న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓ వైపు వ‌ర్షాలు..మ‌రో వైపు గాయాలు! ఏమైంది ఈ ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌కు!

CWC 2019: Injury hit list- Players who have been injured in this tournament so far

లండ‌న్‌: ప్రపంచక‌ప్ మెగా టోర్న‌మెంట్ షెడ్యూల్‌ను ఏ ముహూర్తంలో ప్ర‌క‌టించారో గానీ.. బొత్తిగా మజా అనేది లేకుండా పోతోంది. క‌ళ త‌ప్పుతోంది. చ‌ప్ప‌గా త‌యారైంది. చాలావ‌ర‌కు మ్యాచ్‌లు వార్ వన్ సైడ్ అన్నట్టుగా త‌యార‌య్యాయి. కొన్ని మ్యాచ్‌ల‌కు వ‌రుణ‌దేవుడు అడ్డు ప‌డితే.. మ‌రి కొన్ని పూర్తిగా ఏక‌ప‌క్షంగా సాగిపోతున్నాయి. దీనితో పెద్ద‌గా ఆట‌ను ఆస్వాదించ‌డానికి ఏమీ లేకుండా త‌యారైంది ప‌రిస్థితి. పోటా పోటీ, హోరాహోరీ అనే మాట‌లే పెద్ద‌గా వినిపించ‌ట్లేదు. హోరా హోరీ మాటే లేన‌ప్పుడు ఇక‌ న‌రాలు తెగే ఉత్కంఠత‌కు ఆస్కార‌మే లేదు. దీనికితోడు- గాయాలు ఒకటి. రోజుకో క్రికెట‌ర్ చొప్పున గాయాల బారిన ప‌డుతున్నారు. కొంద‌రు కోలుకుంటుంటే మ‌రి కొంద‌రికి ఆ ఛాన్స్ లేకుండా పోతోంది.

కొంప‌ముంచిన వేలి గాయం: ప్ర‌పంచ‌క‌ప్‌లో అన్ని మ్యాచ్‌ల‌కూ శిఖ‌ర్ ధావ‌న్ దూరం!కొంప‌ముంచిన వేలి గాయం: ప్ర‌పంచ‌క‌ప్‌లో అన్ని మ్యాచ్‌ల‌కూ శిఖ‌ర్ ధావ‌న్ దూరం!

శిఖ‌ర్ ధావ‌న్ వేలి గాయంతో టోర్నీకి దూరం..

శిఖ‌ర్ ధావ‌న్ వేలి గాయంతో టోర్నీకి దూరం..

టీమిండియా డాషింగ్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ ఈ టోర్న‌మెంట్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ప‌టిష్ట‌మైన ఆస్ట్రేలియా జ‌ట్టుపై ఒంటి చేత్తో సెంచ‌రీ బాదాడు. మ‌రో చేతికి దెబ్బ తిగిలించుకున్నాడు. మొద‌ట్లో రెండు మ్యాచ్‌లు అన్నారు.. ఆ త‌రువాత అది నాలుగుకు పెరిగింది. చివ‌రికీ అదీ లేకుండా పోయింది. అస‌లుకే ఎస‌రు ప‌డింది. మొత్తం టోర్న‌మెంట్‌కే దూరం అయ్యాడు గ‌బ్బ‌ర్ సింగ్‌. ఫ‌లితంగా- ఇక ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌ల‌ల్లో శిఖ‌ర్ ధావ‌న్ మెరుపుల‌ను మ‌నం చూడ‌లేం. స్టైలిష్ ఆఫ్ సైడ్ క‌వ‌ర్ డ్రైవ్‌లు, ఆన్ సైడ్ షాట్లు, అల‌వోక‌గా ఆడే హుక్ షాట్ల‌కు దూరం అయిన‌ట్టే. మ‌ళ్లీ- శిఖ‌ర్ ధావ‌న్ క్రీజులో అడుగు పెట్ట‌డానికి చాలాకాల‌మే పట్టేట్టు ఉంది ప‌రిస్థితి.

భువ‌నేశ్వ‌ర్‌.. కాలి కండ‌రాలు ప‌ట్టేసి..

భువ‌నేశ్వ‌ర్‌.. కాలి కండ‌రాలు ప‌ట్టేసి..

