న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Unique IPL record: చెన్నై సీమర్ దీపక్ చాహర్ అరుదైన రికార్డు

CSK seamer Deepak Chahar creates unique IPL record after splendid spell against KKR

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ అరుదైన రికార్డుని నెలకొల్పాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాడయి. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతాపై చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో దీపక్ చాహర్ ఐపీఎల్‌లో ఏ బౌలర్‌కు సాధ్యం కాని రికార్డుని నెలకొల్పాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహర్ 20 డాట్ బాల్స్ వేశాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

నెహ్రా నెలకొల్పిన 19 డాట్ బాల్స్ రికార్డుని

నెహ్రా నెలకొల్పిన 19 డాట్ బాల్స్ రికార్డుని

ఈ క్రమంలో గత సీజన్లలో ఆశిష్ నెహ్రా నెలకొల్పిన 19 డాట్ బాల్స్ రికార్డుని దీపక్ చాహర్ బద్దలు కొట్టాడు. 2009లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆశిష్ నెహ్రా ఈ రికార్డుని నెలకొల్పాడు. ఈ సీజన్‌లో దీపక్ చాహర్ సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు.

8 వికెట్లు పడగొట్టిన దీపక్ చాహర్

8 వికెట్లు పడగొట్టిన దీపక్ చాహర్

ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో దీపక్ చాహర్ 7.24 ఎకానమీ రేట్‌తో 8 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మంగళవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో దీపక్ చాహర్... కోల్‌కతా డేంజరస్ బ్యాట్స్‌మన్ క్రిస్ లిన్, రాబిన్ ఊతప్ప, నితీష్ రాణాలను పెవిలియన్‌కు చేర్చాడు.

24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో

24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో

దీంతో కోల్‌కతా 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, కోల్‌కతా విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రీ రసెల్‌ 44 బంతుల్లో 50 నాటౌట్‌ (5 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. అనంతరం 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చెన్నై 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది.

Story first published: Wednesday, April 10, 2019, 18:14 [IST]
Other articles published on Apr 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X