న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌ ఫైనల్: సూపర్‌ ఓవర్‌కు ముందు ఆర్చర్‌తో స్టోక్స్ ఏం చెప్పాడంటే?

ICC Cricket World Cup 2019 Final : Ben Stokes Advice Helped Jofra Archer In Super Over || Oneindia
CWC 19, New Zealand vs England Final Match: What Ben Stokes said to Jofra Archer before the Super Over

ఆదివారం లార్డ్స్ వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు అనూహ్య రీతిలో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సైతం నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.

ప్రపంచకప్‌ ఫైనల్.. ఇరు జట్లను విజేతలుగా ప్రకటించాల్సిందిప్రపంచకప్‌ ఫైనల్.. ఇరు జట్లను విజేతలుగా ప్రకటించాల్సింది

తొలిసారి విశ్వవిజేత:

తొలిసారి విశ్వవిజేత:

సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అనంతరం 16 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆరు బంతుల్లో వికెట్ నష్టపోయి 15 పరుగులే చేసింది. దీంతో సూపర్ ఓవర్ కూడా టై అయింది. చివరకు బౌండరీలు ఆధారంగా ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న ఇంగ్లాండ్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది.

కూల్‌గా బౌలింగ్ చేయి:

కూల్‌గా బౌలింగ్ చేయి:

ఇంగ్లాండ్ తరపున సూపర్‌ ఓవర్‌ను స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ వేసాడు. అయితే సూపర్‌ ఓవర్‌ వేయడానికి ముందు ఆల్‌రౌండర్‌ బెన్ స్టోక్స్‌ వచ్చి ఎటువంటి ఆందోళనకు గురికాకుండా కూల్‌గా ఉండమని చెప్పాడట. 'గెలుపు, ఓటములు గురించి పట్టించుకోకు. ఈ రోజు ప్రదర్శన నీ ప్రతిభను తగ్గించదు. అందరూ నీపై నమ్మకం ఉంచారు. ఆందోళనకు గురికాకుండా కూల్‌గా బౌలింగ్ చేయి' అని స్టోక్స్‌ ధైర్యం చెప్పాడు. ఆ సలహాతోనే స్వేచ్ఛగా బౌలింగ్‌ వేశా అని ఆర్చర్‌ తెలిపాడు.

ప్రపంచం అక్కడితో ఆగిపోదు:

ప్రపంచం అక్కడితో ఆగిపోదు:

'ఫైనల్ మ్యాచ్ ఓడిపోయి ఉంటే, తర్వాత ఏమి చేసేవాన్నో నాక్కుడా తెలియదు. ఓడిపోతే వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ రూపంలో మరో అవకాశం ఉంటుంది. జో రూట్‌ కూడా వచ్చి కొన్ని స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పాడు. ఒకవేళ మేము ఓటమి పాలైతే ప్రపంచం అక్కడితో ఆగిపోదు. ఈ విషయం నాకు తెలుసు. ప్రతీ ఒక్కరూ నమ్మకం ఉంచారు. ఫలితంపై జట్టు సభ్యులు అందరూ సంతోషంగా ఉన్నారు, వారిని చూస్తే చాలా ఆనందంగా ఉంది' అని ఆర్చర్‌ పేర్కొన్నాడు.

అరుదైన రికార్డు:

అరుదైన రికార్డు:

ఇంగ్లండ్‌ ప్రపంచకప్‌ జట్టులో అనూహ్యంగా చోటుదక్కించుకున్న ఆర్చర్‌.. అంచనాలను అందుకుని సత్తా చాటాడు. ప్రపంచకప్‌లో ఆర్చర్‌ అరుదైన రికార్డును సాధించాడు. ఒకే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ తరఫున అత్యధిక వికెట్లు (20) తీసిన ఆటగాడిగా రికార్డులోకి ఎక్కాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో మ్యాట్‌ హెన్రీని ఔట్‌ చేసి ఈ ఘనత సాధించాడు. 18 వికెట్లతో మార్క్‌ వుడ్‌ రెండో స్థానంలో ఉండగా.. క్రిస్ వోక్స్‌ 16 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

Story first published: Tuesday, July 16, 2019, 12:48 [IST]
Other articles published on Jul 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X