RCB vs SRH: అందుకే ఓడిపోయాం.. టీమిండియా క్రికెట్‌కు అది శుభపరిణామం: కోహ్లీ

అబుదాబి: మొదటగా బౌలింగ్‌లో బాగా రాణించినా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనే సరైన ప్రదర్శన చేయలేకపోయామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, తమని భారీ షాట్లు ఆడనివ్వకుండా నిలువరించారన్నాడు. గ్లెన్ మాక్స్‌వెల్ రనౌట్ కావడమే ఈ మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ అని కోహ్లీ చెప్పాడు. బుధవారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ నాలుగు పరుగుల తేడాతో బెంగళూరుపై అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే.
చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. తొలి 3 బంతుల్లో భువనేశ్వర్ కుమార్ ఒక్క పరుగే ఇచ్చాడు. నాలుగో బంతికి ఏబీ డివిలియర్స్ సిక్స్ బాదడంతో తీవ్ర ఉత్కంఠ రేగింది. కానీ తర్వాతి రెండు బంతులకు ఏబీ షాట్లు ఆడలేకపోవడంతో ఆర్‌సీబీకి ఓటమి తప్పలేదు.

అప్పటివరకు పోటీలోనే ఉన్నాం
మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'మేం వీలైనంత త్వరగా మ్యాచ్‌ను పూర్తి చేయాలనుకున్నాం. ఇలాంటి స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లను చివరి ఓవర్ వరకూ తీసుకెళ్లాలనుకోలేదు. కానీ ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు, మూడు వికెట్లు కోల్పోవడంతో ఇన్నింగ్స్‌ను తిరిగి నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అయితే గ్లెన్ మాక్స్‌వెల్ రనౌట్ కావడమే ఈ మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.
ఇక ఏబీ డివిలియర్స్ క్రీజులో ఉన్నంతవరకూ మేం పోటీలో ఉన్నామనే అనుకున్నాం. కానీ నిరాశే ఎదురైంది. తొలుత బౌలింగ్‌లో బాగా రాణించినా.. బ్యాటింగ్‌లోనే సరైన ప్రదర్శన చేయలేకపోయాం. ఈ క్రమంలోనే చివర్లో షాబాజ్ అహ్మద్ (14) విలువైన పరుగులు చేశాడు' అని అన్నాడు.
RCB vs SRH: విలియమ్సన్ అదరహో.. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అదే!!

ఇది టీమిండియా క్రికెట్‌కు శుభపరిణామం
'ఇది స్వల్ప స్కోర్ల మ్యాచ్ అయినా సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరిబంతి వరకూ పోరాడింది. ఆఖర్లో వాళ్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి మమ్మల్ని భారీ షాట్లు ఆడనివ్వకుండా అడ్డుకున్నారు. మాది ప్రొఫెషనల్ జట్టు అయినందున గెలుపోటములను సమానంగా స్వీకరిస్తాం. ఒక్కోసారి ఇలాంటి ఓటములు ఎదురవుతుంటాయి.
అయినా మేం ముందుకు సాగుతుంటాం. ఐపీఎల్ టోర్నీ ప్రతి సంవత్సరం కొత్త ఆటగాళ్ల ప్రతిభను వెలుగులోకి తెస్తుంది. ఈసారి కూడా యువకులు వెలుగులోకి వచ్చారు. ఉమ్రాన్ మాలిక్ లాంటి యువకుడు 150 కిమీ వేగంతో బౌలింగ్ చేయడం చాలా బాగుంది. ఫాస్ట్ బౌలర్లు ఇలా రాణించడం టీమిండియా క్రికెట్‌కు శుభపరిణామం. జట్టులో తీవ్ర పోటీ ఉంటుంది' అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.

ఉమ్రాన్ మాలిక్ ప్రత్యేకం
సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ... 'చిన్న చిన్న మార్పులతో ఇలాంటి ఫలితాలు సాధించడం బాగుంది. మేం చేసింది 141 పరుగులే అయినా.. బెంగళూరును అడ్డుకోవడానికి సరిపోతాయనుకున్నాం. చివరి వరకూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే.. గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం. ఎలాగైనా గ్లెన్ మాక్స్‌వెల్‌ను ఔట్ చేయాలనుకున్నాం.
అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. మేం ప్లే ఆఫ్స్ పోటీలో లేకున్నా ఆటగాళ్లలో ఇలాంటి పట్టుదల చూడటం బాగుంది. మా బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ ప్రత్యేకమని చెప్పాలి. అతడు నెట్స్‌లోనూ బాగా సాధన చేస్తాడు. ముఖ్యంగా స్లో పిచ్‌లపైనా తన ప్రభావం చూపిస్తున్నాడు. అతడికి జట్టులో చాలా మంది సీనియర్లు సహకరిస్తున్నారు. చివరి మ్యాచ్‌ను గెలుస్తామనే నమ్మకం ఉంది' అని చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications