న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs DC: టాస్ గెలిచిన చెన్నై.. ఢిల్లీదే బ్యాటింగ్.. ఇరు జట్లలో మార్పులు!

CSK vs DC: Chennai Super Kings won the toss and elect to field first

దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ పరిస్థితులు, డ్యూ ప్రభావం కారణంగానే ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు చెన్నై సారథి ఎంఎస్ ధోనీ స్పష్టం చేశాడు. ఇరు జట్లలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. గత మ్యాచ్‌లో తేలిపోయిన లుంగిడి ఎంగిడి స్థానంలో జోష్ హజల్ వుడ్ చెన్నై జట్టులోకి రాగా.. గాయపడ్డ అశ్విన్ స్థానంలో అమిత్ మిశ్రా, మోహిత్ శర్మకు బదులుగా అవేశ్ ఖాన్ ఢిల్లీ జట్టులోకి వచ్చారు.

ఇక అనుభవపూర్వకమైన ఆటగాళ్లతో సీఎస్‌కే.. యువ రక్తంతో ఉన్న ఢిల్లీ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. కింగ్స్ పంజాబ్‌తో ఓడే మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌తో విజయాన్నందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. అదే ఉత్సాహాన్ని కొనసాగించాలని భావిస్తుంది. మరోవైపు తమకంటే తక్కువ స్థాయి టీమ్.. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి షాక్‌కు గురైన సీఎస్‌కే‌ ఢిల్లీని ఓడించి మళ్లీ విజయాలబాట పట్టాలని ఉవ్విళ్లూరుతోంది.

ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 21 సార్లు తలపడగా 15-6తో చెన్నై లీడ్‌లో ఉంది. ఇదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని ధోనీసేన భావిస్తుండగా.. ముఖాముఖి రికార్డు మార్చుకోవాలని ఢిల్లీ ఆత్మవిశ్వాసంతో ఉంది.

తుది జట్లు
చెన్నై సూపర్ కింగ్స్: షేన్ వాట్సన్, ఫాఫ్ డూప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, సామ్ కరన్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, కీపర్), దీపక్ చాహర్, కరన్ శర్మ, పియూష్ చావ్లా, జోష్ హజల్‌వుడ్

ఢిల్లీ క్యాపిటల్స్: ఢిల్లీ క్యాపిటల్స్, పృథ్వీ షా, శిఖర్ ధావన్, షిమ్రాన్ హెట్‌మైర్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రిషభ్ పంత్, మార్కస్ స్టోయినిస్, అక్సర్ పటేల్, అమిత్ మిశ్రా, అన్రిచ్ నోర్జ్, అవేశ్ ఖాన్.

Story first published: Friday, September 25, 2020, 19:15 [IST]
Other articles published on Sep 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X