న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs PBKS Dream11 Prediction: డ్రీమ్11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్! పిచ్ రిపోర్ట్, తుది జట్లు ఇవే!

CSK vs PBKS Dream11 Prediction: Captain, Vice-Captain Tips And Playing XI, Pitch Report For Match 53

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా గురువారం (సెప్టెంబర్ 7) చెన్నై సూపర్ కింగ్స్‌, పంజాబ్ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్ 2021లోని 53వ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. చెన్నై, పంజాబ్ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుండగా.. టాస్ మధ్యాహ్నం మూడు గంటలకు పడనుంది.

ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక ఓటీటీలో కూడా ఈ మ్యాచ్‌ను చూడాలనుకునే ఫాన్స్ హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. చెన్నై ఇప్పటికే ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. కింగ్స్‌ను ఓడించడం ద్వారా టాప్ 2లో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు కింగ్స్‌ దాదాపుగా ప్లే ఆఫ్‌ నుంచి నిష్క్రమించినా ఏదో చిన్న ఆశ ఉంది.

హెడ్ టు హెడ్ రికార్డ్స్

హెడ్ టు హెడ్ రికార్డ్స్

ఈ సీజన్‌లో జరుగుతోన్న 53వ మ్యాచ్‌ చెన్నై సూపర్ కింగ్స్‌, పంజాబ్ కింగ్స్‌ జట్ల మధ్య దుబాయ్ మైదానంలో జరగనుంది. ఐపీఎల్ టోర్నీలో భాగంగా చెన్నై​, పంజాబ్ జట్లు 25 సార్లు తలపడ్డాయి. ఇందులో చెన్నై 16 సార్లు గెలుపొందగా.. పంజాబ్ 9 విజయాలు అందుకుంది. ఐపీఎల్ 2021లో చెన్నై​, పంజాబ్ తలపడిన మ్యాచులో ధోనీసేన విజయం సాదించింది. ఇరు జట్ల మధ్య చివరి ఐదు మ్యాచుల్లో నాలుగు చెన్నై​, ఒకటి పంజాబ్ గెలిచింది.

దుబాయ్ మైదానంలో ఇరు జట్ల మధ్య ఓ మ్యాచ్ జరగ్గా.. చెన్నై విజయాన్ని అందుకుంది. దుబాయ్ వికెట్‌పై సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 160. మ్యాచుకు ఎలాంటి వర్షపు ముప్పులేదు. ఇక్కడ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ ఉండనుంది. దుబాయ్ మైదానం పెద్దది కాబట్టి భారీ స్కోర్ నమోదు కావడం అసాధ్యమే.

పటిష్టంగా చెన్నై

పటిష్టంగా చెన్నై

గత సంవత్సరం పేలవమైన ప్రదర్శనను కనబర్చిన చెన్నై సూపర్ కింగ్స్.. ఈ ఏడాది మాత్రం అద్భుతంగా రాణిస్తోంది. చెన్నైని ఓడించడం అంత సులభం కాదనే స్థాయిలో ఆ జట్టు ప్లేయర్స్ ఆడుతున్నారు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్ ఫామ్​లో ఉండటం చెన్నైకి కలిసొచ్చే అంశం.

మొదట బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్ చేసినా మంచి ఆరంభాలు ఇస్తున్నారు. వీరికి తోడు మొయిన్ అలీ, అంబటి రాయుడులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా అలీ బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణిస్తున్నాడు. అయితే సురేష్ రైనా, ఎంఎస్ ధోనీ పేలవమైన ఫామ్ చెన్నైకి ఆందోళన కలిగించే విషయం. రవీంద్ర జడేజా ఆల్ రౌండర్‌గా తన ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు.

డ్వేన్ బ్రావో ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్నాడు. సామ్ కరన్ ఆకట్టుకున్నాడు. శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, జోష్ హాజెల్‌వుడ్ కూడా తమ బాధ్యత నిర్వర్తిస్తూ విజయాల్లో భాగమవుతున్నారు. మొత్తానికి చెన్నై పటిష్టంగా ఉంది.

RCB vs SRH: అందుకే ఓడిపోయాం.. టీమిండియా క్రికెట్‌కు అది శుభపరిణామం: కోహ్లీ

పంజాబ్ గెలిచినా

పంజాబ్ గెలిచినా

కేఎల్ రాహుల్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. ఒకవేళ గెలిచినా మిగతా జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. లోకేష్ రాహుల్ ఇప్పటివరకు 528 పరుగులు చేయగా.. మయాంక్ అగర్వాల్ 429 పరుగులు అందించాడు. కానీ అతని ఇతర బ్యాట్స్‌మన్‌లు పెద్దగా ఆడలేకపోయారు.

ఇది పంజాబ్‌కు పెద్ద ఇబ్బందిగా మారింది. మన్​దీప్ సింగ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా విఫలమవుతున్నారు. దీంతో మంచి శుభారంభం లభిస్తున్నా చివర్లో చతికిలపడుతోంది పంజాబ్. ఇడెన్ మర్క్​రమ్ కూడా పెద్దగా ప్రభావం చూపడం లేదు. ప్రస్తుతం పంజాబ్ జట్టుకు మిడిలార్డర్ సమస్య పెద్ద సమస్యగా మారింది.

లోనూ రవి బిష్ణోయ్ తప్ప ఎవరూ అనుకున్నంతగా రాణించలేకపోతున్నారు. మొహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ వికెట్లు సాధిస్తున్నా.. చివర్లో ధారాళంగా పరుగులు సమర్పిస్తున్నారు. హర్​ప్రీత్ బ్రర్ మెరుపులు ఒక మ్యాచుకే పరిమితం అయ్యాయి.

తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, మోయిన్ అలీ, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప, ఎంఎస్ ధోనీ, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, జోష్ హాజెల్‌వుడ్.

పంజాబ్ కింగ్స్: లోకేష్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, షారుఖ్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, మొయిసెస్ హెన్రిక్స్, హర్‌ప్రీత్ బ్రార్, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్.

డ్రీమ్11 టీమ్

డ్రీమ్11 టీమ్

లోకేష్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, మయాంక్ అగర్వాల్, ఫాఫ్ డుప్లెసిస్ (వైస్ కెప్టెన్), అంబటి రాయుడు, షారుఖ్ ఖాన్, మోయిసెస్ హెన్రిక్స్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, అర్షదీప్ సింగ్, దీపక్ చహర్.

Story first published: Thursday, October 7, 2021, 12:21 [IST]
Other articles published on Oct 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X