న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Pat Cummins: ఐపీఎల్లో అతనిపై కాసుల వర్షం కురవొచ్చు.. అతనికి యమ డిమాండ్ పక్కా.. కానీ అది మేనేజ్ చేసుకోవాలి

Cummins Felt That Cameron Green Would Get Big Price In IPL and Suggested to Manage His Workload

అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో ఆసీస్ నయా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఈ యువ ఆల్రౌండర్ పట్ల ఆస్ట్రేలియా టీం మేనేజ్ మెంట్ జాగ్రత్త వహించాలని.. అతని అవసరం జట్టుకు చాలా ఉందని.. అతనిపై ఎక్కువ వర్క్ లోడ్ పడకుండా సమర్థంగా మేనేజ్ చేయాలని ఆసీస్ టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నాడు. డిసెంబరు 2020 నుంచి ఆసీస్ తరఫున ఇప్పటికే 14టెస్టులు, 12వన్డేలు, 4 టీ20లు ఆడిన 23ఏళ్ల గ్రీన్.. 1000పరుగులు పూర్తి చేసుకున్నాడు. అలాగే 30వికెట్లు తీశాడు. టీ20ల్లో గ్రీన్ 193.54 స్ట్రైక్ రేట్‌తో 120పరుగులు చేశాడు. ఇటీవల భారత్‌తో జరిగిన టీ20లలో.. డేవిడ్ వార్నర్ గైర్హాజరీలో ఆరోన్ ఫించ్‌తో కలిసి గ్రీన్ ఓపెనింగ్లో బరిలోకి దిగాడు. ఓపెనర్‌గా అతను గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. మూడు మ్యాచ్‌లలో 61, 5, 52 పరుగులతో రఫ్ఫాడించాడు. ఈ సిరీస్లో 118పరుగులు చేశాడు. 19బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి మూడో టీ20ల్లో భారత బౌలర్లపై దండయాత్ర చేసిన సంగతి తెలిసిందే.

 వర్క్ లోడ్‌కు అనుగుణంగా షెడ్యూల్

వర్క్ లోడ్‌కు అనుగుణంగా షెడ్యూల్

ఇకపోతే కమిన్స్ మాట్లాడుతూ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గ్రీన్ పట్ల కాసుల వర్షం కురవవొచ్చని కమిన్స్ అభిప్రాయపడ్డారు. అయితే గ్రీన్‌కు పెరుగుతున్న క్రేజ్ వల్ల.. అతని పనిభారంపై కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం గురించి కమిన్స్ స్పష్టంగా పేర్కొన్నాడు. 'ఐపీఎల్లో ఆడడం గురించి మీరు ఎవరినీ నిందించలేరు. అతను ఎక్కడ ఆడినా అతనికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అతను ఏ లీగ్ ఆడాలో ఏదీ వద్దో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ అతనికే ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో చాలా క్రికెట్ ఉంది. అందువల్ల అతను తన వర్క్ లోడ్‌కు అనుగుణంగా షెడ్యూల్ రూపొందించుకోవాలి' అని కమిన్స్ ఓ కార్యక్రమంలో తెలిపాడు.

గాయాల బారిన పడకపోవడం లక్కీ

గాయాల బారిన పడకపోవడం లక్కీ

'గ్రీన్ గత రెండు సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. ఎలాంటి గాయాల బారిన పడకుండా కొనసాగడం లక్కీ అనే చెప్పాలి. అతను బౌలింగ్ బాగా చేసినా చేయకపోయినా బ్యాటింగ్‌లో ఆ లోటును తీర్చేసేలా రాణించగలడు. ప్రస్తుతం అతను మూడు ఫార్మాట్లలో ఉన్నాడు. అందువల్ల అతని వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ మరింత ముఖ్యమైనది. అతను నిరంతరం ఆడటాన్ని ఇష్టపడే వ్యక్తి. రాబోయే కొద్ది నెలల్లో 15టెస్టులు, ప్రపంచ కప్, ఇంకా చాలా క్రికెట్ లీగ్‌లు ఉన్నాయి' అని కమిన్స్ అన్నాడు. అయితే గ్రీన్ టీ20 ప్రపంచ‌కప్ ఆసీస్ జట్టుకు ఎంపిక కాలేదు. అయితే అతన్ని ఎవరైన గాయపడితే తీసుకునే వీలుంది.

కెమరూన్ గ్రీన్ విధ్వంసకాండ

కెమరూన్ గ్రీన్ విధ్వంసకాండ

ఇక హైదరాబాద్‌లో జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్‌‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కెమరూన్ గ్రీన్ విధ్వంస కాండ రచించాడు. అతను భువీ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే సిక్స్, మూడో బంతికి ఫోర్ కొట్టి తన ప్రతాపాన్ని కొనసాగించాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ వేసిన రెండో ఓవర్లో 2ఫోర్లు కొట్టాడు. ప్రతి బంతి హిట్టింగ్ కోసమే చూశాడు. ఇక మూడో ఓవర్ బుమ్రా వేయగా అతని బౌలింగ్లో ఒక ఫోర్, రెండు సిక్సులు కొట్టి ఔరా అనిపించాడు. అతని దెబ్బకు స్టేడియంలో ప్రేక్షకులు కూడా సైలెంట్ అయిపోయారు. వీడెవడ్రా బాబు ఇలా కొడుతున్నాడు అనిపించింది. నాలుగో ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్లో చివరి మూడు బంతులను వరుసగా గ్రీన్ ఫోర్లు బాదాడు. ఈ క్రమంలో 19బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఇండియాపై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. అలాగే మ్యాక్స్ వెల్, వార్నర్ తర్వాత 19బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా కూడా నిలిచాడు.

Story first published: Friday, September 30, 2022, 19:01 [IST]
Other articles published on Sep 30, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X