న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రైనా అర్ధ శతకం.. కోల్‌కతాపై చెన్నై విజయం

IPL 2019 : Chennai Super Kings Continue With Their Winning Ways || Oneindia Telugu
CSK vs KKR: Suresh Raina gets Fifty, Chennai won by 5 wkts

ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో చెన్నై ఈ సీజన్‌లో ఏడవ విజయాన్ని నమోదు చేసి 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. చెన్నై మరో విజయం తన ఖాతాలో వేసుకుంటే.. ప్లే అఫ్ కు అర్హత సాధిస్తుంది. లీగ్ దశలో చెన్నైకి ఇంకా 6 మ్యాచ్‌లు ఉన్నాయి కాబట్టి ప్లే అఫ్ కు వెళ్లడం లాంఛనమే.

ఓపెనర్ల శుభారంభం:

ఓపెనర్ల శుభారంభం:

162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నైకి ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. గర్నే వేసిన 3వ ఓవర్ తొలి బంతికి ఓపెనర్ వాట్సన్ (6) ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ డుప్లెసిస్ వరుస బౌండరీలతో హోరెత్తించాడు. అయితే సునీల్ నరైన్ వేసిన ఆరో ఓవర్ మూడో బంతికి డుప్లెసిస్ (24) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఆదుకున్న రైనా:

ఆదుకున్న రైనా:

స్పిన్నర్ చావ్లా వేసిన 10 ఓవర్ తొలి బంతికి అంబటి రాయుడు (5) ఊతప్పకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. రైనా మాత్రం నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. ఈ క్రమంలో కేదార్ జాదవ్‌ (20), ఎంఎస్ ధోనీ (16)లతో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పి ఆదుకున్నాడు.

రైనా అర్ధ శతకం.. జడ్డు మెరుపులు:

రైనా అర్ధ శతకం.. జడ్డు మెరుపులు:

జాదవ్‌, ధోనీ అవుట్ అవ్వడంతో కష్టాల్లోపడ్డ జట్టుకు రైనా అండగా నిలిచాడు. ఈ క్రమంలో రైనా 58 (42 బంతుల్లో; 7 ఫోర్లు, 1 సిక్సు) అర్ధ శతకం చేసాడు. మరోవైపు జడేజా 31 (17 బంతుల్లో; 5x4) కూడా మెరుపులు మెరిపించడంతో చెన్నై 19.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసి విజయం సాధించింది. కోల్‌కతా బౌలర్లలో చావ్లా, నరైన్ తలో రెండు వికెట్లు తీశారు.

క్రిస్‌లిన్‌ మెరుపులు:

క్రిస్‌లిన్‌ మెరుపులు:

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఓపెనర్ క్రిస్‌లిన్‌ 82( 51 బంతుల్లో 7x4, 6x6) అర్ధ శతకం మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయడంలో విఫలమయ్యారు. కోల్‌కతా ఇన్నింగ్స్ లో చెన్నై స్పిన్నర్ ఇమ్రాన్‌ తాహిర్‌ నాలుగు కీలక వికెట్లు తీసి కోల్‌కతా వెన్ను విరిసాడు. దీంతో కోల్‌కతా 161 పరుగుల సాధారణ స్కోరుకే పరిమితమైంది.

Story first published: Sunday, April 14, 2019, 20:54 [IST]
Other articles published on Apr 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X