శిఖ‌ర్ ధావ‌న్‌తో పాటు గాయ‌ప‌డ్డ మ‌రో టీమిండియా కీల‌క ఆట‌గాడు మీడ‌యం పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్‌. మాంఛెస్ట‌ర్‌లో ఆదివారం పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్ సంద‌ర్భంగా కాలి కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో అర్ధాంత‌రంగా ఫీల్డ్‌ను వ‌దిలాడు భువ‌నేశ్వ‌ర్ కుమార్‌. మూడో ఓవ‌ర్‌లో నాలుగో బంతి వేసిన త‌రువాత ఇక కొన‌సాగించ‌లేక‌పోయాడు. డ్రెస్సింగ్ రూమ్ బాట ప‌ట్టాడు. ఆ త‌రువాత అత‌ని ఆరోగ్య ప‌రిస్థితిపై పెద్ద‌గా అప్‌డేట్స్ ఏమీ రాలేదు. మూడు మ్యాచ్‌లు విశ్రాంతి తీసుకుంటే స‌రిపోతుంద‌ని టీమిండియా ఫిజిక‌ల్ ట్రెయిన‌ర్ శంక‌ర్ బ‌సు తెలిపారు. ప్ర‌స్తుతం భువి ఇంగ్లండ్‌లోనే జ‌ట్టుతో పాటు ఉంటున్నాడు. విశ్రాంతి తీసుకుంటున్నాడు. అత‌ని స్థానాన్ని మ‌రో బౌల‌ర్‌తో భ‌ర్తీ చేయాల‌ని కూడా అనుకోవ‌ట్లేదు బీసీసీఐ.

జేస‌న్ రాయ్‌దీ ఇదే ప‌రిస్థితి..

జేస‌న్ రాయ్‌దీ ఇదే ప‌రిస్థితి..

భువ‌నేశ్వ‌ర్ కుమార్ త‌ర‌హాలోనే కాలి కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో మ్యాచ్‌ల‌కు దూరం అయ్యాడు ఇంగ్లండ్ ఓపెన‌ర్ జేస‌న్ రాయ్‌. అత‌ని స్థానంలో జేమ్స్‌ను విన్సీని ఆడిస్తోంది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు. మాంఛెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో ఆఫ్ఘ‌నిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఓపెన‌ర్‌గా వ‌చ్చాడు విన్సీ. క‌నీసం రెండు మ్యాచ్‌ల‌కు జేస‌న్ రాయ్ దూరం అవుతాడ‌ని ఇంగ్లండ్ టీమ్ మేనేజ్‌మెంట్ చెబుతోంది. భార‌త్‌తో మ్యాచ్ నాటికి పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటాడ‌ని ఆశాభావాన్ని వ్య‌క్తం చేస్తోంది.

ఒక్క మ్యాచూ ఆడ‌ని స్టెయిన్‌

ఒక్క మ్యాచూ ఆడ‌ని స్టెయిన్‌

ద‌క్షిణాఫ్రికా ఫాస్ట్ బౌల‌ర్ డేల్ స్టెయిన్ ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌లేదు. టోర్నీ నుంచి నిష్క్ర‌మించాడు. భుజానికి గాయం కావ‌డం వ‌ల్ల స్టెయిన్ బౌలింగ్ చేయ‌లేడ‌ని జ‌ట్టు ప్ర‌క‌టించింది. అత‌ని స్థానంలో హెన్రిక్స్‌ను తీసుకుంది. నిజానికి ఈ గాయం వ‌ల్లే స్టెయిన్ మొన్న‌టి ఐపీఎల్ కూడా ఆడ‌లేక‌పోయాడు. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు స‌భ్యుడైన స్టెయిన్ పూర్తిగా డ‌గౌట్‌కే ప‌రిమితం అయ్యాడు. ఎన్గిడిని తీసుకున్న‌ప్ప‌టికీ.. కాలి కండ‌రాల వ‌ల్ల అత‌నూ రెండు మ్యాచ్‌ల‌కు దూరం అయ్యాడు. మ‌ళ్లీ ఫిట్‌నెస్‌తో తిరిగొచ్చాడు. జ‌ట్టుతో క‌లిశాడు.

స్టాయినిస్‌, షెహ‌జాద్ అదే బాట‌..

స్టాయినిస్‌, షెహ‌జాద్ అదే బాట‌..

ఇదివ‌ర‌కు ఇంగ్లండ్ ఫాస్ట్ బౌల‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ బంతికి ద‌క్షిణాఫ్రికా ఓపెన‌ర్ హ‌షీమ్ ఆమ్లా కూడా గాయ‌ప‌డ్డాడు. ఆ వెంట‌నే కోలుకున్నాడు. ఓ మ్యాచ్ ఆడ‌లేదు. మిగిలిన మ్యాచ్‌ల‌కు సిద్ధం అయ్యాడు. ఆస్ట్రేలియా ఆట‌గాడు మార్క‌స్ స్టాయినిస్‌, ఆఫ్ఘ‌నిస్తాన్ వికెట్ కీప‌ర్ మ‌హమ్మ‌ద్ షెహ‌జాద్.. వీళ్లంతా గాయాల బారిన ప‌డ్డ వారే. స్టాయినిస్‌, షెహ‌జాద్ కూడా టోర్న‌మెంట్‌కు దూరం అయ్యారు.

Story first published: Wednesday, June 19, 2019, 18:52 [IST]
Other articles published on Jun 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X