న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అదృష్టం కలిసి వచ్చింది.. అన్ని పరుగులు చేస్తానని అనుకోలేదు'

CWC19, Australia vs West Indies Match: I did not think I would get that much says Nathan Coulter-Nile

మ్యాచ్‌లో అన్నిపరుగులు చేస్తానని అనుకోలేదు. అదృష్టం కూడా కలిసి వచ్చింది అని ఆస్ట్రేలియా పేస్ బౌలర్ కౌల్టర్‌ నైల్‌ పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 15 పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్.. విండీస్ బౌలర్ల దాటికి సగంకు పైగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో క్రీజులోకి వచ్చిన కౌల్టర్‌ నైల్‌ (60 బంతుల్లో 92; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడాడు.

క్రికెట్‌లో ఏదైనా సాధ్యమే:

క్రికెట్‌లో ఏదైనా సాధ్యమే:

మ్యాచ్ అనంతరం కౌల్టర్‌ నైల్‌ మాట్లాడుతూ... 'అన్నిపరుగులు చేస్తానని అనుకోలేదు. ఓ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో నేను ఔటైనా.. స్మిత్‌ (80) పరుగులు చేసాడు. అతని ఆట చూసి ఎలాగైనా క్రీజులో పాతుకుపోవాలనుకున్నా. అది ఈ మ్యాచ్‌లో అమలు చేశా. అదృష్టం కూడా కలిసివచ్చింది. బ్యాట్స్‌మెన్‌ తొందరగా ఔటవ్వడం, క్యాచ్‌ డ్రాప్‌ అవ్వడంతో పరుగులు చేసాను. క్రికెట్‌లో ఏదైనా సాధ్యమే' అని కౌల్టర్‌ నైల్‌ అన్నాడు.

ఆ ఇన్నింగ్స్ అసాధారణమైనది:

ఆ ఇన్నింగ్స్ అసాధారణమైనది:

ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ... 'ఇన్నింగ్స్ ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయాం. 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో స్మిత్, క్యారీలు ఇన్నింగ్స్‌ను నిర్మించారు. ఇక కౌల్టర్‌ నైల్‌ బాగా బ్యాటింగ్ చేసాడు. అతని ఇన్నింగ్స్ అసాధారణమైనది. కౌల్టర్‌ నైల్‌ బ్యాటింగ్ కూడా చేయగలడు అని అనుకునేవాళ్ళం. ఈ రోజు అతనికి వవకాశం వచ్చింది. తన బ్యాటింగ్ సామర్థ్యం నిరూపించుకున్నాడు. బంతితో కూడా రాణించాడు' అని ఫించ్ ప్రశంశించాడు.

చాలా నిరాశ చెందా:

చాలా నిరాశ చెందా:

'విజయం సాధించినందుకు చాలా గర్వంగా ఉంది. 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినప్పుడు చాలా నిరాశ చెందా. అయితే తిరిగి కోలుకోవడం, విండీస్ బ్యాట్స్‌మన్‌ల వికెట్లు తీయడం మ్యాచ్‌పై పట్టు సాధించాం. మా టాప్ ఆర్డర్ నిరాశ పరిచింది. చెత్త షాట్లు ఆడి పెవిలియన్ చేరారు. ఇంకా కొన్ని విభాగాల్లో మెరుగవ్వాలి' అని ఫించ్ చెప్పుకొచ్చాడు.

ఆసీస్ విజయం:

ఆసీస్ విజయం:

ప్రపంచకప్‌లో భాగంగా ఆసీసీతో జరిగిన మ్యాచ్‌లో విండీస్ 15 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆసీస్‌ నిర్దేశించిన 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 279 పరుగులకే పరిమితమైంది. హోప్‌(68), హోల్డర్‌(51), నిఖోలస్‌(40) రాణించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 49 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌటైంది. కౌల్టర్‌ నైల్‌ (92), స్టీవ్‌ స్మిత్‌ (74)లు అర్ధ సెంచరీలు చేశారు.

Story first published: Friday, June 7, 2019, 12:49 [IST]
Other articles published on Jun 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X