న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్‌ ప్రపంచకప్‌ జట్టు ఇదే.. భారత్ నుంచి ఐదుగురికి చోటు

Sachin Tendulkar Picks His Team Of The Tournament || Oneindia Telugu
CWC 19: Sachin Tendulkar picks his team of the tournament Team, Kane Williamson Captain, 5 Indians included

ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ ముగిసింది. ప్రతిష్టాత్మకమైన లార్డ్స్‌ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అనూహ్య విజయం సాధించి తొలిసారి కప్ గెలిచింది. ఫైనల్ మ్యాచ్‌, సూపర్ ఓవర్ కూడా టై కావడంతో.. ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లండ్‌ విజేతగా నిలిచింది.

కెప్టెన్‌గా విలియమ్సన్‌:

కెప్టెన్‌గా విలియమ్సన్‌:

సోమవారం టోర్నీమొత్తం విశేషంగా రాణించిన ఆటగాళ్లతో 'ఐసీసీ' ప్రపంచకప్‌ జట్టును ఎంపిక చేసింది. మంగళవారం భారత దిగ్గజం మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కూడా క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా తమ అత్యుత్తమ ప్రపంచకప్‌ ఎలెవన్‌ జట్టును ప్రకటించారు. టోర్నీ మొత్తం రాణించిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను తన జట్టు సారధిగా ఎంచుకున్నారు. ఇంగ్లాండ్ ఓపెనర్ జానీ బెయిర్‌ స్టోను వికెట్ కీపర్‌గా సెలక్ట్ చేశారు.

భారత్ నుంచి ఐదుగురు:

భారత్ నుంచి ఐదుగురు:

సచిన్ తన జట్టులో భారత్ నుంచి ఏకంగా ఐదు మందికి చోటు కల్పించారు. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, జఫ్రీత్ బుమ్రాలకు చోటు దక్కింది. అయితే ఎంఎస్‌ ధోనీకి చోటు దక్కలేదు. ఇంగ్లాండ్ నుండి బెన్‌ స్టోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌, బెయిర్‌ స్టోలను తీసుకున్నారు. వరుస అర్ధ శతకాలు బాదిన బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్‌ షకీబ్ అల్ హసన్ చోటు దక్కించుకున్నాడు.

 స్టార్క్‌కు చోటు:

స్టార్క్‌కు చోటు:

ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్ల తీసిన ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్‌కు తన జట్టులో సచిన్ చోటు కల్పించారు. ఆసీస్, బంగ్లా, కివీస్ జట్ల నుండి ఒక్కొక్కరు ఎంపికయ్యారు. ప్రపంచకప్‌లో పరుగుల వీరులు ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, బాబర్ ఆజామ్ లాంటి వారు సచిన్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. ఇక 20 వికెట్లు తీసిన బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ కూడా ఎంపిక కాలేదు

సచిన్‌ జట్టు:

సచిన్‌ జట్టు:

రోహిత్‌ శర్మ, బెయిర్‌ స్టో (వికెట్‌ కీపర్‌), విరాట్‌ కోహ్లీ, కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), షకీబుల్‌ హసన్‌, బెన్‌ స్టోక్స్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, మిచెల్‌ స్టార్క్‌, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్‌.

Story first published: Tuesday, July 16, 2019, 14:57 [IST]
Other articles published on Jul 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X