న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ దిగ్గజం సచిన్‌తో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌

CWC 19: India vs England: Google CEO Sundar Pichai meets Sachin Tendulkar At Edgbaston, Birmingham

ఇండియన్-అమెరికన్ బిజినెస్ మ్యాన్, గూగుల్‌ సీఈవో సుందర్ పిచాయ్ క్రికెట్‌కు పెద్ద అభిమాని అన్న సంగతి తెలిసిందే. క్రికెట్‌పై ఉన్న అభిమానంతో సమయం దొరికినప్పుడల్లా టీమిండియా ఎక్కడ మ్యాచ్‌లు ఆడినా సుందర్ పిచాయ్ ప్రత్యక్షమవుతారు. ప్రపంచకప్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌ వేదికగా ఆదివారం భారత్‌-ఇంగ్లండ్‌ మ్యాచ్‌కు పిచాయ్ హాజరయ్యారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

సచిన్‌తో పిచాయ్‌:

ఈ సందర్భంగా ప్రస్తుతం ప్రపంచకప్‌కు వ్యాఖ్యాతగా ఉన్న క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ను సుందర్‌ పిచాయ్‌ కలిశారు. ఇద్దరు కలిసి కాసేపు ముచ్చటించారు. దీనికి సంబందించిన ఫొటోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో తెగ వైరల్ అయింది.

జోస్యం నిజమవుతుందా:

ఇంతకుముందు (ప్రపంచకప్‌ ప్రారంభమయ్యాక) సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. 'ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఇండియా, ఇంగ్లాండ్ జట్లు ఫైనల్‌కు వెళతాయని అంచనా వేశారు. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీసేన విజయం సాధిస్తుందన్నారు'. పిచాయ్ చెప్పినట్టే రెండు జట్లు సెమీస్ చేరనున్నాయి. ఫైనల్‌కు కూడా వెళ్లే అవకాశం ఉంది. మరి పిచాయ్ జోస్యం నిజమవుతుందో చూడాలి.

 భారత్‌ ఓటమి:

భారత్‌ ఓటమి:

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఓపెనర్, 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' జానీ బెయిర్‌స్టో (109 బంతుల్లో 111; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీ చేసాడు. మరో ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (57 బంతుల్లో 66; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ (54 బంతుల్లో 79; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. మొహమ్మద్‌ షమీ ఐదు వికెట్లు తీసాడు. లక్ష్య ఛేదనలో రోహిత్‌ శర్మ (109 బంతుల్లో 102; 15 ఫోర్లు) సెంచరీ.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (76 బంతుల్లో 66; 7 ఫోర్లు), హార్దిక్‌ పాండ్యా (33 బంతుల్లో 45; 4 ఫోర్లు) మెరిసినా.. టీమిండియా భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 31 పరుగుల తేడాతో ఓడింది.

Story first published: Monday, July 1, 2019, 8:41 [IST]
Other articles published on Jul 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X