న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ట్వీట్ కొంప ముంచిందా? అంబటి రాయుడికి దక్కని చోటు, మనస్తాపంతో క్రికెట్‌కు రిటైర్మెంట్!

CWC 2019: World Cup snub forces Ambati Rayudu to announce retirement from international cricket

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్, హైదరాబాదీ ఆటగాడు అంబటి రాయుడు బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడం వల్లే మనస్తాపం చెందిన అంబటి రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇందుకు అంబటి రాయుడి స్వయం కృపరాధమే కారణమైందా? అవుననే అంటున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌కు ముందు సెలక్టర్లు అంబటి రాయుడు, రిషబ్ పంత్‌లను స్టాండ్‌ బై ఆటగాళ్లుగా ప్రకటించారు. అంతేకాదు అంబటి రాయుడు, రిషబ్‌ పంత్‌కు ప్రపంచకప్‌ ద్వారాలు మూసుకుపోలేదని, ఎవరైనా గాయాలపాలైతే.. వారిని జట్టులోకి తీసుకుంటామని సెలక్టర్లు ప్రకటించారు. గాయాలతో ఇద్దరు ఆటగాళ్లు ఇంటిదారి పట్టినప్పటికీ సెలక్టర్లు రాయుడిని పట్టించుకోలేదు.

తొలుత ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో

తొలుత ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో

ఈ ప్రపంచకప్‌లో తొలుత ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో జట్టు నుంచి వైదొలగడంతో అతడి స్థానంలో స్టాండ్ బై ఆటగాళ్లలో ఒకడైన రిషబ్ పంత్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ప్రపంచకప్‌లో రాయడుకు బదులు జట్టులో స్థానం సంపాదించుకున్న విజయ్‌ శంకర్‌ గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

విజయ్‌ శంకర్‌ నిష్క్రమణ నేపథ్యంలో

విజయ్‌ శంకర్‌ నిష్క్రమణ నేపథ్యంలో

విజయ్‌ శంకర్‌ నిష్క్రమణ నేపథ్యంలో అంబటి రాయుడికి అవకాశం వస్తుందని అందరూ భావించారు. అయితే, అంబటి రాయుడుని కాదని విజయ్ శంకర్ స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకుంటున్నారు. రెండోసారి కూడా రాయుడికి అవకాశం రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నాడు.

రాయుడిని స్టాండ్‌ బైగా ప్రకటించి

రాయుడిని స్టాండ్‌ బైగా ప్రకటించి

దీంతో అంబటి రాయుడిని స్టాండ్‌ బైగా ప్రకటించి గాయం కారణంగా ఆటగాళ్లు టోర్నీ నుంచి నిష్క్రమిస్తే.. అవకాశమిస్తామని సెలక్టర్లు ఎందుకు చెప్పారంటూ అభిమానులు బీసీసీఐ సైతం ప్రశ్నించారు. అయితే, అంబటి రాయుడిని జట్టులోకి తీసుకోకపోవడానికి వేరే కారణం ఉంది. ప్రపంచకప్‌కు ముందు విజయ్‌ శంకర్‌ను జట్టులోకి తీసుకున్నప్పుడు.. వరల్డ్‌ కప్‌ చూసేందుకు త్రీడీ గ్లాసులు ఆర్డర్‌ ఇచ్చానని రాయుడు వ్యంగ్యంగా ట్విటర్‌లో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, రాయుడి ట్వీట్‌పై స్పందించిన బీసీసీఐ అతడి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోలేదని పేర్కొంది.

సెలక్టర్లను తీవ్రంగానే హార్ట్‌ చేశాయో ఏమో

సెలక్టర్లను తీవ్రంగానే హార్ట్‌ చేశాయో ఏమో

కానీ, అంబటి రాయుడి వ్యాఖ్యలు సెలక్టర్లను తీవ్రంగానే హార్ట్‌ చేశాయో ఏమో తెలియదు గానీ... స్టాండ్ బైగా ఉన్నప్పటికీ అతడిని జట్టులోని తీసుకునే అవకాశం వచ్చినా సెలక్టర్లు మొగ్గు చూపడం లేదని వినిపిస్తోంది. విజయ్‌శంకర్‌ జట్టు నుంచి వైదొలిగినా.. అంబటికి అవకాశం ఇవ్వకపోవడంపై సోషల్‌ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మిడిలార్డర్ పరిస్థితి అంతంతమాత్రంగానే

మిడిలార్డర్ పరిస్థితి అంతంతమాత్రంగానే

ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా మిడిలార్డర్ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. నిజానికి విజయ్ శంకర్ స్థానంలో రాయుడిని ఎంపిక చేస్తే మిడిలార్డర్ సైతం పటిష్టంగా ఉండేది. బ్యాటింగ్‌లో ఎంతో అనుభవమున్న రాయుడిని కాదని.. అనుభవం లేని మయాంక్ అగర్వాల్‌కు సెలక్టర్లు చోటు కల్పించడంపై రాయుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

Story first published: Wednesday, July 3, 2019, 13:47 [IST]
Other articles published on Jul 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X