న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెమీఫైనల్లో ఆస్ట్రేలియాకు షాక్.. ఫైనల్లో ఇంగ్లాండ్‌

ICC Cricket World Cup 2019 : 2nd Semi Final : England Defeat Australia By 8 Wickets || Oneindia
CWC 19, Australia vs England Semi Final: England beat Australia by 8 wickets & enters Finals

డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాకు సెమీ ఫైనల్లో ఊహించని షాక్ తగిలింది. టైటిల్ ఫేవరెట్‌గా ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్‌ అంచనాలను అందుకుని ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం రెండో సెమీఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. దీంతో ఆదివారం ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో జరగబోయే ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్‌ తలపడనుంది. ఓ ప్రపంచకప్‌ సెమీస్‌లో ఓడడం ఆస్ట్రేలియాకు ఇదే తొలిసారి. ఇక బౌలింగ్‌లో, బ్యాటింగ్‌తో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఇంగ్లాండ్‌..1992 తర్వాత మెగా టోర్నీలో ఫైనల్లో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. ఫైనల్లో న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ ఏ జట్టు గెలిచినా తొలిసారి ట్రోఫీ అందుకుని సంచలనం సృష్టిస్తుంది.

గురువారం ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్‌ పోరు ఏకపక్షంగా సాగింది. ఆసీస్‌ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 35 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి పూర్తిచేసింది.లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ స్టార్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (85; 65 బంతుల్లో 9ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగాడు. రాయ్‌కు తోడు రూట్‌ (40 నాటౌట్‌), మోర్గాన్‌ (40 నాటౌట్‌), బెయిర్‌ స్టో (34)లు రాణించడంతో ఇంగ్లండ్‌ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. మొదట ఆసీస్‌ 49 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటైంది. స్టీవెన్‌ స్మిత్‌ (85; 119 బంతుల్లో 6×4), కేరీ (46; 70 బంతుల్లో 4×4) పోరాడారు. క్రిస్‌ వోక్స్‌కు 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.

రాయ్‌ జోరు:

రాయ్‌ జోరు:

సునాయాస లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్లు రాయ్‌, బెయిర్‌స్టో అద్భుత ఆరంభాన్ని అందించారు. రాయ్‌ విజృంభించగా.. బెయిర్‌స్టో ఆచితూచి ఆడాడు. ఈ జోడి 10 ఓవర్లలో 50 పరుగులు జోడించి ఇంగ్లాండ్‌ విజయానికి గట్టి పునాది వేసింది. ఆ తర్వాత రాయ్‌ మరింత రెచ్చిపోయి బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. స్టార్క్‌ ఓవర్లో రెండు ఫోర్లతో రాయ్‌ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఓపెనింగ్‌ భాగస్వామ్యం విడధీద్దామని కెప్టెన్‌ ఫించ్‌.. 16వ ఓవర్లో పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ స్మిత్‌కు బంతినిచ్చాడు. రాయ్‌ వరుసగా మూడు సిక్స్‌లు కొట్టి 21 రన్స్‌ రాబట్టాడు.

ముగించిన రూట్‌, మోర్గాన్‌:

జట్టు స్కోరు 124 వద్ద బెయిర్‌స్టో (34; 43 బంతుల్లో 5×4)ను స్టార్క్‌ ఎల్బీగా ఔట్ చేసాడు. అప్పటికే తొలి వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యం నమోదయింది. అటు రూట్‌ క్రీజులోకి వచ్చీ రావడంతోనే 3 ఫోర్లతో అలరించాడు. ఈ దశలో 20వ ఓవర్‌లో అంపైర్‌ తప్పుడు నిర్ణయంతో రాయ్‌ క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఈ దశలో రూట్‌ (49 నాటౌట్‌; 46 బంతుల్లో 8×4), మోర్గాన్‌ (45 నాటౌట్‌; 39 బంతుల్లో 8×4) వరుస బౌండరీలతో విజృంభించి మూడో వికెట్‌కు అజేయంగా 79 రన్స్‌ జోడించి ఇంగ్లాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. ఇంగ్లండ్‌ 32.1 ఓవర్లలో 2 వికెట్లకు 226 పరుగులు చేసి నెగ్గింది.

స్మిత్ ఒంటరి పోరాటం:

స్మిత్ ఒంటరి పోరాటం:

అంతకుముందు టాస్‌ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకోగా.. కెప్టెన్‌ ఫించ్‌ (0) డకౌటయ్యాడు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ తొలి బంతికే ఆర్చర్‌ అతన్ని ఔట్‌ చేశాడు. మరుసటి ఓవర్లోనే డేవిడ్ వార్నర్‌ (9)ను పెవిలియన్‌ చేర్చిన వోక్స్.. హ్యాండ్స్‌కోంబ్‌ (4)ను బౌల్డ్‌ చేశాడు. 6.1 ఓవర్లలో 14 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయి ఆసీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ స్మిత్‌ (85; 119 బంతుల్లో 6×4), కేరీ (46; 70 బంతుల్లో 4×4) అసాధారణ పోరాటంతో జట్టును ఆదుకున్నాడు.

గాయంతోనే బ్యాటింగ్‌:

గాయంతోనే బ్యాటింగ్‌:

ఎనిమిదో ఓవర్‌లో పేసర్‌ ఆర్చర్‌ విసిరిన షార్ట్‌ బాల్‌ను ఆడే ప్రయత్నంలో అలెక్స్‌ క్యారీ గాయపడ్డాడు. అయినా క్యారీ (70 బంతుల్లో 46; 4 ఫోర్లు)తన బ్యాటింగ్ కొనసాగించాడు. మొదటగా స్మిత్ క్యారీతో కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. తర్వాత జాగ్రత్త పడుతూ స్కోర్ చేసాడు. ఇద్దరి జోడీ కుదురుకోవడంతో 72 బంతుల్లో స్మిత్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాలుగో వికెట్‌కు 103 పరుగులు జతయ్యాక క్యారీని, స్టొయినిస్‌ (0)ను రషీద్ ఔట్‌ చేశాడు. స్మిత్ జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశాడు. మ్యాక్స్‌వెల్‌ (23 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి జట్టు స్కోరును 150 పరుగులు దాటించిన స్మిత్‌... టెయిలెండర్లతో కలిసి 200 పరుగుల దాకా తీసుకెళ్లాడు. కమిన్స్‌ (6) విఫలమైనా.. స్టార్క్‌ (36 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడటంతో ఆసీస్ పోరాడే స్కోర్ చేసింది.

1
43690

{headtohead_cricket_2_1}

Story first published: Friday, July 12, 2019, 9:11 [IST]
Other articles published on Jul 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X