న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాధ్యత వారిదే: ఘోర ఓటమికి కారణం వెల్లడించిన విండిస్ కెప్టెన్

CWC 2019: Batsmen need to take responsibility, avoid careless shots, says Jason Holder

హైదరాబాద్: సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండిస్ ఘోరంగా ఓడిపోవడంపై ఆ జట్టు కెప్టెన్ జాసన్ హోల్డర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఈ ఘోర ఓటమికి తమ బ్యాట్స్‌మెన్‌ కారణమని మండిపడ్డాడు. ఈ మ్యాచ్‌లో విండిస్ బ్యాట్స్‌మన్ నిర్లక్ష్యపు షాట్లతో ఔట్‌ కావడాన్ని తప్పుబట్టాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో వెస్టిండిస్‌ 8 వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనతంరం జాసన్ హోల్డర్ మాట్లాడుతూ "స్కోరు బోర్డుపై పోరాడటానికి సరిపడా పరుగులు లేవు. వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూనే ఉన్నాం. సరైన భాగస్వామ్యాలు కూడా నమోదు చేయలేకపోయాం. ఇందుకు కారణం తమ ఆటగాళ్లు నిర్లక్ష్యపు షాట్లే" అని తెలిపాడు.

"మిడిల్ ఓవర్లలోనే మ్యాచ్‌ మా చేతుల్లోంచి జారిపోయింది. ప్రతీ ఒక్క బ్యాట్స్‌మన్‌ మరింత బాధ్యతగా ఆడాలి. ఈ వరల్డ్‌కప్‌లో రెండు మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మన్‌ నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనబడింది" అని హోల్డర్‌ మండిపడ్డాడు. విండిస్ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్యాన్ని 33.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌కు ఇది మూడో విజయం కాగా, వెస్టిండిస్‌కు రెండో ఓటమి. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో జో రూట్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో జో రూట్‌కి ఇది రెండో సెంచరీ కావడం విశేషం. వెస్టిండిస్ బౌలర్లలో గాబ్రియల్‌కు రెండు వికెట్లు పడగొట్టాడు.



చేధనలో ఓపెనర్లు బెయిర్‌స్టో-జో రూట్‌లు ఇన్నింగ్స్‌‌ను దూకుడుగా ఆరంభించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీల వైపు దూసుకెళ్తున్న సమయంలో జట్టు స్కోరు 95 పరుగుల వద్ద జానీ బెయిర్ స్టో(45) రూపంలో ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. గాబ్రియేల్ వేసిన 15వ ఓవర్ నాలుగో బంతికి బ్రాత్‌వైట్‌కు క్యాచ్ ఇచ్చి బెయిర్‌స్టో పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వోక్స్‌తో కలిసి జో రూట్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇద్దరూ కలిసి విండీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఈ క్రమంలో విజయానికి మరో 14 పరుగులు అవసరమైన తరుణంలో క్రిస్ వోక్స్(40) పరుగుల వద్ద భారీ షాట్‌కు యత్నించి ఫ్యాబియన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

మరోవైపు జోరూట్ 93 బంతుల్లో 11 ఫోర్లతో వన్డేల్లో 16 సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం బెన్ స్టోక్స్ ఫోర్ కొట్టి ఇంగ్లాండ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. వెస్టిండిస్ బౌలర్లలో గాబ్రియల్‌ రెండు వికెట్లు తీశాడు. అంతకముందు విండిస్ బ్యాట్స్‌మెన్లలో నికోలస్ పూరన్ 78 బంతుల్లో 63(3 ఫోర్లు, సిక్స్), హెట్ మెయిర్ 48 బంతుల్లో 39(4 ఫోర్లు) రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ జట్టు నిర్ణీత 44.4 ఓవర్లలో 212 పరుగులు చేసి ఆలౌటైంది.

Story first published: Saturday, June 15, 2019, 16:36 [IST]
Other articles published on Jun 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X