న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒక్క మ్యాచ్‌లో నాలుగు రికార్డులు: సత్తా చాటిన యువ క్రికెటర్

CWC 2019: Shaheen Afridi creates history, breaks 4 records and equals Tendulkar’s in one match against Bangladesh

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ యువ ఆటగాడు షహీన్ అఫ్రిది రికార్డుల మోత మోగించాడు. ఈ మ్యాచ్‌లో 19 ఏళ్ల అఫ్రిది 9.1 ఓవర్లు వేసి 35 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు. తద్వారా ప్రపంచకప్‌లో 5 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన అతి పిన్న వయస్కుడిగా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

దీంతో పాటు హోమ్‌ ఆఫ్‌ క్రికెట్‌గా పిలవబడుతున్న లార్డ్స్‌ క్రికెట్ గ్రౌండ్‌లో ఐదు వికెట్లకు పైగా సాధించిన యువ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే లార్డ్స్‌లో ఆరు వికెట్లు సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్‌లో ఓ పాకిస్థాన్ బౌలర్ తరపున నమోదైన అత్యుత్తమ గణాంకాలు కూడా ఇవే.

దీంతో పాటు ఈ వరల్డ్‌కప్‌లో మొత్తం 16 వికెట్లను సాధించి మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక వరల్డ్‌కప్‌ సీజన్‌లో అత్యధిక వికెట్లు సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడంతో షాహిన్‌ అఫ్రిదికి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

దీంతో ఒక వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో పిన్న వయసులో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్న రెండో క్రికెటర్‌గా నిలిచాడు. అంతకుముందు సచిన్‌ టెండూల్కర్‌ 1992 వరల్డ్‌కప్‌లో ఆ ఘనతను సాధించాడు. అంతేకదు ఆ వరల్డ్‌కప్‌లో సచిన్‌ రెండుసార్లు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకోవడం విశేషం.

Story first published: Saturday, July 6, 2019, 18:21 [IST]
Other articles published on Jul 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X