న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్: అరుదైన ఘనత సాధించిన మ్యాట్‌ హెన్రీ

Matt Henry

హైదరాబాద్: లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ పేసర్‌ మ్యాట్‌ హెన్రీ అరుదైన ఘనతను సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో తొలి పవర్‌ ప్లేలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో మ్యాట్ హెన్రీ మొదటి పవర్‌ ప్లేలో 8 వికెట్లను తీశాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

దీంతో ఈ మెగా టోర్నీలో పది ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు సాధించాడు. ఫైనల్లో ఓపెనర్ జేసన్‌ రాయ్‌ వికెట్‌ను సాధించడం​ ద్వారా మ్యాట్ హెన్రీ ఈ ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా ఆరో ఓవర్‌ నాలుగో బంతికి జేసన్ రాయ్‌ను మ్యాట్ హెన్రీ పెవిలియన్‌కు పంపాడు.

1
43691

ఈ జాబితాలో షెల్డన్ కాట్రెల్‌(వెస్టిండీస్‌), జోఫ్రా ఆర్చర్‌(ఇంగ్లండ్‌), క్రిస్‌ వోక్స్‌( ఇంగ్లండ్‌)లు సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వీందరూ తలో ఏడు వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. కాగా, టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది.

కివీస్ బ్యాట్స్‌మెన్లలో హెన్రీ నికోల్స్ (77 బంతుల్లో 55 పరుగులు, 4 ఫోర్లు), టామ్ లాథమ్ (56 బంతుల్లో 47 పరుగులు, 2 ఫోర్లు, 1 సిక్సర్)లు మాత్రం ఫర్వాలేదనిపించారు. ఇక, మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, ప్లంకెట్‌లకు చెరో 3 వికెట్లు తీయగా... జోఫ్రా ఆర్చర్, మార్క్‌వుడ్‌లు చెరొ వికెట్ తీశారు.

{headtohead_cricket_2_4}

Story first published: Sunday, July 14, 2019, 21:16 [IST]
Other articles published on Jul 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X