న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లండ్‌పై విజయం.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా

ICC Cricket World Cup 2019 : England vs Australia Match Highlights || Oneindia Telugu
CWC19, England vs Australia: England feeling the pressure after another defeat as Australia march through to World Cup semi-finals

మంగళవారం లార్డ్స్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. వరల్డ్‌ నంబర్‌వన్‌, టోర్నీ హాట్‌ ఫేవరెట్‌ ఇంగ్లండ్‌ సొంతగడ్డపై మరో పేలవ ప్రదర్శన చేసింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ వైఫల్యంతో ఆసీస్‌ చేతిలోనూ చావుదెబ్బ తింది. సాధారణ లక్ష్యాన్ని ఛేదించలేక టోర్నీలో మూడో ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది. దీంతో సెమీస్‌ అవకాశాలు మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇక ఆస్ట్రేలియా మాత్రం అదరగొట్టే ఆటతో జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇంగ్లండ్‌పై విజయం సాధించిన ఆసీస్.. వరుసగా నాలుగో విజయాన్ని అందుకొని ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి అడుగు పెట్టిన తొలి జట్టుగా నిలిచింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

పరుగుల ఖాతా తెరవకుండానే:

పరుగుల ఖాతా తెరవకుండానే:

286 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు శుభారంభం దక్కలేదు. పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ల ఖాతా తెరిచింది. ఇన్నింగ్స్‌ రెండో బంతికే ఓపెనర్ జేమ్స్ విన్స్‌ (0)ను బెహ్రన్‌డార్ఫ్‌ క్లీన్‌బౌల్డ్‌ చేయగా.. మిచెల్ స్టార్క్‌ అద్భుత బంతికి జో రూట్‌ (8) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇక పుల్‌ షాట్‌ ఆడబోయి కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ (4) క్యాచ్ ఔట్ అయ్యాడు. 26 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్‌ కష్టాల్లో పడింది.

56కే నాలుగు వికెట్లు:

56కే నాలుగు వికెట్లు:

ఈ దశలో బెయిర్‌స్టో (27) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసాడు. అయితే బెయిర్‌స్టోను బెరెన్‌డార్ఫ్‌ ఔట్‌ చేశాడు. 56కే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. సమయంలో పోరాటపటిమను ప్రదర్శించిన స్టోక్స్‌.. బట్లర్‌ (25)తో కలిసి వికెట్లు పడకుండా అడ్డుకున్నాడు. అతడితో 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం తప్పించున్న బట్లర్‌.. చివరకు అద్భుత క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు.

స్టోక్స్‌ పోరాటం:

స్టోక్స్‌ పోరాటం:

స్టోక్స్‌ మాత్రం తన పోరాటం కొనసాగించాడు. ఈ క్రమంలో 75 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రిస్‌ వోక్స్‌ (26) అతనికి కొంత సహకారం అందించినా వేగంగా ఆడలేకపోయాడు. రెండు భారీ సిక్సర్లు, రెండు ఫోర్లు కొట్టి జోరు పెంచే ప్రయత్నం చేసిన స్టోక్స్‌ (89; 115 బంతుల్లో 8×4, 2×6)ను స్టార్క్‌ అద్భుత బంతితో బోల్డ్ చేసాడు. ఆ తర్వాత అలీ, వోక్స్ , రషీద్, ఆర్చర్ ఔట్ అవ్వడంతో ఇంగ్లండ్‌ 44.4 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. బెహ్రెన్‌డార్ఫ్‌ ఐదు వికెట్ల ఫీట్‌ సాధించాడు.

ఫించ్ సెంచరీ:

ఫించ్ సెంచరీ:

ఆస్ట్రేలియాకు ఫించ్, వార్నర్‌ మరోసారి అదిరే ఆరంభం అందించారు. పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్నా.. ఇంగ్లండ్‌ పేసర్లు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. ఓపెనర్లు ఇద్దరూ ఒకరితో మరొకరు పోటీపడి పరుగులు సాధించారు. ఈ క్రమంలో ఫించ్‌ 61 బంతుల్లో, వార్నర్‌ 52 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వంద పరుగుల భాగస్వామ్యం అనంతరం వార్నర్‌ (53; 61 బంతుల్లో 6×4)ను అలీ ఔట్‌ చేసాడు. మరోవైపు ఫించ్‌ దూకుడు తగ్గించలేదు. 50 పరుగులు జత చేసిన తర్వాత ఖవాజా వెనుదిరిగాడు. 115 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే ఫించ్‌ (116 బంతుల్లో 100; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) పెవిలియన్ చేరాడు. స్టీవ్‌ స్మిత్‌ (34 బంతుల్లో 38; 5 ఫోర్లు), చివర్లో క్యారీ (27 బంతుల్లో 38 నాటౌట్‌; 5 ఫోర్లు) వేగంగా ఆడటంతో ఆసీస్‌ 285 పరుగులు చేసింది.

Story first published: Wednesday, June 26, 2019, 7:52 [IST]
Other articles published on Jun 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X