న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాక్స్‌వెల్‌, ఫించ్ మెరుపు క్యాచ్.. వోక్స్‌ ఔట్ (వీడియో)

ICC Cricket World Cup 2019 : Maxwell Stunning Catch To Dismiss Chris Woakes || Oneindia Telugu
CWC 19, England vs Australia: Glenn Maxwell and Aaron Finch combine smartly on the boundary to catch and dismiss Chris Woakes

వన్డే ప్రపంచకప్‌ అభిమానులకు అసలైన క్రికెట్ మజాను పంచుతుంది. తొలుత మ్యాచ్‌లు కొన్ని ఏకపక్షంగా సాగడంతో నిరాశకు గురైన అభిమానులు.. టోర్నీ గడుస్తున్నా కొద్దీ రసవత్తరంగా సాగుతుండడంతో మ్యాచ్‌లను ఎంజాయ్ చేస్తున్నారు. బ్యాట్స్‌మన్‌ పరుగులు చేస్తుండగా.. బౌలర్లు వికెట్లతో చెలరేగుతున్నారు. ఇక ఫీల్డర్లు, వికెట్‌ కీపర్‌లు కూడా తమ విన్యాసాలతో ఆకట్టుకుంటున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ పట్టిన క్యాచ్‌ని మాజీ క్రికెటర్లు 'క్యాచ్‌ ఆఫ్‌ ది సెంచరీ'గా అభివర్ణించారు. వెస్టిండిస్ వికెట్ కీపర్ షాయ్‌ హోప్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో పాక్ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌ను వెనక్కి పంపాడు. ఇక దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ డికాక్‌ రెండు సూపర్ క్యాచ్‌లు అందుకున్నాడు. తాజాగా ఈ ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ కూడా అద్భుత మెరుపు క్యాచ్ అందుకున్నాడు.

ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బ్యాటింగ్ చేస్తోంది. ఆసీస్‌ బౌలర్‌ బెహ్రాన్‌డార్ఫ్‌ వేసిన 42వ ఓవర్‌ రెండో బంతిని క్రిస్‌ వోక్స్‌ డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా భారీ షాట్‌ ఆడాడు. అందరూ అది సిక్సర్ అని అనుకున్నారు. కానీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న మ్యాక్స్‌వెల్‌ గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు. బ్యాలెన్స్‌ కోల్పోయిన మ్యాక్స్‌వెల్‌.. బౌండరీ లైన్ దాటేలోపు అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న ఫించ్‌ వైపు బంతిని విసిరేశాడు. ఫించ్‌ దాన్ని క్యాచ్ పట్టడంతో వోక్స్‌ నిరాశగా పెవిలియన్ చేరాడు.

మ్యాక్స్‌వెల్‌ మెరుపు క్యాచ్‌తో ఆసీస్‌ ఆటగాళ్లు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. తేరుకుని సంబరాలు చేసుకున్నారు. మ్యాక్స్‌వెల్‌ మెరుపు ఫీల్డింగ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 'సో సో గుడ్ మ్యాక్స్‌వెల్‌' అని క్రికెట్ ప్రపంచకప్‌ ట్వీటింది. గుడ్ క్యాచ్ అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది.

1
43675

{headtohead_cricket_1_2}

Story first published: Wednesday, June 26, 2019, 10:30 [IST]
Other articles published on Jun 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X