న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బెన్ స్టోక్స్‌కు 'నైట్‌హుడ్' పురస్కారం!!

CWC 19, Knighthood for Ben Stokes: Of course says UKs next prime ministerial candidates

తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత పోరాటం చేసి క్రికెట్‌ పుట్టిల్లు ఇంగ్లాండ్‌ దశబ్దాల కలను నిజం చేసిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ బెన్ స్టోక్స్‌కు బ్రిటన్ అత్యున్నత పురస్కారం 'నైట్‌హుడ్' దక్కే అవకాశం ఉంది. ప్రస్తుత బ్రిటన్ ప్రధాని థెరిసా మే తర్వాత ఆ పదవి కోసం పోటీపడుతున్న బోరిస్ జాన్సన్, జెరెమీ హంట్‌లు స్టోక్స్‌ ప్రదర్శనకు ముగ్ధులై అతడికి అత్యున్నత పురస్కారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

స్టోక్స్‌కు నైట్‌హుడ్‌:

స్టోక్స్‌కు నైట్‌హుడ్‌:

దిసన్‌, టాక్‌ రేడియో ఏర్పాటు చేసిన చర్చలో అడిగిన ర్యాపిడ్‌ ఫైర్‌ 'అవును, కాదు' ప్రశ్నలకు వీరు సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా స్టోక్స్‌ నైట్‌హుడ్‌కు అర్హుడేనా అన్న ప్రశ్నకు జాన్సన్‌ సమాధానమిస్తూ.. 'కచ్చితంగా, అవును' అని తెలిపారు. 'డక్‌డోమ్స్‌ అయినా ఇస్తా. ఏదైనా సరే అత్యున్నతమైన పురస్కారం ఇస్తా. గార్టర్‌ కింగ్‌ ఆఫ్ ఆర్మ్స్‌ అయినా ఇస్తా' అని జాన్సన్‌ తెలిపారు.

ఎవరు ప్రధాని అయినా..:

ఎవరు ప్రధాని అయినా..:

ఇదే ప్రశ్నను జెరెమీ హంట్‌ను అడగగా.. 'ఆఫ్‌కోర్స్‌' అని సమాధానం ఇచ్చారు. దీంతో ఇద్దరిలో ఎవరు ప్రధాని అయినా.. స్టోక్స్‌కు నైట్‌హుడ్ పురస్కారం దక్కనుంది. నైట్‌హుడ్ కాకపోయినా మరో అత్యున్నత పురస్కారం దక్కే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 11 మంది క్రికెటర్లకు నైట్‌హుడ్‌ పురస్కారం ఇచ్చారు. చివరిసారి ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ అలిస్టర్‌ కుక్‌ ఈ పురస్కారం అందుకున్నాడు.

84 పరుగులతో అజేయంగా:

84 పరుగులతో అజేయంగా:

లార్డ్స్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో స్టోక్స్‌ వీరోచితంగా పోరాడాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. ఒత్తిడిని తట్టుకుని చివరి వరకు క్రీజులో నిలబడి 98 బంతుల్లో 84 పరుగులతో అజేయంగా నిలిచాడు. చివరి ఓవర్లో పోరాడి మ్యాచ్‌ టై చేశాడు. అనంతరం సూపర్‌ ఓవర్‌లోనూ 8 పరుగులు చేసాడు. ఇక టోర్నీలో 465 పరుగులతో పాటు ఏడు వికెట్లు తీసి ఇంగ్లండ్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.

విశ్వవిజేత ఇంగ్లండ్:

విశ్వవిజేత ఇంగ్లండ్:

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కూడా నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూపర్ ఓవర్‌ కూడా టై కావడంతో.. మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు బాదిన ఇంగ్లాండ్ జట్టు విజేతగా నిలిచింది.

Story first published: Wednesday, July 17, 2019, 9:09 [IST]
Other articles published on Jul 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X