న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

144/1 to 182/8: శ్రీలంక-ఆప్ఘన్ మ్యాచ్‌కి వరుణుడు అడ్డంకి

CWC 2019: Afghanistan vs Sri Lanka Live Cricket Score: Rain interrupts Sri Lankas slide

హైదరాబాద్: కార్డిఫ్ వేదికగా అప్ఘనిస్థాన్‌-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. శ్రీలంక ఇన్నిoగ్స్ 33వ ఓవ‌ర్‌ ముగిసిన తర్వాత అకస్మాత్తుగా వర్షం రావ‌డంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. గ్రౌండ్ సిబ్బంది వెంట‌నే మైదానాన్ని క‌వ‌ర్ల‌తో క‌ప్పారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్ర‌స్తుతం శ్రీలంక 33 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. క్రీజులో సురంగ లక్మల్‌(2), మలింగ పరుగులేమీ చేయకుండా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆప్ఘనిస్థాన్‌ కెప్టెన్ శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. లంక ఓపెనర్లు మంచి శుభారంభాన్నిచ్చినప్పటికీ ఆ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయింది.

ఇన్నింగ్స్ 22వ ఓవర్‌లో మూడు వికెట్లు తీశాడు. ఆ ఓవర్‌ రెండో బంతికి తిరిమన్నే(25)ను ఔట్‌ చేసిన నబీ.. నాలుగో బంతికి కుశాల్‌ మెండిస్‌(2) ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రహ్మత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అదే ఓవర్‌లో ఆరో బంతికి ఏంజెలో మాథ్యూస్‌(0)ను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో శ్రీలంక 146 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది.

సంచనాలకు మారుపేరైన ఆప్ఘనిస్థాన్ ఈ మ్యాచ్‌లో విజృంభిస్తోంది. మ్యాచ్ ఆరంభంలో ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. దిముత్‌ కరుణరత్నే 45 బంతుల్లో 30(3 ఫోర్లు), కుశాల్‌ పెరీరా 81 బంతుల్లో 78(8 ఫోర్లు)లు తొలి వికెట్‌కు 92 పరుగులు జత చేశారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లాహిరు తిరుమన్నే34 బంతుల్లో 25(1 ఫోర్) ఫరవాలేదనిపించాడు.

అనంతరం కుశాల్ మెండిస్(2), ఏంజెలో మాథ్యూస్‌(0), ధనుంజయ డిసిల్వా(0), ఇసురు ఉదనా(10), తిషారా పెరీరా(2) పరుగులకే పెవిలియన్‌కు చేరారు. ఆప్ఘన్ బౌలర్లలో మహ్మద్ నబీ నాలుగు వికెట్లు తీయగా... జాద్రన్, రషీద్ ఖాన్, హమీద్ హాసన్ తలో వికెట్ తీసుకున్నారు.

Story first published: Tuesday, June 4, 2019, 18:40 [IST]
Other articles published on Jun 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X