ఉండాలనుకుంటున్నా అని టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తెలిపారు. ప్రస్తుతం పాండ్యా ప్రపంచకప్‌ వేటలో ఉన్నాడు. ఆడిన రెండు మ్యాచ్‌లలో పాండ్యా భారీ హిట్టింగ్ చేసాడు. దక్షిణాఫ్రికాపై 7 బంతుల్లో 15, ఆస్ట్రేలియాపై 27 బంతుల్లో 48 పరుగులు చేసాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)కి ఇచ్చిన ఇంటర్య్వూలో హార్దిక్‌ పాండ్యా మాట్లాడుతూ... 'భారత క్రికెట్‌ జట్టు అన్నీ ఇచ్చింది. క్రికెట్‌ నా జీవితం. ఆటను ఎంతగా ప్రేమిస్తాను. అలాగే మ్యాచ్‌లో ఎదురయ్యే చాలెంజ్‌లను కూడా ఆస్వాదిస్తా. గత మూడేళ్లుగా ప్రపంచకప్‌ కోసం శ్రమిస్తున్నా. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. జూలై 14 ప్రపంచకప్‌ నా చేతుల్లో ఉండాలని కోరుకుంటున్నా' అని పాండ్యా తెలిపారు.

'2011ప్రపంచకప్‌ను టీమిండియా గెలిచిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటే నా ఒళ్లు పులకరించిపోతుంది. 2019 ప్రపంచకప్‌లో ఆడటం అనేది నా కల. నా లక్ష్యం ప్రపంచకప్‌ను గెలవడమే. అది జరుగుతుందని నమ్ముతున్నా. న జట్టు సభ్యులు అందరూ నా సోదరులు. అందరూ నాకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. నాపై ఎటువంటి ఒత్తిడి లేదు' అని పాండ్యా పేర్కొన్నారు.

ప్రపంచకప్‌లో భాగంగా గురువారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌కి వరుణుడు అంతరాయం కలిగిస్తున్నాడు. ఉదయం నుంచి నాటింగ్‌హామ్‌లో చిరుజల్లులు కురుస్తున్నాయి. భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు నాటింగ్ హామ్‌లో చిరుజల్లులు కురిశాయి. వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్‌ జరుగుతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు.

అయితే, వర్షం కారణంగా మైదానం మొత్తం తడిసిపోవడంతో సిబ్బింది గ్రౌండ్‌ను ఆరబెడుతుండటంతో టాస్ ఆలస్యం కానుంది. ఆ తర్వాత అంఫైర్లు 3 గంటల సమయంలో మళ్లీ పి‌చ్‌ను సందర్శించేందుకు వెళ్లే సమయంలో చిరు జల్లులతో కూడిన వర్షం ప్రారంభమైంది. దీంతో పిచ్‌ను కవర్లతో కప్పారు. మధ్యాహ్నం 3.30 కు మరోసారి గ్రౌండ్‌ను తనిఖీ చేసిన అనంతరం టాస్‌పై నిర్ణయం తీసుకోనున్నారు.

Story first published: Thursday, June 13, 2019, 15:48 [IST]
Other articles published on Jun 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X